రెండు గంటల ముందే వైసీపీ కార్యకర్తలు పాదయాత్ర దారిలో హల్ చేస్తే ఎందుకు నియంత్రించలేదు?
– టికెట్ రాదన్న భయంతో గ్రంధి శ్రీనివాస్.. గూండా శ్రీనివాస్ గా మారాడు
– ధూళిపాళ్ళ నరేంద్ర
లోకేష్ యువగళం పాదయాత్ర ఏ మార్గం గుండా వస్తుందో వివరాలు పోలీసులకు ముందే సమాచారం ఇస్తున్నాం..భీమవరంలో పోలీసులు అనుమతి ఇచ్చిన మార్గంలోనే లోకేష్ పాదయాత్రగా వెళ్ళారు. గునుపూడిలో జరిగిన వైసీపీ కార్యకర్తల దాడి పోలీసులు నిర్లక్ష్యంతోనే జరిగింది.లోకేష్ వస్తున్నారన్న సమాచారంతో తాడేరు వద్ద వైసీపీ కార్యకర్తలు రెండు గంటల ముందు నుండే భయానక వాతావరణం సృష్టించారు.
వైసీపీ మూకలను పోలీసులు ఎందుకు నిలువరించలేదు? సీఐ శ్రీను వైసీపీ కార్యకర్తలకు రక్షణగా ఉండటంతో పాటు.. ఏ విధంగా దాడికి రావాలో సలహాలు ఇచ్చారు. నేను జగన్ అభిమానిని అంటూ సీఐ సవాల్ చేయడం పోలీస్ వ్యవస్థకే సిగ్గుచేటు. ఘటన జరుగుతున్న ప్రదేశంలోనే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, అతని అతనుచరులు ఉండి విధ్వంసానికి ప్రోత్సాహించారు.
వైసీపీ సైకోలు విసిరిన రాళ్ల నుండి లోకేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు ఛాతిపై గాయమైంది. గతంలో అదే ప్రదేశంలో పవన్ కళ్యాణ్ ను కూడా అడ్డుకోవాలని చూసి.. గొడవ సృష్టించారు. ఎమ్మెల్యే టికెట్ రాదన్న భయంతో జగన్ దగ్గర మార్కులు కొట్టేయడానికి గ్రంధి శ్రీనివాస్.. గూండా శ్రీనివాస్ గా మారాడు. వాలంటీర్లకు దెబ్బలు తగిలాయి.. మీడియా మిత్రులకు గాయాలయ్యాయి.
అయినా వాలంటీర్లనే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వాలంటీర్లను రాత్రి నుండి స్టేషన్ కు తీసుకెళ్లకుండా తిప్పుతూ వైసీపీ నేతలకు చెందిన రహస్య ప్రాంతాలకు తరిలించడం ఏంటి? వాలంటీర్లను తక్షణమే విడుదల చేయాలి. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడం.. ధీటుగా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. చౌకబారు పనులు ఇప్పటికైనా మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు.