– బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి
పదిసార్లు మెడలు నరుక్కుంటానని మాట తప్పిన కేసీఆర్ గారు… బండి సంజయ్ గారి మెడలు ఇరుస్తడా? ఈ వింత ప్రచార మాటలు హుజురాబాద్ కొచ్చి ఎందుకు మాట్లాడలె. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ మల్లా మల్లా గెలుస్తూ ఉంది. ఈ తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రాదు? మీ అబద్ధాలకు తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్రు.
మొదట పెట్రోల్, డీజిల్ పై రాష్ట్రం విధిస్తున్న VAT తగ్గించు. లక్ష కోట్లు తిన్న కేసీఆర్ గారు… పేదల గురించి మాట్లాడే పరిస్థితికి హుజూరాబాద్ ఫలితం తెచ్చింది. మీరు దేశంలో చక్రం తిప్పుతున్నామని తోక తెగ్గొట్టుకున్న ఫెడరల్ ఫ్రంట్ కాదా మీది? ఇన్ని దినాలకు బయటకొచ్చిన ఈ టూరిస్ట్ సీఎం గారు మల్లా డంబాచారం మాట్లాడుతున్నరు. నమ్మేటోళ్లు లేరు. VAT పెంచలేదు కాదు…. పెట్రోల్, డీజిల్‌పై ఉన్న VAT ఎందుకు తగ్గియ్యలే?
హుజూరాబాద్ చిన్న ఎన్నికైతే… 500 కోట్ల స్వంత డబ్బు, వేల కోట్ల పథకాల డబ్బుతో ఎందుకు ప్రయత్నం చేశారు. కేసీఆర్ కాదు.. అవినీతి ఎవరు చేసినా లోనికే పోతారు. టచ్ చేసి చూడు కేసీఆర్‌ని అంటే… చట్టం చూస్తూ ఊరుకోదు. మీరు లాలు, చౌతాలా కన్నా పెద్ద నాయకులేం కాదు.
మీ కేంద్రంతో పోరాటం గత రైతు ఉద్యమంలో హైదరాబాదులో పాల్గొని, ఢిల్లీలో ఉండి కూడా ఆ రైతులను దేఖనప్పుడే దేశమంతా చూసింది.
తీవ్ర హిందూ ద్వేష ఎంఐఎం మిత్రపక్షమని బాజాప్తాగా చెప్పుకున్న సీఎం గారు, బీజేపీని గొడవలు పెట్టే పార్టీ అనడం వారి నిజామీ రజాకార్లకు సలాం చేసే స్వభావం మాత్రమే…
ఒక్క రోజు కూడా సరిగ్గా ఉద్యమంలో పాల్గొనని… చివరికి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సందర్భపు కొట్లాటలో కూడా లేని మీరు… ఉద్యమకారుడిని అని ఎట్లా చెప్పుకున్నరు కేసీఆర్ గారు?
దళిత సీఎం… దళితులకు 3 ఎకరాలు… డబుల్ బెడ్రూంల లెక్క మల్లా దళిత బంధు మోసం మీరు చేస్తారు కాబట్టే మీ మెడలు వంచి అమలు చేయించనీకే మా బీజేపీ ఉద్యమం.
తెలంగాణలో కొత్తగా వచ్చిన పార్టీలే మిమ్మల్ని ఊరూరా బూతులు తక్కువ అన్నీ తిట్టబడితే ఇయ్యాల ప్రజలు పట్టించుకోవట్లేదు. భ్రమలకెల్లి ఇప్పటికైనా మీరు బయటకెల్తే కనీసం మీ భవిష్యత్‌కు మేలు.