– ఏప్రిల్ లో విశాఖలో 1.80 మందికి ఇల్లు పట్టాలు పంపిణీ, వెంటనే ఇళ్ల నిర్మాణం
– రెండేళ్ళలో విశాఖలో 15వేలు దాటనున్న డిజిటల్ కొలువులు
– విశాఖ ముద్దుబిడ్డ,మహిళా ఇంటర్నెషనల్ మాస్టర్ సాహితీ వర్షిణికి అభినందనలు
– రూ 100 కోట్లతో ప్రబుత్వాసుపత్రుల్లో మెడికల్ ల్యాబ్ లు బలోపేతం
– రూ 2205 కోట్లతో రాష్ట్రంలో రోడ్లు పునరుద్దరణ
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయ సాయి రెడ్డి
ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చేసిన పాపాలు కోడెనాగుల్లా వెంట పడతాయని,అది ఇప్పుడిపుడే అర్దమవుతోందని, బాబు పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేసిన విషయాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ బయటపెట్టడంతో తండ్రీకొడుకులకు ముచ్చెమటలు పడుతున్నాయని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.శనివారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. నోరు విప్పితే అప్పట్లో పార్టీలకు ఫండింగ్ చేసిన బాబు ఫైల్స్ ఎక్కడ ఓపెన్ అయిపోతాయోనని తండ్రీకొడుకులు వణికి పోతున్నారని అన్నారు.
దొంగతనం బయట పడినప్పుడల్లా దృష్టి మళ్లించే డ్రామాలు ఆడటం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. నాటుసారాపై ధర్నాలు చేయాలని తన పార్టీ నాయకులకు పిలుపునిచ్చారని నిజంగా ఆ సమస్య ఉంటే పాత అలవాటుతో పచ్చ పార్టీ వాళ్లే కాస్తుంటారని, బాబు చూపిన ఆదాయమార్గాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారని అన్నారు. ఆధారాలు కావాలంటే ఇస్తామని తెలిపారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా పేదల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తలపెట్టిన ఇళ్ల యజ్ఞం కొనసాగుతూనే ఉంటుందని, ఎవరెన్ని కుట్రలు పన్నినా అర్హులైన పేదలందరికీ ఇళ్లు సొంతం చేసి తీరుతారని అన్నారు. ఏప్రిల్ నెలలో విశాఖపట్నంలో 1.80 లక్షల మందికి ఇళ్లపట్టాలు పంపిణీ చేసి, వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు.
విశాఖపట్నం డిజిటల్ కొలువుల హబ్ గా మారుతోందని,ప్రస్తుతం విశాఖ కేంద్రంగా 15 డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలు పని చేస్తుండగా రెండేళ్లలో ఉపాధి పొందే వారి సంఖ్య 15 వేలు దాటుతుందని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) అంచనా వేసిందని అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ.22,80,000 కోట్లతో సాగుతున్న డిజిటల్ మార్కెటింగ్ ఐదేళ్లలో రూ.15 లక్షల కోట్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనావేయడం జరిగిందని అన్నారు.
విశాఖ ముద్దుబిడ్డ సాహితీ వర్షిణి చెస్ క్రీడలో నగరం నుండి మొట్టమొదటి మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్‌గా అవతరించడం నగర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. ఈ ఘణత సాధించిన చిన్నారి సాహితికి హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని, భవిష్యతల్ ఆమె మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబొరేటరీలు బలోపేతం చేసేందుకు రాష్ట్రప్రబుత్వం రూ 100 కోట్లు వెచ్చిస్తోందని , వైఎస్సార్ విలేజ్ క్లినిక్ నుంచి జిల్లా ఆసుపత్రి వరకూ అన్ని రకాల వైద్యపరీక్షలు చేయడానికి వీలుగా అవసరమైన ఉపకరణాలను ఆయా ఆసుపత్రుల్లో సమకూరుస్తోందని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా నిధులు కేటాయించి రోడ్ల పునరుద్ధరణ పనులు చేపడుతోందని అన్నారు. రూ.2,205కోట్లతో 8,268కి.మీ. మేర రోడ్ల పునరుద్ధరణ కోసం 1,161 పనులు చేపట్టగా రూ.158కోట్ల విలువైన 118 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రూ. 697కోట్ల విలువైన 343పనులు దాదాపు పూర్తికావచ్చాయి.