Suryaa.co.in

Political News

ఆ జంక్ మార్కెట్ అంటే పోలీసులకు జంకు…

– మూసేయించిన యోగీ

ఉత్తరప్రదేశ్ మీరట్ లో పాత వాహనాలను ముక్కలు చేసే దాదాపు 32 పెద్ద జంక్‌యార్డ్‌లు ఇక్కడ ఉన్నాయి, వాటి యజమానులు, నిర్వహణ, అందరు ముస్లింలు మాత్రమే.సాధారణంగా అందరూ ఈ జంక్ యార్డులో పాత వాహనాలను విడగొట్టి వాటిలో ఉపయోగపడే విడి భాగాలను సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో స్పేర్స్ గా అమ్ముతూ వుంటారు అని అనుకుంటూ వుంటారు.

కానీ నిజం అది కాదు. ఈ జంక్ యార్డులు ఒక పెద్ద అక్రమ కార్యకలాపాల అడ్డా. అంటే ఇక్కడ పాత వాహనాలు మాత్రమే కాదు దొంగతనం చేయబడ్డ వాహనాలను కూడా ఇక్కడ నిమిషాలలో ఆనవాలు లేకుండా విడకొట్టి స్పేర్స్ తీసి వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ నిమిషాల్లో మొత్తం కారును ముక్కలు చేసేంత పనితనం వారి సొంతం, కారులోని ప్రతి భాగాన్ని వేరు చేసి భారతదేశం అంతటా మంచి ప్యాకింగ్‌తో ఆటో విడిభాగాల మార్కెట్‌లో విక్రయించడానికి పంపుతారు.

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ మొదలైన ప్రాంతాల నుండి ప్రతిరోజూ వందల కొద్దీ కార్లు మరియు ద్విచక్ర వాహనాలు దొంగిలించబడతాయి. ఈ దొంగిలించిన వాహనాలన్నీ మీరట్‌లోని ‘సోటిగంజ్’ ప్రాంతానికి వెళ్తాయి. ఇది ఆసియాలోనే ఈ విడి భాగాలకు సంబంధించిన అతిపెద్ద మార్కెట్.

దొంగ కార్లు మరియు బైక్‌లుతో ఎటువంటి పెట్టుబడి లేకుండా ముస్లింలు లక్షల రూపాయల ఆదాయం ఎలా సమకుర్చుకున్నరో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇది దేశం అంతా విస్తరించబడిన ఒక పెద్ద నెట్
meerat వర్క్. ఎందుకంటే ఈ మీరట్ జంక్ యార్డ్ మొత్తం ముస్లిం చేతిలో వుంది. అంతే కాక భారతదేశం అంతటా ఆటో విడిభాగాలను సరఫరా చేసే వ్యవస్థ చాలా వరకు వీరి చేతుల్లోనే ఉంది.

మీరట్‌ లోని సోటిగంజ్, కబాడీ బజార్‌లోని ఈ 32 జంక్‌యార్డులపై ‘యోగి’ ప్రభుత్వం రహస్యంగా నిఘా వేసి, పూర్తి ఆధారాలు సేకరించింది, వారంతా దాదాపు 5000 కోట్ల రూపాయల మార్కెట్ విలువైన ఆస్తులను అక్రమంగా సంపాదించినట్లు తేలింది, అది కూడా ఎటువంటి పెట్టుబడి లేకుండా.
వీరు దొంగలతో నెట్ వర్క్ మెయింటైన్ చేస్తారు. ఏ కొత్త రకం కారు అయినా, ఎన్నో సేఫ్టీ ఫీచర్లు గల విదేశీ కార్లను కూడా ఈ దొంగలు నిమిషాల్లో లాక్ ఓపెన్ చేసి వాటిల్లో GPS లు ధ్వంసం చేసి మీరట్ తీసుకు వచ్చి నిమిషాల్లో ఆ కారు నామ రూపాలు లేకుండా చేస్తారు. అందువల్ల పోలీసులకు దొంగ సొత్తు పట్టుకోవడం కూడా కష్టం అవుతోంది.

అంతే కాదు. వీరికి ఫలానా మోడల్ కారు ఫలానా స్పేర్ పార్ట్ కావాలి అని స్పేర్ పార్ట్ షాప్ లు నుండి అడ్వాన్స్ సొమ్ముతో సహా ఆర్డర్స్ వస్తాయి. అలా ఆర్డర్ రాగానే ఈ నెట్ వర్క్ లో దొంగలకు ఈ సమాచారం చేరవేసే ఆ మోడల్ వాహనాన్ని సంపాదిస్తారు.ఈ దొంగలకు కార్లు లాక్ లు ఓపెన్ చెయ్యడం, వాటిల్లో GPS వంటి ట్రాకింగ్ వ్యవస్థలను నాశనం చెయ్యడం మొదలగు విషయాలపై వీరికి ఈ మీరట్ జంక్ యార్డ్ లో శిక్షణ ఇస్తారు.

హాజీ నయీమ్ అలియాస్ హాజీ గల్లా అనే ఈ ముఠాలోని అతిపెద్ద వాడిని అరెస్టు చేయడం జరిగింది, అతని నాలుగు కోట్ల రూపాయల విలువైన బంగ్లా వేలం వేయబడింది, అతని ఎనిమిది పెద్ద పెద్ద షాపులు జప్తు చేయబడ్డాయి. ఇంకా అతని బ్యాంకు ఖాతాలన్నీ స్తంభింపజేయబడ్డాయి. అతనికి ఇంకా ఎంత మేర ఆస్తులు వున్నాయి అని పోలీసులు చెప్పలేక పోతున్నారు. ఎందుకంటే చాలా ఆస్తులు బినామీలు పేరు మీద వున్నాయి అని కనుగొన్నారు. ఇతను మొదట్లో కార్ మెకానిక్ గా జీవితం ప్రారంభించి. 1990 ప్రాంతాలలో ఈ దొంగ వాహనాల వ్యాపారం మొదలుపెట్టాడు. ఇక్కడ జంక్ యార్డ్ లో ఉన్న 300 షాప్స్ లో 120 కి పైగా ఇతనివే.

దొంగతనం చేయబడ్డ వాహనాల గురించి విచారించడానికి ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, యుపి పోలీసులు ఇక్కడకు వచ్చినా వారిని ఇక్కడ గుంపు రాళ్ళు విసిరి అడ్డుకొని తరిమేసే వారు. అందుకే వారు ఎంక్వైరీ చేయలేక వట్టి చేతులతో వెనక్కి వెళ్ళే వారు. అంత ప్రమాదకరమైన ఏరియా ఇది.

ప్రస్తుతం ఈ హాజీ నయీమ్ మరియు అతని నలుగురు కొడుకులు జైలులో ఉన్నారు. ఇతర జంక్ యార్డులు మరియు దుకాణాలను జప్తు చేసే ప్రక్రియ నడుస్తుంది. ఈ మార్కెట్ లో సం.కి ₹500 కోట్లకు పైగా టర్నోవర్ జరుగుతుంది అని అంచనా. 300 షాప్ లకు కేవలం 40 కంటే తక్కువ షాప్ లు GST రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి.

ముఖ్య విషయమేమిటంటే ఇప్పుడు మీరట్ లోని ఈ జంక్ మార్కెట్ పూర్తిగా మూసివేయబడింది.
పై రాష్ట్రాల్లో త్వరలో మనం వాహనాల దొంగతనాల నేరాల సంఖ్య తగ్గడం చూడొచ్చు.
దారుణం ఏమిటంటే ఇంత పెద్ద నెట్ వర్క్ రాజకీయ నాయకుల అండ దండలు లేకుండా ఇన్ని సం.లు యే ఇబ్బందులు లేకుండా నడవలేదు. అందుకే ఈ క్రిమినల్ గాంగ్ లు అన్నిటికీ, ఇన్నాళ్లు వాటిని పోషించిన రాజకీయ నాయకులకు యోగి అంటే మంట. ఈ సారి ఎన్నికల్లో మళ్లీ యోగి రాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తారు.

– చాడా శాస్త్రి

LEAVE A RESPONSE