సంవత్సరాది రోజు – కుటుంబసభ్యులు అందరూ – సూర్యోదయపు పూర్వము నువ్వుల నూనె ఒంటికి రాసుకొని, శీకాయపొడి లేదా కుంకుళ్ళుతో అభ్యంగన స్నానమాచరించాలి.
ఈ అభ్యంగన స్నాన విధి వలన జ్యేష్టాదేవి నిష్క్రమించి, లక్ష్మీ శక్తులకి ఆహ్వానం కలుగుతుంది.
సంవత్సరాది రోజు ప్రాతఃకాల ప్రథమ పూజ అనంతరం, ‘ఉగాది పచ్చడి’ నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి.
ఉగాది పచ్చడి నివేదన అయ్యేంతవరకూ… కాఫీ, టీ, పాలు, అల్పాహారము స్వీకరించకూడదు.
తిథి దేవత, నక్షత్ర దేవత, వార దేవత, మాస దేవత, సంవత్సర దేవత, నవగ్రహ దేవతల మరియు ఇంద్రాది దిక్పాలక దైవిక శక్తుల అనుగ్రహాన్ని స్వీకరించుటకు ఏకైక మార్గం – “పంచాంగం పూజ” మరియు “పంచాంగ శ్రవణము” లలో ప్రత్యక్ష్యంగా పాల్గొనుట.
నూతన సంవత్సరపు వేళలో – సద్బ్రాహ్మణుని నూతన వస్త్రాలతో సత్కరించుట మహాపుణ్యప్రదము.
చైత్ర శుద్ధ పాడ్యమి నాడు – “హనుమత్ కాషాయ ధ్వజాన్ని” అర్చించి, ఇంటి ఆవరణలో ఎగురవేసినట్లైతే ఆ గృహానికి – సంపూర్ణ రక్షణ కలుగుతుంది.
‘కుష్మాండము’ ను ( బూడిద గుమ్మడికాయ ) పూజచేసి, ఇంటిముంగిట కుష్మాండ ధారణ చేయడం వలన గృహ మరియు వాస్తుదోషాల ఉపశమనము.
“శ్రీ విశ్వావసు” నామ సంవత్సర ఉగాదినాడు భగవంతునికి నివేదించిన ప్రసాదాన్ని మరియు వస్త్రాలను పేదవారికి వితరణ విధేయతతో అనుసరించాలి.