– మంత్రి కొల్లు రవీంద్ర
కాకినాడ: వైసీపీ పాలనలో అన్ని వర్గాలు అవస్థల పాలయ్యాయని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఏలేశ్వరంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరూపుల సత్యప్రభ ఆధ్వర్యంలో జరిగిన జీవో 217 రద్దు అభినందన సభలో మంత్రి పాల్గొని, మాట్లాడారు. మత్స్యకారుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేలా గత ప్రభుత్వం జీవో 217 తీసుకొచ్చింది.. అనాదిగా మత్స్యకారులకు ఉన్న హక్కుల్ని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జీవో 217 రద్దు చేస్తామని హామీ ఇచ్చాం.. అమలు చేశాం.. మత్స్యకారుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం.. త్వరలోనే మత్స్యకార సొసైటీలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటాం.. నా వాళ్ళకు తోడుగా నిలవాలని గతంలోనే శ్రమించి యాభై ఏళ్లకే పెన్షన్ పథకానికి శ్రీకారం చుట్టాం.
జగన్ వచ్చి ఫిష్ ఆంధ్ర అన్నారు.. దాంతో ఏమైన ఉపయోగం ఉందా?
అంతర్జాతీయంగా రాష్ట్ర మత్స్య సంపదను ఎగుమతి చేసే అవకాశాలు కల్పిస్తాం… అక్రమ కేసులు, అరెస్టులు తప్ప జగన్ రెడ్డి ఐదేళ్లలో సాధించింది ఏమీ లేదు.. ప్రజలు బయటకు రావాలంటే కూడా భయపడే పరిస్థితి కల్పించారు… ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గెలిచిన వెంటనే 4,000 పెన్షన్ ఇచ్చాం. ఏప్రిల్ నుండి పెన్షన్ అమలు చేస్తూ 7,000 పెన్షన్ ఇచ్చాం.
గత ఐదేళ్లు ఉద్యోగాలు లేవు.. కానీ అధికారంలోకి రాగానే 16800 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. మన మత్స్యకార వర్గాల్లో వెనుకబాటుతనాన్ని నివారించేలా చర్యలు తీసుకుంటాం.. పిల్లల్ని మంచి చదువులు చదివించండి.. చిన్న వయసులో పెళ్ళిళ్ళు మానుకుని వారిని చదివించండి.. వారే మీ కుటుంబానికి అండగా నిలుస్తారని మంత్రి రవీంద్ర అన్నారు.