ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి ఉత్సవాలు

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు జిల్లా పరిధిలోని అన్ని మున్సిపల్ డివిజన్లో పతాకావిష్కరణ మరియు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించే కార్యక్రమము నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు తమకు తోచిన విధంగా అన్నదానం, పండ్లు పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జిహెచ్ఎంసి పారిశుద్ధ కార్మికులకు దుప్పట్లు (రగ్గులు) పంపిణీ చేయడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమానికి పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ కార్యక్రమం, అన్నదానం చేపట్టడం జరిగింది.

సందర్బంగా పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్  మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఈనాటికీ కేవలం రాజకీయాల కోసమే కాకుండా సేవా దృక్పథంతో, సేవా భావంతో ఉండడమే తెలుగుదేశం పార్టీ ఆదర్శం అని, అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలతో మమేకమై ఉండడమే తెలుగుదేశం ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. తెలంగాణలో పటేల్ పట్వారి వ్యవస్థను రూపుమాపి సామాన్యునికి రాజకీయ భవిష్యత్తును కల్పించిన ఘనత ఎన్టీఆర్ ది. సమాజంలో ఉన్న వర్గాలకు రాజకీయాలలో చైతన్యం కల్పించడం, అన్ని వర్గాల ప్రజలకి సమాన న్యాయం చేసిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు సంక్షేమ అంటూ అన్ని పార్టీలు ప్రచార ఆర్బాటాలు చేస్తున్నవన్నీ ఎప్పుడో ఎన్టీఆర్ చేపట్టిన పథకాలేనని అన్నారు. తెలంగాణలో దేశం లో అభివృద్ధి సంక్షేమం ప్రారంభమైంది ఎన్టీఆర్ వల్లనే. ఆనాడు ఆయన చేపట్టిన రెండు రూపాయలు కిలో బియ్యం గాని, జనతా వస్త్రాలు గాని, సగం ధరకే కరెంటు, ఆడబిడ్డకు ఆస్తిలో సగభాగం, దున్నే వాడిదే భూమి ఇలాంటి ఏన్నో సంక్షేమ పథకాలు ఆయన ప్రారంభించినవే. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో చేపతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయనే ఆద్యుడు. ఆయన చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలిచాయని అందుకే ఈ నాటికి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఎన్టీఆర్.

పార్లమెంటు అధ్యక్షులు పి.సాయిబాబా మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఎన్టీఆర్ ఆదర్శాల కోసం అందరూ కృషి చేస్తామని తెలియజేస్తూ, ఈ సందర్భంగా జరిగిన వర్ధంతి సభలో ఎన్టీఆర్ కి భారతరత్న వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. భారతరత్న ప్రకటించ నట్లయితే ఉభయ తెలుగు రాష్ట్రాల మనోభావాలు దెబ్బతీసిన వారు అవుతారని, రేపు రాబోయే ఎన్నికల్లో ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూపిస్తామని హెచ్చరించారు. ఆయన శత జయంతి సంవత్సరం సందర్భంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ప్రకటించి, తెలుగు ప్రజల మనోభావాలను గౌరవించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేనిపక్షంలో ఆంధోళన పరిస్థితులు ఉంటాయని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రసిడెంట్ నల్లెల్ల కిషోర్, ప్రధాన కార్యదర్శి పి.బాలరాజ్ గౌడ్, పెద్దోజు రవీంద్రాచారి, రామ్ నారాయణ్ యాదవ్, నగు నగేష్, అన్నపూర్ణ, శాఁతి, ప్యాట నంద కిషోర్, కట్ట రాములు, జి.యాదగిరి రావు, భాస్కర్,భవాని శ్రీనివాస్, నల్లాఅనిల్, బాలకృష్ణ, వీరబబు, ఎ.ఎస్.రావు, ఎస్.ప్రకాష్, రాజ శేఖర్, జోగింధర్ సింగ్, జయరాజ్, విజయ్ రాఠీ, ప్రదీప్ జైస్వాల్, సత్యనారాయణ, భాను ప్రకాష్, వినోద్, యాదగిరి, అన్నమ్మ, రబ్బాని, చంద్ర మోహన్, శక్తిప్రేమ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply