Suryaa.co.in

Andhra Pradesh Business News

యూనికార్న్‌ స్టార్టప్స్‌ హబ్‌గా విశాఖ

-వ్యవస్థాపకులు, సీఈఓలతో దావోస్‌లో సీఎం భేటీ
-అవసరమైన వనరులు సమకూరుస్తామన్న ముఖ్యమంత్రి
-ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామన్న బైజూస్‌
-పరిశోధక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడి
-పాఠ్యప్రణాళికను ఏపీ విద్యార్థులకు అందిస్తామని ప్రకటన
-సమగ్ర భూ సర్వే రికార్డుల నిక్షిప్తం చేయడంతో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామన్న కాయిన్‌స్విచ్‌ క్యూబర్‌
-ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి తమవంతు చేయూత నిస్తామన్న ఈజ్‌మై ట్రిప్‌
-ఏపీ పర్యాటక స్థలాలకు మరింత గుర్తింపునిస్తామని వెల్లడి

దావోస్‌: యూనికార్న్‌ స్టార్టప్స్‌ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటుందని సీఎం వైయస్‌.జగన్‌ అన్నారు. దావోస్‌లో వివిధ స్టార్టప్స్‌కు చెందిన వ్యవస్థాపకులను, సీఓలను, వీటికి సంబంధించిన ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు. ఏపీలో స్టార్టప్స్‌ కంపెనీల ఏర్పాటు, అభివృద్ధిపై చర్చించారు. విశాఖపట్నం కేంద్రంగా స్టార్టప్స్‌ కార్యకలాపాలను ముమ్మరంచేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందరికీ ఆహ్వానం పలుకుతోందని వెల్లడించారు. విధాన పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై సీఎం వీరితో చర్చించారు. స్టార్టప్‌లు అభివృద్ధిచెందడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటామని, అవసరమైన అన్ని వనరులు సమకూరుస్తామని సీఎం అన్నారు.

ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామని బైజూస్‌ వైస్‌ ప్రెశిడెంట, పబ్లిక్‌పాలసీ సుష్మిత్‌ సర్కార్‌ ప్రకటించారు. ఏపీ విద్యకు సంబంధించి పరిశోధక, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, బైజూస్‌ పాఠ్యప్రణాళికను ఏపీ విద్యార్థులకు అందిస్తామన్నారు.

ఏపీలో సమగ్ర భూసర్వే, రికార్డుల భద్రపరచడం.. ఈఅంశంలో సాంకేతిక పరిజ్ఞానం అంశంపై కాయిన్‌స్విచ్‌ క్యూబర్‌ కంపెనీ వ్యవస్థాపకుడు, గ్రూపు చీఫ్‌ ఎగ్జిక్యూటివి ఆఫీసర్‌ ఆశిష్‌ సింఘాల్‌తో సీఎం చర్చించారు. సమగ్ర భూ సర్వే రికార్డుల నిక్షిప్తం చేయడంతో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని సింఘాల్‌ తెలిపారు.

ఏపీలో పర్యాటక రంగ అంశంపై ఈజ్‌మై ట్రిప్‌ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ పిట్టితో సీఎం చర్చించారు. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి అభివృద్ధికి తమవంతు చేయూత నిస్తామని, ఏపీ పర్యాటక స్థలాలకు మరింత గుర్తింపునిస్తామని ప్రశాంత్‌ తెలిపారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మీషో వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్‌ ఆత్రేయ, బైజూస్‌ వైస్‌ ప్రెశిడెంట్‌ పబ్లిక్‌పాలసీ సుష్మిత్‌ సర్కార్, కాయిన్‌స్విచ్‌ క్యూబర్‌ వ్యవస్థాపకుడు, గ్రూప్‌ సీఈఓ ఆశిష్‌ సింఘాల్, ఈజీమై ట్రిప్‌ ప్రశాంత్‌పిట్టి, వీహివ్‌.ఏఐ వ్యవస్థాపకుడు సతీష్‌ జయకుమార్, కొర్‌సెరా వైస్‌ ప్రెశిడెంట్‌ కెవిన్‌ మిల్స్‌ ఉన్నారు.

LEAVE A RESPONSE