Suryaa.co.in

Features

పుస్తకాలు.. మన నేస్తాలు

పుస్తకాలు మన నేస్తాలు.. మన జీవితాన్ని సన్మార్గంలో నడిపించే గొప్ప సాధనాలు.. అందుకే అన్నారు చిరిగిన చొక్కా అయిన తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకాన్ని కొనుక్కో..
పుస్తక పఠనం దివ్యమైన అనుభూతి.మంచి జీవన మార్గదర్శకం పుస్తకం వల్లే కలుగుతుంది. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు. అంటే పుస్తకానికి ఉన్న విలువ ఏమిటో ఆ ఒక్క పదం వల్ల తెలుస్తుంది. పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కాలాన్ని చెరిపేస్తూ సమాజాన్ని ప్రభావితం చేసిన మహా రచయితల నుంచి జాలువారిన గ్రంథాలు ఎన్నో మనకు ఒక విజ్ఞానాన్ని సంపాదించే సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి.

ప్రతి పోటీ పరీక్షకు పుస్తక పఠనం తప్పనిసరి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అసలు పుస్తకాలు లేనిదే జీవితం లేదు అనేది కూడా మరో కోణంలో ఎందరో రచయితలు వర్ణించారు. పుస్తక పఠనం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవడమే కాకుండా మన జీవన విధానంలో కూడా ఎన్నో మార్పులు తీసుకు రావచ్చు. అది ఒక పుస్తకం ద్వారానే సాధ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి.

బాపట్ల జిల్లాలో ఘనమైన చరిత్రను సొంతం చేసుకున్న విజ్ఞాన భాండాగారం వేటపాలెం సారస్వత నికేతనం..
రాష్ట్రంలోనే ప్రముఖ గ్రంథాలయం గా విరాజిల్లుతోంది. జాతిపిత మహాత్మా గాంధీ ఈ గ్రంథాలయాన్ని సందర్శించి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు ఆయన వినియోగించిన చేతి కర్ర ఈ గ్రంథాలయంలో ప్రదర్శనగా ఉంచారు. టంగుటూరు ప్రకాశం, పింగళి, కాశీనాథుని నాగేశ్వరరావు, విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు, అయ్యదేవర కాళేశ్వరరావు, పీవీ నరసింహారావు, వావిలాల గోపాలకృష్ణయ్య వంటి మహనీయులు ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. ప్రతి ఏటా రెండు వేల మందికి పైగా భారత దేశం నలుమూలల నుంచి పరిశోధకులు విషయ సేకరణ కోసం ఇక్కడికి విచ్చేస్తుంటారు. తాజాగా ఈ గ్రంథాలయంలో లక్షా ఇరవై వేల పుస్తకాలు ఉన్నాయి.

– సిహెచ్ దాస్

LEAVE A RESPONSE