Suryaa.co.in

Andhra Pradesh

వాలంటీర్లు వైసీపీ నేతలతో కలిసి ఇంటింటికీ వెళ్లి జగన్ స్టిక్కర్లు అంటించడం ముమ్మాటికీ నేరమే

– ప్రజాస్వామ్యం, చట్టాలకు విరుద్ధంగా జగన్ స్వామ్యాన్ని అమలుచేస్తూ ప్రజలసొమ్ము జీతంగా తీసుకుంటున్న వాలంటీర్లు వైసీపీ నేతలతో కలిసి ఇంటింటికీ వెళ్లి గోడలపై జగన్ బొమ్మతో కూడిన స్టిక్కర్లు అంటించడం ముమ్మాటికీ నేరమే
-బటన్లు నొక్కినా తనను ప్రజలు నమ్మడంలేదనే, అధికారులు, వైసీపీనేతలు, వాలంటీర్లచేతికి సంచులిచ్చి జగన్ తనబొమ్మతో కూడిన స్టిక్కర్లు గోడలపై అంటించమంటున్నాడు
• ప్రజల సొమ్ముని జీతంగా తీసుకుంటున్న వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి, జగన్ బొమ్మఉన్న స్టిక్కర్లను గోడలపై ఎలా అతికిస్తారు?
• ఏపీ ప్రివెన్షన్ యాక్ట్ 1997ప్రకారం ప్రభుత్వఉద్యోగులు రాజకీయపార్టీలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రజల అనుమతి లేకుండా వారిఇళ్లపై ప్రకటనలు. బొమ్మలు అంటించడం చేయకూడదని తెలియదా?
• టీడీపీ మహిళానేత కల్యాణి అరెస్ట్ లో హద్దులుమీరి ప్రవర్తించిన పోలీసులపై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదుచేస్తాం.
• పరదాలు, పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ లేకుండా జనంలోకి వచ్చే దమ్ము, ధైర్యం జగన్ కు, రోజాకు, వైసీపీఎమ్మెల్యేలకు ఉన్నాయా?
• ఉండవల్లి శ్రీదేవి పరిస్థితే త్వరలో రోజాకు వస్తుంది
-తెలుగు మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

బటన్లు ఎంతనొక్కినా ప్రజలు తనను నమ్మడంలేదని భావించిన జగన్, తనపార్టీ ఎమ్మెల్యే లు, వైసీపీనేతలు, కార్యకర్తలు, వాలంటీర్లచేతికి సంచులిచ్చి ప్రతిఇంటికీ తన బొమ్మతో కూడి న స్టిక్కర్లు అంటించే కార్యక్రమానికి తెరలేపాడని, ప్రజలసొమ్ముని ముఖ్యమంత్రి తన ఇష్టాను సారం తనప్రచారపిచ్చికి వాడుకుంటున్నాడని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూ డి అనిత తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆమెమాటల్లోనే …

“వాలంటీర్లు ప్రభుత్వఉద్యోగులని చెప్పి, వారికి ప్రజలసొమ్ముని జీతంగాఇస్తున్న జగన్, వారితో తనసొంత కార్యక్రమాలు ఎలా చేయించుకుంటాడు? ఇంటింటికీ తనబొమ్మతో కూడిన స్టిక్కర్లు అతికించే కార్యక్రమంలో వారిని ఎలా భాగస్వాముల్నిచేస్తాడు. ఏపీ ప్రివెన్షన్ యాక్ట్ 1997ప్రకారం ప్రభుత్వఉద్యోగులు రాజకీయపార్టీలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన కూడదు. అలానే ప్రజలకు ఇష్టంలేకుండా వారిఇళ్లముందు ఎలాంటి పోస్టర్లు, స్టిక్కర్లు అంటించకూడదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం స్థానంలో జగన్ స్వామ్యం నడుస్తోంది. వాలంటీ ర్లు ప్రభుత్వచట్టాలకు విరుద్ధంగా, జగన్ స్వామ్యాన్ని అనుసరిస్తూ, స్టిక్కర్ల అంటించడం వం టి దిక్కుమాలిన పనులు చేయడంద్వారా జైలుశిక్షలు అనుభవించాల్సి రావచ్చు.

జగన్ బొమ్మతోకూడిన స్టిక్కర్లను షర్మిల, సునీతల ఇంటిగోడలపై అతికించే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉన్నాయా?
జగన్ ప్రజలనమ్మకం, వారిభవిష్యత్ ఎలా అవుతాడో చెప్పాలి. ఆ పేరుతో ముద్రించిన స్టిక్కర్ల నే నేరుగా వై.ఎస్.షర్మిల, వై.ఎస్.సునీతల ఇళ్లగోడలకు అంటించే దమ్ము, ధైర్యం ఈ ప్రభు త్వానికి ఉందా? తనచెల్లెళ్ల ఇంటివద్ద జగన్ బొమ్మతోకూడిన స్టిక్కర్లు అంటించాకే, ప్రజల ఇళ్ల గోడలపై అంటించాలి. తనచెల్లెళ్లు, తనకుటుంబసభ్యులే జగన్ ను నమ్మకపోతే, సామా న్యప్రజలు ఎలా నమ్ముతారు? జగన్ బొమ్మతో కూడిన స్టిక్కర్లతయారీకి అంతా ప్రజలసొ మ్మే ఖర్చుపెట్టారు. ప్రజలసొమ్ముతో ముద్రించిన స్టిక్కర్లను ప్రజలఇళ్లగోడలపై అతికించడాని కి మరలా ప్రజలసొమ్మే ఖర్చుపెట్టడం సిగ్గుచేటు. జగన్ పేరుతో అతనిబొమ్మతోకూడిన స్టిక్క ర్లు అతికించాక, ఎంతమంది ప్రజలు గోడలపై వాటిని అలానే ఉంచుతున్నారో పరిశీలించుకోండి.

జగన్ ను ప్రజలు ఎందుకునమ్మాలి? ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేక, జనంలోకి రావడానికి ముఖంచెల్లనందుకు నమ్మాలా?
జగన్ ను ప్రజలు ఎందుకు నమ్మాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుప్పలుతెప్పలుగా హామీ లుఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించినందుకు నమ్మాలా? దశలవారీగా మద్య పాననిషేధం అమలుచేస్తాననిచెప్పిన జగన్, ముఖ్యమంత్రి కాగానే మద్యంఅమ్మకాలద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వాన్ని నడుపుతూ, ఆడబిడ్డల మాంగల్యాలు తెంపుతున్నందుకు జగన్ ని నమ్మాలా? తండ్రి తాగి ఆరోగ్యం పాడుచేసుకుంటే తప్ప, జగన్ తల్లికి అమ్మఒడి ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాడు. ఆడబిడ్డల్ని అతిదారుణంగా హత్యచేస్తున్నందుకు, వారిపై అఘాయిత్యాలు జరిగేలా చట్టాన్ని నీరుగార్చినందుకు, దిక్కులేని దిశాచట్టంపేరుతో ఆడబి డ్డల మానప్రాణాలను బలితీసుకుంటున్నందుకు జగన్ ని నమ్మాలా? విద్యుత్ ఛార్జీలుపెంచనని చెప్పి 7సార్లు విద్యుత్ ఛార్జీలుపెంచి ప్రజలపై రూ.20వేలకోట్ల భారం మోపినందుకు జగన్ ని జనం నమ్మాలా? ప్రభుత్వఆస్తుల్ని అమ్మేస్తూ దొరికినవాటిని తాక ట్టుపెట్టేస్తూ అయినకాడికి అప్పులుతెచ్చి, రాష్ట్రాన్ని అప్పులఊబిలో దించినందుకు జగన్ ని ప్రజలు నమ్మాలా? విద్యాదీవెన, అమ్మఒడి, నాడు-నేడు పేరుతో అవినీతికిపాల్పడి విద్యా వ్యవస్థను నాశనంచేసినందుకు జగన్ ని నమ్మాలా? జగన్ విద్యారంగాన్ని సంస్కరిస్తే రాష్ట్రం లో విద్యాప్రమాణాలు ఎందుకు పడిపోయాయి? జగన్ మామ మాకొద్దు.. మాబడే మాకు ముద్దు అనిచిన్నారులు కూడా రోడ్లపైకి రావడం ఈ రాష్ట్రంలోనే చూశాం.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పొరుగురాష్ట్రం వారు మాట్లాడుతుంటే జగన్ ఎందుకు నోరువిప్పడు?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జగన్ నోరువిప్పడు. ఎందుకంటే కేంద్రంతో పెట్టుకుంటే ఎక్కడ తనను లోపలేస్తారో అన్నభయం. ఆభయంతోనే ప్రత్యేకహోదా గురించి, కేంద్రంనుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరానికి నిధులు, అమరావతి నిర్మాణానికి నిధులు వేటీ గురించి మాట్లాడడు. జగన్ చేతగానితనంతో రాష్ట్రానికి రావాల్సిన అనేకపరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. పక్కరాష్ట్రం వారు విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, తాము మినరల్ కార్పొరేషన్ తరపున బిడ్ వేస్తామంటున్నా జగన్ కు, అతనిప్రభుత్వానికి సిగ్గులేకుండా పోయింది.

దళితులు, బీసీలు, మైనారిటీలను దారుణంగా వంచించినందుకు, ప్రశ్నించినవారిని కిరాతకంగా హతమారుస్తున్నందుకు ఆయావర్గాలన్నీ మరలా జగన్ ని నమ్మాలా?
డాక్టర్ సుధాకర్ మొదలు డాక్టర్ అచ్చెన్న వరకు వేలాది దళితుల్ని బలితీసుకున్న జగన్ ను దళితులు నమ్మాలా? బీసీల రిజర్వేషన్లకు కోతపెట్టి, వారిని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణగదొక్కినందుకు వారు జగన్ ను నమ్మాలా? మైనారిటీలపై దాడులుచేసి, వారి వక్ఫ్ భూముల్ని కబ్జాచేస్తున్నందుకు, వారికి చంద్రబాబు అమలుచేసిన పథకాల్నిరద్దు చేసినందుకు వారు జగన్ ని నమ్మాలా? రాష్ట్రానికి జగన్ అవసరంలేదని ప్రజలు ధృడచిత్తం తో ఉన్నారు. దొంగోడు జగన్ ను నమ్మడానికి, మరోసారి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.

టీడీపీ మహిళా నేత కల్యాణి అరెస్ట్ సమయంలో అతిగా ప్రవర్తించిన పోలీసులపై జాతీయ మహిళాకమిషన్ కు ఫిర్యాదు చేయబోతున్నాం
తెలుగుదేశం పార్టీ మహిళానేత మూల్పూరి కల్యాణిని అరెస్ట్ చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బెయిల్ కోసం ఆమె ఇన్నిరోజులు పోలీసులకు కనిపించలేదు. ఆమె రెండు కేసుల్లో ముద్దాయి అయినంతమాత్రాన పడకగదిలో ఎలాఉంటే అలానే ఆమెను అదుపులోకి తీసుకుంటారా? అలా ఎలా అదుపులోకి తీసుకుంటారో పోలీసులు సమాధానం చెప్పాలి. లక్ష్మీప్రసన్న అనే ఆమె మాటల్ని తాముగుర్తుపెట్టుకున్నాం. ఆమెచేసిన ఓవరాక్షన్ కు తాము తగినవిధంగానే సమాధానంచెబుతాం. కల్యాణిని అరెస్ట్ చేసి రిమాండ్ కుపంపారు. కల్యాణి అరెస్ట్ పై హోంమంత్రి, మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ స్పందించలేదు. డీజీపీకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, ఎన్నిఫిర్యాదులుచేసినా ఉపయోగంలేదు. కల్యాణిని అరెస్ట్ చేసే వ్యవహారంలో పరిధిదాటి ప్రవర్తించిన మహిళా పోలీస్ లక్ష్మీప్రసన్నపై జాతీయ మహిళాకమిషన్ కు తాము ఫిర్యాదుచేయబోతున్నాం. జగన్మోహన్ రెడ్డిని పీఠంనుంచి కిందకు దించేవరకు తెలుగుమహిళావిభాగం పోరాడుతుంది.

రోజా విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నా. ఆమె ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తాను, ఎవరికి ప్రజల్లోకి వెళ్లడానికి భయమే తేల్చుకుందాం
రోజా టీడీపీపై, చంద్రబాబుపై సవాళ్లుచేసేముందు ఆమె నగరికి వెళ్లి ప్రజలకు కనిపిస్తే వారే సమాధానంచెబుతారు. టీడీపీకి ప్రజల్లోకి వెళ్లేధైర్యం లేదంటున్న రోజా విసిరిన సవాల్ కు తాముసిద్ధం. పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ లేకుండా జగన్మోహన్ రెడ్డిగానీ, రోజాగానీ ప్రజల్లోకి వెళ్లగలరా? టీడీపీనేతల్ని చూసి జగన్, అతని ఎమ్మెల్యేలు, మంత్రులు భయపడుతున్నారుగానీ, ప్రజలకాదు. రోజా ఎక్కడికి రమ్మంటే తాను అక్కడికి వెళ్తాను. ప్రజల్లోకి వెళ్లే దమ్ము, ధైర్యం తమకు, తమపార్టీకి ఉందికాబట్టే 3 గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీలు, ఒక ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీ గెలిచాం. వైసీపీఎమ్మెల్యేలు ఎందుకు టీడీపీతో టచ్ లో ఉన్నారో రోజా చెప్పాలి. వైసీపీకి చెందిన దళితమహిళాఎమ్మెల్యే జగన్ వల్ల తన కుప్రాణహాని ఉందని వాపోయింది. త్వరలోనే రోజాకు కూడా అదేపరిస్థితి వస్తుంది. పరదాలు, పోలీసులు లేకుండా, నత్తిలేకుండా మాట్లాడలేని జగన్ కు ప్రజలంటే భయంకానీ, టీడీపీకి, చంద్రబాబుకి కాదు .” అని అనిత తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE