వసూల్‌రెడ్డి గారూ.. మీరూ పెట్రోల్ ధర తగ్గిస్తారా?

– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌తో ఇబ్బందిప‌డుతున్న సామాన్య‌జ‌నానికి ఉప‌శ‌మ‌నం క‌లిగించేలా లీటర్ పెట్రోల్‍పై రూ.5, డీజిల్‍పై రూ.10 కేంద్ర ప్ర‌భుత్వం త‌గ్గించ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌యం. మ‌న రాష్ట్రంలో వ‌సూల్ రెడ్డి గారు పెట్రోల్‌, డీజిల్‌పై దేశంలో ఎక్కడాలేని విధంగా 31 శాతం వ్యాట్+లీటరుకి రూ.4 అదనపు వ్యాట్+లీటరుకి 1రూపాయి రోడ్డు అభివృద్ధి సుంకం వేసి లీటర్ పెట్రోల్ కి పన్నుల రూపంలో రూ.30 బాదుతున్నారు. కేంద్రంలాగే మీరూ ఈ బాదుడు త‌గ్గించేదేమైనా ఉందా? కేంద్రం త‌గ్గించిన మేర‌కు పెంచి మ‌ళ్లీ జ‌నాన్ని బాదుతారో చూద్దాం.