Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీకి భయమెందుకు?

-లోకేశ్ పాదయాత్ర చేసినా, చంద్రబాబు ఢిల్లీ వెళ్లినా, పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేసినా వైసీపీకి భయమెందుకు?
– టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

రాయలసీమ ప్రాంత ప్రజలకు జగన్ పై ఎంతటి వ్యతిరేకత ఉందో లోకేశ్ పాదయాత్రకు వస్తున్న జనాన్ని చూస్తేనే తెలుస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు. మైదుకూరు నియోజకవర్గంలో యువగళం క్యాంప్ సైట్ నుండి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వైసీపీకి ఎక్కడ తమ కూసాలు కదిలిపోతాయోనని భయం పట్టుకుంది. చంద్రబాబు నాయడు ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో కలిసి దేశ, రాష్ట్ర సమస్యల గురించి ప్రస్తావిస్తే.. చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావడానికి పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని సజ్జల అవాకులు, చవాకులు పేలుస్తున్నారు. జగన్ నెలకు రెండు సార్లు ఢిల్లీ ఎందకు వెళ్తున్నారో సమాధానం చెప్పాలని సజ్జలను సూటిగా ప్రశ్నిస్తున్నాం. కేసుల మాఫీ కోసం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. దానికి మేమేనాలి?

వివేకా హత్య కేసు నుండి తన కుటుంబ సభ్యులను, అవినాశ్ రెడ్డిని తప్పించమని ప్రాధేయపడటానికి ఢిల్లీ వెళ్తున్నారని తెలుస్తోంది. ఈ విషయాలను సకలశాఖామంత్రి స్పష్టం చేయాలి. సజ్జల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధులు రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం సీఎం ఢిల్లీ వెళ్లారని చెప్పలేకున్నారు. హోంమంత్రి, ఆర్థిక శాఖ మంత్రిని కలిసినట్లు ఏరోజైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా?
మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ కేసుల మాఫీ కోసమే జగన్ ఢిల్లీ వెళ్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి మాత్రం కాదు. మీ మీద ప్రజలు దాడులు చేయకుండా ఉండేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. చంద్రబాబు అమిత్ షాను కలిస్తేనే వైసీపీకి లాగులు తడుస్తున్నాయి. అందుకే సజ్జల ఎగిసి పడుతున్నాడు. వైసీపీ చేసే అరాచకాలు, విధ్వంసాలకు ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో అని వైసీపీకి భయం పట్టుకుంది. పొత్తులు ఉన్నా, లేకున్నా 2023 ఆఖర్లోనో లేదా 2004లో ఎన్నికలు జరిగినా తెలుగుదేశం ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వారాహి వాహనంలో యాత్రను ప్రారంభిస్తానని చెబితే దాన్ని వక్రీకరించి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. 175కు 175 సీట్లు వస్తాయని మాట్లాడే మీరు రాష్ట్రానికి ఏం చేశారు? డిఫ్యాక్టో ముఖ్యమంత్రి సజ్జల టీడీపీ పై వ్యంగంగా మాట్లాడటానికి విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా.. ఎన్ని అడ్డంకులు కలిగించినా లోకేశ్ పాదయాత్ర వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.

ప్రతిపక్ష పార్టీపై నిందలు వేయడం సరికాదు. యవగళం కు వచ్చే జన ప్రభంజనాన్ని చూసి వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవాలని, విధ్వంసాలు సృష్టించాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కిరాయి మూకలతో లోకేశ్ పై కోడిగుడ్లు వేయించారు. ప్రజల్లో ధ్వేషాన్ని రగిల్చాలని చూస్తున్నారు. లోకేశ్ పాదయాత్రలో వైసీపీ ఫ్లెక్సీలేంటి?

కడప జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన 3 బహిరంగ సభల్లోను, పాదయాత్రకు లభించిన ప్రజా మద్దతు వెలకట్టలేనిది. రాష్ట్రంలో ఇంతటి అఖండ మద్దతు ఎవరికీ లభించి ఉండదు. వైసీపీ అవినీతి, అక్రమాలు ఇంకెన్నాళ్లో సాగవు. ఇప్పటికైనా రాయలసీమ వాసుల సమస్యల పరిష్కారం వైసీపీ ప్రభుత్వం కోసం కృషి చేయాలి. జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే ఎన్నికలకు పోవాలని టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం. సజ్జల అవాకులు, చవాకులు పేలిస్తే చూస్తూ ఊరుకునేదిలేదని హెచ్చరిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు.

టీడీపీ అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్
సకల శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు లోకేష్ లపై అవాకులు చవాకులు పేల్చారు. లోకేష్ కు పుట్టుకతోనే మానసిక వైకల్యం ఉందని చెప్పారు. టిడిపి మేనిఫెస్టోను విమర్శించే అర్హత ఎవరికీ లేదు. ప్రజలు టీడీపీని నమ్మరని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారని సకల శాఖ మంత్రి చెప్పడం విడ్డూరం.

సజ్జలే పుట్టుకతో మానసిక వికలాంగుడు. నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని సీఎంకు, సజ్జలకు, వైసీపీ నాయకులకు దేవుడు శాపం పెట్టినట్లు ఉన్నాడు, లేచింది మొదలు అబద్ధాలే మాట్లాడుతున్నారు. టీడీపీ మేనిఫెస్టో, నాయకత్వం గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదు. వైసీపీ మేనిఫెస్టోను 98.5 శాతం నెరవేర్చామని అబద్ధాలు చెబుతున్నారు.

టీడీపీ మేనిఫెస్టోను ప్రజలు నమ్మరని చెప్పడానికి ఎంత ధైర్యం? వైసీపీ నాయకులు సీపీఎస్ ను అటకెక్కించారు. జనవరి 1వ తేదిన జాబ్ క్యాలెండర్ అన్నారు.. ఏమైంది? చంద్రబాబు 42 శాతం పీఆర్సీ ఇస్తే దానికన్నా మెరుగైన పీఆర్సీ ఇస్తామన్నారు ఏమైంది? 25 మంది ఎంపీలను ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు ఏమైంది? 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ అన్నారు ఏమైంది? వృద్ధులకు వృద్ధాశ్రమాలు అన్నారు.. ఆ వృద్ధాశ్రమాలు ఏమయ్యాయి?

ఎన్నికలకు ముందు వైసీపీ ఇచ్చిన వందలాది హామీలను నెరవేర్చలేదు. 2014-19 వరకు ఈ రాష్ట్రాన్ని అన్నివిధాల అభివృద్ధి చేసేందుకు ఆనాడు చంద్రబాబు ప్రయత్నించి అభివృద్ధి చేసి చూపిస్తే వైసీపీ వచ్చాక రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారు. కేసుల మాఫీ కోసం ప్రయత్నిస్తున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేశారు. సిగ్గులేని మంత్రులు పోలవరాన్ని, అమరావతిని నాశనం చేశారు.

ప్రత్యేక హోదా రానివ్వకుండా చేశారు. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి. కొత్తగా ఏ ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి రాలేదు. లోకేష్ పాదయాత్రతో వైసీపీ నాయకుల పునాదులు కదిలిపోతున్నాయి. 1983 నుంచి టీడీపీ వైపు రాని వర్గాలు కూడా ప్రస్తుతం టీడీపీ వైపు వస్తున్నాయి. లోకేశ్ పాదయాత్ర ప్రారంభించక ముందు నడవలేడన్నారు, నడవడం రాదన్నారు, నడవనివ్వమన్నారు.

ప్రస్తుతం మాత్రం భయకంపితులవుతున్నారు. కొడాలి నాని తన ప్రెస్ మీట్ లో ఏవేవో కారుకూతలు కూశాడు. లోకేశ్ పాదయాత్ర 15 వందల రోజులు పూర్తవుతోంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.మూడు రోజులుగా జగన్ కు కంచుకోటైన కడప జిల్లాలో లోకేశ్ పర్యటిస్తుంటే ప్రజలు తండోపతండాలుగా సభలకు వస్తున్నారు. ఈ నాలుగు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ని అధోగతిపాలు చేశారు. అన్ని రాంగాల్లో రాష్ట్రాన్ని అడ్రస్ లేకుండా చేశారు.

బూతులు మాట్లాడటంలో పట్టా పుచ్చుకున్న వైసీపీ నాయకులు.. బూతులు మాట్లాడేది టీడీపీ నాయకులు అనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. చంద్రబాబును కాల్చండి, చంపండి అన్నది జగన్ కాదా?. టీడీపీ ఎప్పుడు సంస్కారవంతంగా నడుచుకుంటుంది. బూతులకు పేటెంట్ రైట్ వైసీపీకే ఉంది. రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంతటి దౌర్భాగ్య పరిస్థితులు లేవు. ఇళ్లల్లో వుండే మహిళలను కూడా రోడ్డుకీడ్చి మాట్లాడే పరిస్థితులు తీసుకొచ్చారు. రాజకీయాలను దిగజార్చారు.

దౌర్భాగ్యపు రాజకీయాలను రాష్ట్రంలోకి ప్రవేశపెట్టిన వైసీపీ నాయకులు వైసీపీలో ఓపెన్ బ్యాలెట్ పెట్టి 151 మంది శాసనసభ్యుల్లో 145 మంది సజ్జలతోనే వైసీపీకి దరిద్రం దాపురించిందని ఇదే మాట చెబుతారు. సజ్జల వల్ల డిపాజిట్లు కోల్పుతున్నామని వైసీపీ నాయకులే అంటున్నారు. వైసీపీ మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు ఏమనుకుంటున్నారో సజ్జల తెలుసుకుంటే మంచిది. ఇప్పటికైనా వైసీపీ నాయకులు అవకాకులు, చవాకులు పేల్చడం మానకపోతే తాట తీస్తామని హెచ్చరిస్తున్నామని టీడీపీ అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్ అన్నారు.

LEAVE A RESPONSE