-ఆరోగ్యశ్రీపై ప్రచార్బాటం తప్ప చిత్తశుద్ది లేదు
– టీడీపీ శాసనసభ్యులు డా. డోలా బాలవీరాంజనేయస్వామి
వైసీపీ పాలనలో వైద్య రంగం నిర్వీర్యమైంది, ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేవు, రోగులకు సరిపడా మందులు లేవు. సీఎం, ఆరోగ్య శాఖా మంత్రి సమీక్షలకే పరిమిత మయ్యారు తప్ప సమస్యల పరిష్కారంపై దృష్టి సారించటం లేదు. ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కార్డుల్ని ప్రైవేట్ హాస్పిటల్స్ బేకతార్ చేస్తున్నాయి.
ప్రవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కార్డును చూపిస్తే కనీసం లోపలికి రానివ్వటం లేదు. సీఎం జగన్ ఆర్భాటంగా ప్రకటిస్తూ 1000/ రూపాయలు నుండి 10 లక్షల వరకు పేదలకు ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ కార్డు వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఊదరగొట్టారు. తీరా ఇప్పుడు ఆరోగ్యశ్రీ యొక్క కార్డులు చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రవేట్ ఆస్పత్రులు అనుమతించటం లేదు.
ఆరోగ్యశ్రీ కార్డుల బకాయిలు ఉన్నాయనీ, నెట్వర్క్ హాస్పిటల్స్ అడ్మిషన్లు నిరాకరిస్తున్నాయి. సీరియస్ కేసుల్ని కూడా అడ్మిషన్ చేసుకోవడం లేదు. జగన్ రెడ్డి పాలన గాలికొదిలి ప్రతిపక్షాలపై కక్షసాధింపులకు దిగుతూ పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. సీఎం, వైద్య శాఖామంత్రి ఆరోగ్యశాఖపై దృష్టి సారించాలి. ఆరోగ్యశ్రీ కార్డు నిరాకరిస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి.