హైదరాబాద్ : అమెరికా అధ్యక్ష కార్యాలయం నుంచి ప్రెసిడెంట్స్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును తొలిసారిగా ప్రఖ్యాత క్యాన్సర్ వైద్యనిపుణులు డాక్టర్ సతీష్ కత్తుల అనే తెలుగువారికి దక్కింది. వాషింగ్టన్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అమెరికా అధ్యక్షులు ప్రెసిడెంట్ జో బైడెన్ జూనియర్ పేరుతో సర్టిఫికెట్‌ను, ప్రతిష్టాత్మకమైన గోల్ట్‌మెడల్‌ను వాషింగ్టన్ సెనెట్ బిల్డింగ్‌లో సెనెటర్ జోయ్ మంచిన్ డాక్టర్ సతీష్ కత్తులకు అందించారు.
యుపస్` ఇండియా ఎస్‌ఎంఇ అధ్యక్షులు ఎలీషా పులివార్టి అమెరికా ప్రెసిడెంట్స్ లైఫ్‌టైం అఛీవ్‌మెంట్ అవార్డుకు డాక్టర్ సతీష్ కత్తుల పేరును ప్రతిపాదించారు. ఆమెరికాను ఆరోగ్యవంతమైన దేశంగా మలిచే బృహత్తర కార్యక్రమంలో డాక్టర్ సతీష్ కత్తుల క్యాన్సర్ వైద్యనిపుణులుగా స్వచ్ఛందంగా సేవలందిస్తున్నందుకు ఈ అవార్డుకు ఎంపిక చేసి బహుకరించారు.
డాక్టర్ సతీష్ కత్తుల తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు. 29 సంవత్సరాలుగా ఆయన అమెరికాలో సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ ( ఆపి)కి అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా ప్రెసిడెంట్స్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును తాను అందుకోవడం చాలాసంతోషంగా వుందన్నారు.
తెలుగువారు ప్రపంచంలో ఎవ్వరికీ తీసిపోరని, ముఖ్యంగా వైద్యరంగంలో భారతదేశంలో ప్రపంచస్థాయి వైద్యనిపుణులు ఎందరో వున్నారని, ఈ అవార్డు తెలుగుజాతి వైద్యనైపుణ్యానికి అంకితం చేస్తున్నానని అన్నారు.