Suryaa.co.in

Telangana

ఢిల్లీలోని బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

న్యూ ఢిల్లీ: బిఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం నాడు దేశరాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణం కలియతిరిగి క్షేత్ర స్థాయిలో పనులనుimage పర్యవేక్షించారు. పనుల పురోగతిపై ఆర్కిటెక్ట్,వర్క్ ఏజెన్సితో సమీక్ష నిర్వహించారు. అధినేత కేసిఆర్ విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను మంత్రి అదేశించారు. మంత్రి వెంట ఉర్దూ అకాడెమీ ఛైర్మన్ ముజీబుద్దిన్, ఆర్కిటెక్ట్ ఆస్కార్నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE