జగన్ రెడ్డిని నమ్మి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయా?

– జగన్ అవినీతి, ధనదాహం దెబ్బ ఎలాఉంటుందో పారిశ్రామికవేత్తలకు పూర్తిగా బోధపడింది
– ఊరికే నల్లకోట్లు వేసుకొని ఉత్తుత్తి ఎం.వో.యూలు చేసుకుంటే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చినట్టుకాదు
• నాలుగేళ్లు నిద్రనటించిన జగన్, అతని ప్రభుత్వం ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ పేరుతో రాష్ట్రయువతను, పారిశ్రామికవేత్తల్ని నమ్మించడానికి కొత్తనాటకాలు మొదలెట్టింది
• జగన్ దెబ్బకు రాష్ట్రం విడిచిపోయిన పరిశ్రమలెన్ని.. ఆయన్ని నమ్మి ఏపీకి వచ్చిన పరిశ్రమలెన్ని?
• వైసీపీప్రభుత్వ అరాచకాలు, జగన్ ధనదాహం, అవినీతితో రాష్ట్రపారిశ్రామికరంగం ఎంతలా కుదేలైందో, ఉద్యోగాలు ఉపాధిలేక యువత ఎలా పెడదారిపట్టిందనే పూర్తివివరాలు టీడీపీ బుక్ లెట్ లో ఉన్నాయి
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

నాలుగేళ్లపాటు నిద్రనటించిన జగన్ ప్రభుత్వం, ఎన్నికలుసమీపిస్తుండటంతో రాష్ట్రంలోని యువతను మభ్యపెట్టి మాయచేయడానికే విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసిం దని, జగన్ దుర్మార్గాలు, అతని అవినీతి గురించి తెలిసినవారెవరైనా పెట్టుబడులు పెట్టడా నికి రాష్ట్రానికి వస్తారా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన మాజీమంత్రి నక్కా ఆ నంద్ బాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబుతో కలిసి రాష్ట్రంలో పారిశ్రామికరంగం దుస్థితి, పారిశ్రామిక వేత్తలపై జగన్ అండ్ కో దౌర్జన్యాలు, రౌడీయిజాన్ని వివరిస్తూ వాస్తవాలతో కూడినపత్రాన్ని ఆవిష్కరించి, అనంతరం విలేకరులతో మాట్లాడారు. అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడిన వివరాలు.. ఆయనమాటల్లోనే …

“జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంపై, ప్రజలపై ప్రేమాభిమానాలుంటే, వారికి అబద్ధాలు చెప్పి, మోస గించి అధికారంలోకి వచ్చేవాడుకాదు. చంద్రబాబునాయుడి హాయాంలో మాప్రభుత్వం విశా ఖపట్నంలో మూడుసార్లు పారిశ్రామికసదస్సులు నిర్వహించి, విరివిగా రూ.16లక్షలకోట్ల పెట్టుబడులు ఆకర్షించి వాటికి సంబంధించి ఎం.వో.యూలు కుదుర్చుకోవడం జరిగింది. 34 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సదరు ఎం.వో.యూల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. అలానే 5సార్లు దావోస్ వెళ్లి, రూ.5లక్షలకోట్ల పెట్టుబడులకు అక్కడ ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. టీడీపీప్రభుత్వంలో 5.13లక్షల ఉద్యోగాలు వచ్చినట్టు, జగన్ కేబినెట్ లోని పరిశ్రమల మంత్రే (స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి) చెప్పారు. టీడీపీ ప్రభుత్వం పరిశ్రమల్ని ఆకర్షించి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎంతగా కష్టప డిందో ఆయన మాటల్లోనే జగన్ రెడ్డికి, అతని ప్రభుత్వానికి అర్థమైంది. ఆ విధంగా చంద్ర బాబునాయుడు రాష్ట్రానికి తీసుకొచ్చిన క్రెడిబులిటీని జగన్ తనధనదాహం, అవినీతితో నాశనంచేశాడు. నాలుగేళ్లపాలనలో తనఅవినీతి, ధనదాహంతో రాష్ట్ర పారిశ్రామికరంగాన్ని సర్వనాశనంచేసిన జగన్, విశాఖపట్నంలో జరిగే సదస్సులో చెంపలేసుకొని పారిశ్రామికవేత్తల్ని, యువతనుక్షమాపణ కోరాలి.

టీడీపీప్రభుత్వం పారిశ్రామిక సదస్సుల్లో ఒప్పందాలు మాత్రమే చేసుకోకుండా, అనేకప్రాం తాల్లో పరిశ్రమల ఏర్పాటుకు శంఖుస్థాపనలు కూడా చేయడం జరిగింది. కానీ జగన్ ముఖ్యమంత్రికావడంతో రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలన్నీ శిలాఫలకాలకే పరిమిత మయ్యాయి. చంద్రబాబు హాయాంలో రాష్ట్రానికి వచ్చిన కియాకంపెనీ యాజమాన్యాన్ని జగన్, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ బెదిరించడంతో ఆసంస్థకు చెందిన అనుబంధ పరిశ్రమ లు రాష్ట్రానికి రాకుండా వెళ్లిపోయాయి. అలానే విశాఖపట్నంలో ఏర్పాటుకావాల్సిన లులూ గ్రూప్, అదానీ డేటా సెంటర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, రాయలసీమకు రావాల్సిన జాకీ పరిశ్రమ వంటివి జగన్ దెబ్బకు ఠారెత్తిపోయి, రాష్ట్రానికి గుడ్ బైచెప్పాయి. ఆపరిశ్రమలన్నీ రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించిఉంటే, లక్షల ఉద్యోగాలు ఏపీ యువతకు దక్కేవి. విశాఖ పట్నం లో ఏర్పాటుకావాల్సిన మెట్రోరైల్ ప్రాజెక్ట్, అక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ ఏమయ్యాయో జగన్ కు తెలియదా? కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఈ ముఖ్యమంత్రి మూడుసార్లు శంఖుస్థాపన లు చేశాడు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలన్నీ పొరుగురాష్ట్రాలబాట పట్టాయి. అనేకమంది పారిశ్రామికవేత్తలు జగన్ అవినీతి, దుర్మార్గాల దెబ్బకు బెంబేలెత్తిపోయి, రాష్ట్రం విడిచిపోయారు.. రాష్ట్రానికి జరగాల్సిన నష్టం, యువతకు కలగాల్సిన నష్టం కలిగాక, నాలు గేళ్లతర్వాత జగన్ నింపాదిగా విశాఖలో పారిశ్రామికసదస్సు పేరుతో ప్రజల్ని, యువతను మో సగించడానికి సిద్ధమయ్యాడు.

ప్రత్యేక హోదా తెస్తాను..పరిశ్రమలు వద్దన్నా రాష్ట్రానికి వస్తాయని ప్రతిపక్షనేత హోదాలో ఊదరగొట్టిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేకహోదాకోసం ఏం చేశాడో రాష్ట్రయువతకు సమాధానం చెప్పాలి. ఎన్నిసార్లు కేంద్రాన్ని హోదాకోసం నిలదీశాడో ప్రజలకు వివరించాలి. జగన్ అధికారవ్యామోహం, అతనిదుర్మార్గపాలన, అతని ధనదాహం రాష్ట్రానికి పరిశ్రమల్ని దూరంచేసింది. అమర్ రాజా సంస్థ సొంతరాష్ట్రం విడిచి, తెలంగాణకు ఎందుకు వెళ్లిందో, కియా అనుబంధపరిశ్రమలు రాష్ట్రానికి ఎందుకురాలేదో, చంద్రబాబు హయాంలో ఒప్పందాలుచేసుకున్న పరిశ్రమలు ఏపీలో ఎందుకు పరిశ్రమలు పెట్టలేదో జగన్ సమాధానంచెప్పాలి. రేపు విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్ లోముందు రాష్ట్రానికి, ఏపీ యువ తకు తానుచేసిన అన్యాయంపై జగన్ చెంపలేసుకొని, తరువాత తాముఅడిగిన ప్రశ్నలకు సమాధానంచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్ రెడ్డి అసమర్థత, అవినీతి, ధన దాహం, అతని ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక దారుణంగా దెబ్బతిన్న రాష్ట్రపారిశ్రామిక రంగ దుస్థితి పై టీడీపీ సమగ్రవివరాలతో విడుదలచేసిన బుక్ లెట్ లోని అంశాలన్నింటికీ ప్రభు త్వం సమాధానం చెప్పాల్సిందే. రేపు విశాఖకు వచ్చే పారిశ్రామికవేత్తలు ఎవరో, ఎలాంటి వారు ఈప్రభుత్వంతో ఒప్పందంచేసుకుంటారో అందరూచూస్తారు. ఊరికే నల్లకోట్లు వేసుకొని ఉత్తు త్తి ఎం.వో.యూలు చేసుకోవడంకాదు. పరిశ్రమలన్నీ గ్రౌండ్ అయ్యి, యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తే అప్పుడు లెక్కలోకి వచ్చినట్టు. చంద్రబాబుహాయాంలో సింగపూర్ ఏపీతో కలిసి పనిచేసింది. అలా ఏ ఒక్కదేశమైనా అవినీతిపరుడితో, జైలుకెళ్లిన వ్యక్తితో కలిసి పనిచేస్తుందా? జగన్ రెడ్డి సమ్మిట్ లు ఎలా ఉంటాయో ఇప్పటికే పారిశ్రామికవేత్తలకు బాగా బోధపడింది. ముఖ్యమంత్రి, మంత్రివర్గం లెంపలేసుకొని పారిశ్రామికవేత్తలకు చేసిన అన్యా యాన్ని ఒప్పుకోవాలి. తాను అధికారంలోకి వస్తే పరిశ్రమలకు రాయితీలు ఇస్తాను అన్నా డు.. చివరకు పారిశ్రామికరంగానికి పవర్ హాలిడేలు ప్రకటించే దుస్థితికి వచ్చాడు.

పారిశ్రామికవేత్తలకు కావాల్సింది పాలకులపై నమ్మకం… ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు కాదు
దావోస్ ఎందుకు వెళ్లలేదంటే ఒకమంత్రి చలి అంటాడు.. ఫార్ములా వన్ రేస్ హైదరాబాద్ లో జరిగితే, అక్కడ రాష్ట్రం పరువుతీసేలా కోడి..గుడ్డు కథచెప్పాడు. అలాంటి మంత్రులు, ఇలాం టి పనికిమాలిన ముఖ్యమంత్రిని చూసి రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వస్తారా? అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతుంటే, టీడీపీప్రభుత్వం మొదలుపెట్టిన ఇళ్లను పూర్తిచేయలేకపోయి న అసమర్థ ముఖ్యమంత్రి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తాడా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు, రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి ఎక్కడా సంబంధంలేదు. ప్రభుత్వంపై, పాలకులపై నమ్మకం ఉంటేనే పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతారు. చిత్తశుద్ధి లేని శివపూజలు ఎన్నిచేసినా ఉపయోగంలేదని జగన్ గుర్తించాలి.” అని అచ్చెన్నాయుడు హితవు పలికారు.

Leave a Reply