-విశాఖ లో పెట్టిన గ్లోబల్ సదస్సు వల్ల మేలు జరగదు
-ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి గెలుపు తథ్యం
-మూడు సీట్లలో గెలుస్తామనే నమ్మకం మాకు ఉంది
-ప్రధానమంత్రి గా నరేంద్ర మోడీ హ్యాట్రిక్ కు సంకేతం
-కేంద్రం ఇచ్చే ఆరు వేలుకు, జగన్ ఏడువేలే ఇస్తున్నారు
-జగన్ ఇచ్చిన మాట తప్పి రైతులను మోసం చేశారు
విజయవాడ: ఈశాన్య రాష్ట్రాల లో జరిగిన ఎన్నికల్లో బిజెపి హవా కొనసాగుతోందని బిజెపి రాష్ఠ్ర అధికార ప్రతినిధి చందు సాంబశివరావు అన్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం నరేంద్ర మోడీ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా బిజెపి కి అనుకూలంగా ఉన్నాయి.త్రిపుర లో రెండవ పర్యాయం బిజెపి ని ఆదరించారు. కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్ అపవిత్ర కలయిక అని ప్రజలు నిరూపించారు అన్నారు.
ఎపి లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి మంచివారిని పోటీకి నిలబెట్టిందని అభ్యర్థులు వివరాలను ప్రస్తావించారు. ఈసి ని, అధికారులను వైసిపి ప్రభుత్వం వాడుకుంటుంది. అధికార యంత్రాంగం ద్వారా దుర్వినియోగం చేసి గెలుపు కోసం అడ్డదారులు వెతుకుతున్నారు. ఎటువంటి అవకతవకలు జరిగినా ఉన్నతాధికారులు దృష్టి కి తీసుకెళ్లాలి. మా అధ్యక్షులు సోము వీర్రాజు విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు సీట్లలో గెలుస్తామనే నమ్మకం మాకు ఉంది. 13వ తేదీ వరకు మా ప్రచారం ద్వారా అన్నీ వివరిస్తాం. ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వం బాధ్యత.అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార యంత్రాంగాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోకూడదు.
వీటికి సంబంధించిన ఆధారాలు ఎన్నికల సంఘానికి అంద చేస్తాం. 2014 నుంచి ప్రధాని మోడీ రైతుల శ్రేయస్సు కోసం పని చేస్తున్నారు. కేంద్రం 24 పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తుంది.రైతుల సమస్యలు ను పరిష్కారించేందుకు మోడీ ప్రాధాన్యత ఇచ్చారు.వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంలోకొన్ని రాష్ట్రాల్లో విఫలం అయ్యారు.వ్యవసాయాన్ని లాభ సాటిగా మార్చేలా 24పధకాలను అమల్లోకి తెచ్చారు. యేడాది కి పన్నెండున్నర వేలు ఇన్ ఫుట్ సబ్సిడీ కింద ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. కేంద్రం ఇచ్చే ఆరు వేలుతో సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే ఆరు వేలుకు, జగన్ ఏడువేలే ఇస్తున్నారు.దీనినే మాట తప్పడం, మడమ తిప్పడం అంటారు. జగన్ ఇచ్చిన మాట తప్పి రైతులను మోసం చేశారు. అయినా కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు.ఈ ప్రచార డబ్బు తో రైతుల కు ఎంతో కొంత మేలు జరిగేది.మీ మ్యానిఫెస్టో అమలు చేయలేదని అందరికీ అర్థం అవుతుంది.కిసాన్ సమ్మాన్ అని మోడీ రైతులకు గౌరవం గా ఇస్తున్నారు.దీని పై ఎటువంటి చర్చకు అయినా మేము సిద్ధం.
విజయసాయి రెడ్డి, లేదా వైసీపీ నుంచి ఎవరైనా రావచ్చు. జగన్ చేసే మోసాలు, మాయలను ప్రజలకు వివరిస్తాం.ఆరోగ్య రంగంలో సనాతన విధానం ఆయుర్వేదం.బ్రిటిష్ వాళ్లు నిర్లక్ష్యం చేయగా, మోడ్రన్ మెడిసిన్ పేరుతో ఆ తరువాత వదిలేశారు.మళ్లీ పాత విధానం అమల్లోకి తెచ్చేందుకు కొత్త గా ఆయుష్ భారత్ మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేశారు.ప్రపంచ వ్యాప్తంగా లక్షా ఇరవై లక్షల కోట్లు ఆయుర్వేద మందులను మనం సరఫరా చేశాం. ఏపీలో జగన్ ప్రభుత్వం మాత్రం తనకు సంబంధం లేదన్నట్లుగా వదిలేశారు.రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత తీసుకుంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది.రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన వనరులు అంద చేయాలి.రాష్ట్రం స్థలం ఇస్తే.. ఆస్పత్రి నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇస్తుంది.మెడికల్ కాలేజీల ఏర్పాటు లో కూడా జగన్ ప్రభుత్వం విఫలమైంది.ఎపిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశారు.
వాలంటీర్ ల పేరు చెప్పి… ఇతర ఉద్యోగాలను భర్తీ చేయరా? విశాఖ లో పెట్టిన గ్లోబల్ సదస్సు వల్ల ఎపికి మేలు జరగదు.అవసరమైన వనరులు లేకుండా పెట్టుబడి దారులు ఎలా వస్తారు? ఈ ప్రభుత్వం మానవ వనరులను సమాయాత్తం చేయడంలో వైఫల్యం కనిపిస్తుంది. ఇప్పుడయినా జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకుని, ఆయిష్ భారత్ కు సహకరించాలని హితవు పలికారు. పాత్రికేయుల సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ దాసం ఉమామహేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు.