Suryaa.co.in

Telangana

వరలక్ష్మి టిఫిన్స్ యజమాని ప్రభాకర్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్: వరలక్ష్మి టిఫిన్స్ యజమాని ప్రభాకర్ రెడ్డిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. అనురాధ, మహేశ్వరి అనే ఇద్దరు అమ్మాయిలపై అత్యాచారం కేసులో ప్రభాకర్ రెడ్డిని గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి పేరుతో ప్రభాకర్ రెడ్డి మోసం చేశాడంటూ అనురాధ, మహేశ్వరి జనవరిలో ఫిర్యాదు చేశారు. తమపై అత్యాచారం చేసి మోసం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు అనురాధ, మహేశ్వరి. దీంతో ప్రభాకర్ రెడ్డిపై 417, 420, 354A కింద కేసులు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. కాగా గతంలో కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు ప్రభాకర్ రెడ్డి.

LEAVE A RESPONSE