Suryaa.co.in

Telangana

ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి

హైదరాబాద్‌ : సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల విజయశాంతి భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలి పదవి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించారు. కిషన్‌రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ తీరుపై ఆమె ఆగ్రహంగా ఉన్నారు. తెలంగాణ వ్యతిరేకులతో వేదిక పంచుకోవాల్సి వచ్చిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి ఎక్స్‌(ట్విటర్‌)లో పేర్కొన్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఈక్రమంలో ఈరోజు ఆమె కాంగ్రెస్‌లో చేరారు.

LEAVE A RESPONSE