-బయటపడ్డ బాబు (ఫేక్ నాయుడి) బండారం
-ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి
చంద్రబాబు కరకట్టకు పారిపోక ముందు హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ను సిఎం క్యాంప్ ఆఫీసుగా తీర్చిదిద్దడానికి 8 కోట్లు రూపాయలు వృథా చేశారని, ఆ తర్వాత హయత్ హోటల్ లో ఏడాది విడిది చేసి 30 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసారని, అప్పుడు కోట్లాది రూపాయలు కొల్లగొట్టి ఇప్పుడు వలంటీర్లకు దినపత్రిక కొనుగోలు భత్యం ఇస్తే తెదెపా నేత లోకేశ్ గగ్గోలు పెడుతున్నాడని రాజ్యసభ సభ్యులు వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు.
ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినా ఆయన విగ్రహాలకు చంద్రబాబు దండలే శాడని, మరి రంగా హత్యలో హస్తం ఉన్నా ఆయన విగ్రహాలకు బాబు ఎందుకు దండలు వేయలేదని ప్రశ్నించారు. బాబుకు నిజం చెబితే తల పగిలిపోయే ముని శాపం ఉన్నా నిజం చెప్పాల్సిందేనని అన్నారు. రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని జోగయ్య తన పుస్తకంలో చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు.
అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టించమని తానే చెప్పానని డప్పు కొట్టుకుంటున్న బాబు, అల్లూరి విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానించి ఉంటే ఆయనకు బాణాలు వేయడం నేర్పించింది తానేనని చెప్పుకునేవాడని ఎద్దేవా చేశారు.
బిల్ గేట్స్ తన ప్రియమిత్రుడని డప్పు కొట్టుకున్నా, ఫేకు నాయుడుని కలవడానికి గేట్స్ దావోస్ లో గంటసేపు ఎదురు చూశాడని పచ్చ’కుల మీడియాలో రాయించుకున్నా, అది బోగస్ అని అందరికీ తెలుసని అన్నారు. ట్విట్టర్ లో గేట్స్ కు ఫాలో అయ్యే 433 మందిలో తుప్పు నాయుడి జాడే లేకపోవడంతో బండారం బయటపడిపోయిందని అన్నారు.
ఫేకుడు నాయుడు మళ్లీ పరువు తీసుకున్నాడు. బిల్ గేట్స్ తన ప్రియమిత్రుడని డప్పు కొట్టుకున్నా, ఫేకును కలవడానికి గేట్స్ దావోస్ లో గంటసేపు ఎదురు చూశాడని పచ్చ’కుల మీడియాలో రాయించుకున్నా, బోగస్ అని అందరికీ తెలుసు. Twitterలో గేట్స్ ఫాలో అయ్యే 433 మందిలో తుప్పు నాయుడి జాడే లేదు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 4, 2022