Suryaa.co.in

Features

వేదం .. హిందూ ధర్మంలో స్త్రీ విలువ

వేదాలు స్త్రీలను తొక్కేశాయని, స్త్రీలకు స్వేఛ్ఛనివ్వలేదని చాలా ఆరోపణలు చేస్తుంటారు. విద్యార్ధుల పాఠశాల చదువుల్లో, ఐఏఎస్ అభ్యర్ధులకు, ఇతర ఉద్యోగార్ధులకు నిర్వహించే పరీక్షల్లో ఉండే చరిత్రలో కూడా ఇదే వాదన కనిపిస్తుంది. ఇక తమనుతాము సంఘసంస్కర్తలమనీ, అభ్యుదయవాదులమని చెప్పుకునే కొందరు కుహనా మేధావులు ఈ విషయంలో వైదికసంస్కృతిపై దుమ్మెత్తిపోస్తుంటారు. అసలు వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాం.
స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి – యజుర్వేదం 10.03
స్త్రీలు మంచి కీర్తి గడించాలి – అధర్వణవేదం 14.1.20
స్త్రీలు పండితులవ్వాలి – అధర్వణవేదం 11.5.18 (స్త్రీలు కూడా విద్యాబోధన చేయాలని చెప్తోంది)
స్త్రీ అందరిని జ్ఞానవంతుల్ని చేయాలి – అధర్వణవేదం 14.2.74
స్త్రీ ఎప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి – అధర్వణవేదం 7.47.2
స్త్రీలు ఎప్పుడూ జ్ఞానవంతులై, తెలివిగలవారై ఉండాలి – అధర్వణవేదం 7.47.1
పరిపాలన విషయంలో స్త్రీలు:-
పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో స్త్రీలు కూడా పాల్గినాలి – అధర్వణవేదం 7.38.4
దేశపరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు ముందుండి నడిపించాలి- ఋగ్వేదం 10.85.46
ఈ రోజుక్కూడా ప్రపంచంలో స్త్రీలు పైకి రాకుండా అణిచివేస్తున్నారు. కానీ వేదం ఎంతో స్పష్టంగా స్త్రీల నాయకత్వం గురించి వివరించింది.
ఆస్తిహక్కు:-
పిత్రార్జితం (తండ్రి కూడబెట్టిన ఆస్తి) లో కుమారుడితో కుమార్తెకు కూడా సమానమైన హక్కు ఉంది- ఋగ్వేదం 3.31.1
కుటుంబం:-
సమాజానికి, కుటుంబానికి స్త్రీ రక్షకురాలిగా వ్యవహరించాలి- అధర్వణవేదం 14.1.20
స్త్రీ సంపదను, ఆహారాన్ని అందించాలి. శ్రేయస్సును కలిగించేదై ఉండాలి- అధర్వణవేదం 11.1.17 (స్త్రీకి సంపాదన ఉన్నప్పుడే ఆమె కుటుంబానికి సంపదను చేకూర్చి గలుగుతుంది)
నీ భర్తకు సంపాదించే మార్గాలు నేర్పించు- అధర్వణవేదం 7.46.3
ఉద్యోగం:-
స్త్రీలు కూడా రధాలను నడపాలి- అధర్వణవేదం 9.9.2
స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి- యజువేదం 16.44 (ఈ విషయంలో దుర్గాదేవియే స్త్రీలకు ఆదర్శం. స్త్రీలు బయటకురాకూడదని వైదిక ధర్మం చెప్పిందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కానీ వేదం స్త్రీలను యుద్ధంలో కూడా పాల్గొనవలసిందిగా చెప్పింది. కైకేయి దీనికి ఉదాహరణ కదా. శ్రీ రామాయణంలో కైకైకయి అడిగిన వరం వల్లనే రాముడు వనవాసానికి వెళతాడు. దశరధుడితో కలిసి శత్రువులపై యుద్ధం చేసిన సమయంలో, ఆమె పరాక్రమం చూసి ఆమెను వరం కోరుకోమనగా, సమయం వచ్చిన అడుగుతానంటుంది. ఇతిహాసంలో అదే పెద్ద ఉదాహరణ).

కమాండర్ తరహాలో స్త్రీ సభలను ఉద్ద్యేశించి ప్రసంగించాలి- ఋగ్వేదం 10.85.26
ఓ స్త్రీలారా! పురుషలతో సమానంగానే మీకు ఈ మంత్రాలు ఇవ్వబడ్డాయి. మీ భావాల్లో సామరస్యం ఉండుగాకా. మీరు ఎటువంటి వివక్ష చూపక, అందరికి జ్ఞానాన్ని పంచుదురుగాకా. మీ మనసు, చైతన్యం సమన్వయంతో పనిచేయాలి. నేను (ఋషి) పురుషులతో సమానంగా మీకు ఈ మంత్రాలను ఇవ్వడమేగాక, వీటిని అర్దం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను- ఋగ్వేదం 10-191-3
వేదాల్లోనే మైత్రేయి, గార్గి, లోపాముద్రా వంటి దాదాపు 30 పైగా మంత్రద్రష్టలైన స్త్రీ ఋషుల గురించి చెప్పబడింది.

ఒక్క హిందూ ధర్మంలో తప్ప మరే ఇతర మతంలోనూ స్త్రీదేవతలు ఉండరు. అన్యమతాల్లో ఎక్కడా కూడా స్త్రీలకు భగవంతుడు తన దివ్యసందేశం ఇచ్చినట్టుగా లేదు.
వివాహం – విద్యాభ్యాసం:
ఓ వధువా! (వధువు అంటే పెళ్ళికూతురు) వైదికజ్ఞానం నీకు అన్ని దిశల నుండి కలగాలి. వేదాల్లో ఉన్న జ్ఞానం పొందిన తరువాతనే నీవు జీవితానికి సంబంధించిన విషయాల మీద నిర్ణయం తీసుకో. నీవు మంచి కీర్తి గడించు .

స్త్రీలను వేదాలు చదవొద్దన్నదెవరో
గార్గి, రోమష,
ఘోషా, విశ్వవర,
ఆత్రేయి, లోపాముద్ర,
వసుత్రపత్ని, ఇంద్రాణి,
అపాల, శ్రద్ధ,
వైవశ్వతి, యామి,
పౌలమి, సూర్య,
శ్వాస్తి, శిఖండిని,
ఊర్వశి, సచి,
దేవరాణి, ఇంద్రమాత,
గోద, జుహు,
మైత్రేయి.

వీళ్ళంతా వేదాలలో ఉదాహరించిన స్త్రీ మూర్తులు. వేదాలను స్త్రీలు పఠించరాదు, శూద్రులు నేర్చుకోరాదు అని మనుస్మ్రతి లో చెప్పారని చేస్తున్న వితండ వాదాన్ని తప్పని నిరూపించేలా ఆధారాలతో సహా ఇస్తున్నాను. వేదాలను నేర్చుకొని వాటి సూక్తాలు దర్శించి, వ్యాఖ్యానించిన మేధావంతులైన మహిళలు వీరు.
మహిళా యోగులు, స్త్రీబుుషులు, యోగిణిలు, స్త్రీ మునులనే మాటలను మనం వినివుంటాం.కాని వీరిని బుుషికలు లేదా బ్రహ్మవాదినులని పిలవాలి.
బుుగ్వేదంలో 23 మంది బుుషికలు సూక్తాలు దర్శించారు. అపాల దర్శించిన సూక్తానికి ఆమె పేరు మీదనే అపాలసూక్తమని పిలుస్తారు.
విశ్వ వర ఐదవ మండలంలోని 28 వ సూక్తాన్ని లోపాముద్ర 19వ సూక్తాన్ని దర్శించారు. బుుగ్వేదంలో 125 సూక్తాన్ని జుహు దర్శించింది.
గార్గి బుుషిక యజ్ఞవల్కునితో వేదాంత చర్చ చేసింది.
వేదకాల నిర్ణయం 5000 సం॥ నుండి 1500 క్రితం సంవత్సరాల కాలంనాటివని భావిస్తే అప్పటికే స్త్రీవిద్యకు అత్యంత విలువలు ఇచ్చినట్లు భావించాలి. వేదాలకు భాష్యాలు చెప్పడమంత సులభమైన ప్రక్రియేమికాదు. వేదాలను క్షుణ్ణంగా చదవాలి, అంటే మంచిగా జ్ఞానసముపార్జనతోపాటు విద్యను అభ్యసించాలి.

ఇప్పటికి 1500 క్రిందటవరకు స్త్రీలకు అన్ని రంగాలలోనూ సమాన అవకాశాలుండేవి.వృత్తులు కులాలవారిగా ఏర్పడటంతో, కులవ్యవస్థ జఠిలమైంది. సమాజంలో సనాతనధర్మరక్షణ పేరుతో అనేక కట్టుబాట్లు, అచారాలు, వ్యవహారాలు పుట్టుకొచ్చాయి.మూఢనమ్మకాలు ప్రబలాయి.అలా పుట్టిన మూఢనమ్మకాలకు స్త్రీలోకం సమిధైంది.

మనదేశంపైకి గ్రీకులు (యవనులు) పర్షియన్లు, కుషాణులు, హుణులు దండయాత్రలు చేసి భూభాగాలను ఆక్రమించి రాజ్యాలను స్థాపించినా వారెవరు మన సంస్కృతి సంప్రాదాయాలను పాడుచేయలేదు.పైగావారు మనదేశ సంస్కృతి సంప్రాదాయాలను మతాలను గౌరవించి హిందూమతాన్నో బౌద్ధాన్నో స్వీకరించారు. హుణ చక్రవర్తి మినాండర్, కుషాణులు ఈ కోవలోనివారే.

కానీ తురుష్కులు, అరబ్బులు మొదలైన ముస్లీములు దండయాత్రలు జరిపి రాజ్యాలు ఏర్పాటుచేయడంతో, భూభాగాలను భారతీయులు కోల్పోవడమేగాక తీవ్రమైన గ్లానికి కూడా గురైనారు.
స్త్రీలను చెరబట్టడం, స్త్రీలను చెరచడం, స్త్రీలను బానిసలుగా చేసుకోవడం, స్త్రీలకోసమే యుద్ధాలు చేయడం, వారిని మతం లోనికి మార్బడం ముస్లీంల పాలనలో జరిగింది. భారతీయ స్త్రీలు అనాదిగా మానానికి అత్యంత విలువలు ఇస్తారన్నసంగతి జగమెరిగిన సత్యం. ముస్లీంల పాలబడి మానం కోల్పోవడం కంటే ప్రాణాన్ని త్యజించడమే మేలని భావించారు. అలా పుట్టిందే జోహార్ పద్ధతి. ఈ పద్ధతిలో ముస్లీంలబారిన పడకుండా అంత:పుర స్త్రీలు పెద్దపెద్ద జ్వాలలను ఏర్పాటుచేసి అందులో ప్రాణాలు అర్పించేవారు.

యుద్ధంలో పురుషులు మరణిస్తే ఆ వీరుని ఇల్లాలు శత్రువుల చేతికి చిక్కకుండా సహగమనం చేసేది.
ముస్లీంల తరువాత భారతాన్ని పాలించిన ఆంగ్లేయులు స్త్రీవిద్యకోసం కృషి చేసినా, అది మతమార్పిడీలకేనన్నది జగమెరిగిన సత్యం.
భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడి మానస పుత్రిక పధకం,
Beti-Bachao-Beti-Padhao-Scheme ఆడపిల్లల భవిష్యత్ ని దూరదృష్టి తో ప్రవేశపెట్టిన కలల పదకం….
బేటీ పడావో, బేటీ బచావో, బేటీకో రక్షాదో అన్న నినాదానికి చేయూతనిద్దాం.

– మల్లిన రాధాకృష్ణ
(మోదీ హెల్ప్ డెస్క్)

LEAVE A RESPONSE