పచ్చటి ఆకుల పరిమళం..
పచ్చడి రుచుల సమ్మేళనం..
కొత్త ఏడాది కాంతులు చిందించే
మంగళకరమైన ఉగాది వచ్చింది!
గడిచినదాన్ని గమనం చేసుకునీ
కొత్త ఆశలతో ముందుకు సాగాలి!
దుఃఖాన్నధిగమించి సంతోషం చేరాలి!
జీవితాన్ని అహరహం జయించాలి!
మామిడి పూతల్లో మంగళ మకరందం..
మంచిరోజే నేడు మనకనుసంధానం!
విశ్వవసు లోకానికి వెలుగుల పండుగ..
సుభిక్ష జీవనవికాసానికిది తొలి అడుగు!
రాగి కిరణాలు రమ్యంగా తాకగా..
కనుల ఆనందం పూస్తోంది భువిపై!
ఆశయాలను అంకురించుకునే వేళ
మనసావాచా ఉగాదిని స్వాగతిద్దాం!
కొత్త ఆశలతో కొత్త వెలుగుతో…
కొత్త వత్సరానికి స్వాగతమిచ్చేరోజు!
పచ్చటి మామిడి తోరణాలతో..
పండుగ శోభను పెంచిపంచే రోజు!
పచ్చడి రుచుల ప్రయోగమే జీవితం..
తీపి- చేదు- పులుపు- వగరు….!
అన్ని అనుభవాల సమ్మేళనం!
సాఫీగాసాగిపోనిదే నిజమైన జీవనం!
గడిచిన బాధల్ని గాలికి వదిలాలి..
తరువాతి అడుగును ధైర్యంగా వేయాలి!
నూతన సంవత్సర వనరులతో..
మన లక్ష్యాలతీరాలను చేరాలి!
కొత్త వసంతం నిండా విరబూసింది!
ప్రకృతిలో నూతన శోభ వెల్లివిరుస్తోంది!
ప్రతి ఇంటా ఉల్లాస హాస్యం!
ప్రతి మనసులో నవ ఉగాది కాంతి!
-రామకృష్ణ