దేశవ్యాప్తంగా బ్రిటిష్ వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకకాలంలో అనేక దాడులను నిర్వహించడానికి వాసుదేవ బల్వంత ఫడ్కే ప్రణాళికలు రచించిన విప్లవ వీరుడు. ఒకసారి ఘనూరు గ్రామంలో సైన్యంతో నేరుగా తలసడ్డాడు.
ఆ తర్వాత అతడిని పట్టుకోవడానికి ప్రభుత్వం బహుమతి ప్రకటించింది. ఆ తర్వాత రోహిల్లా, అరబ్బులను తన సంస్థలో చేర్చుకోవడానికి హైదరాబాద్ రాష్ట్రానికి వెళ్ళాడు. బ్రిటిష్ మేజర్ హెన్రీ విలియం డేనియల్, హైదరాబాద్ నిజాం పోలీసు కమిషనర్ అబ్దుల్ హక్.. తదతరులు పగలు-రాత్రి ఆయన అచూకి కోసం వెతికారు. కొందరి నమ్మక ద్రోహం కారణంగా, అతను 20 జూలై 1879న పండార్పూర్ వెళ్తున్నప్పుడు కలడ్గి జిల్లాలో జరిగిన తీవ్రమైన పోరాటంలో అతడిని ఒక దేవాలయంలో బంధించారు.
ఇక్కడ నుండి వాసుదేవ బల్వంత ఫడ్కేని విచారణ నిమిత్తం పూణేకు తీసుకెళ్లారు. సర్వజనిక్ కాకా అని పిలువబడే గణేష్ వాసుదేవ్ జోషి అతని కేసును వాదించాడు. విచారణ సమయంలో అనుచరులతో పాటూ అతన్ని సంగం వంతెన సమీపంలోని జిల్లా సెషన్ కోర్టు జైలు భవనంలో ఉంచారు. ఇది ఇప్పుడు రాష్ట్ర సిఐడి భవంతి.
ఫడ్కేకి జీవిత ఖైదు విధించారు బ్రిటీషర్లు. దీనికి అతని స్వంత డైరీయే ఆధారం అయింది. అతనిని ఏడెన్లోని జైలుకు తరలించారు. బ్రిటిష్ ప్రభుత్వ విధానాలు, వారి చిత్ర హింసలకు నిరసనగా అప్పటినుంచి నిరహార దీక్ష చేస్తూ 17 ఫిబ్రవరి 1883న వాసుదేవ బల్వంత ఫడ్కే తుది శ్వాస విడిచాడు.
– శ్రీ రమేష్ పురాణం