ఓటు… నీ వెంత నీటు !!
నీ మదిలో ఇవ్వవా చోటు !!
రాజకీయానికి నీవే వేటు
ఏ నాయ కుడైనా రావాల్సిందే నీ చెంతకు
ఎన్ని జెండాలు మారినా నీ ఎజెండా ఒక్కటే
రాజరికానికి సృష్టి స్థితి లయకారుడివి నీవే
ప్రజల చేతిలో చైతన్య దీపికవు
నాయకుల జీవితానికి నిజమైన ఊపిరివి
ప్రియమైన వారికి ప్రాణానివి
ఎందరిని పరుగులు తీయిస్తావో ?
ఎందరిని ఉరికించి ఊరడిస్తావో ?
చివరికి ఊరవతలికి నెట్టేస్తావో ?
ఓటు నీవే ధీటువు ప్రపంచమే నీ చుట్టూ
ఎందరు నాయకులు పుట్టు కొచ్చినా
చేయి చాచి అర్థించాల్చిందే !!
ప్రపంచాన్ని నడిపించే నోటు
ఓటుకు సలాం చేయాల్సిందే !!
నీలో ఓ రకమైన ఆకర్షణ ఉంది
అదే నాయకుల గుండెల్లో కలవరం
ఓటు నీవెంత గట్టిదానవో !!
ఎంతటి వ్యక్తయినా నీవంటే అదురే !
ప్రతి నాయకుడి మనసులో బెదురే !
ఐదేళ్లకు ఒక సారే కదా నీ నీటూ
కాని ఓటు నోటుకు నాటుకు లొంగొద్దు !!
నీ దెబ్బకు కొమ్ములు తిరిగిన
నాయకుడైనా కుప్పకూలి పోవాల్సిందే
అయినా ఓటు నీకో నమస్కారం !!
ప్రజల చేతిలో ఆయుధమైనందుకు
అందుకే రాజకీయ యుద్ధానికి వెనుకంజ వేయొద్దు !!
రాజ్యాంగానికే వెలుగువు
అందుకే నిన్ను కొలుస్తారు
అనుక్షణం తలుస్తారు
వచ్చే నేతలు ఎవరో !!
పోయే నేతలు ఎవరో !!
అంతా నీచేతుల్లోనే ఉంది
ఎవరైనా నీ గొప్పతనం తెలుసు కోవాల్చిందే !!
నోటు మత్తులో పడిపోవద్దు !!
తరతరాలు నీ విలువను కాపాడుకో !!
ఇది సందేశం కాదు. ఆదేశం అసలే కాదు
ప్రతి పౌరుడి జీవితం నీ చేతిలోనే ఉంది
ప్రతినాయకుని ప్రాణం నీ చుట్టే తిరుగుతుంది
అందుకే నేస్తమై ప్రజల్లో సమస్తం కావాలి
కుళ్లు రాజకీయానికి స్వస్తి చెప్పాలంటే
కుతంత్ర నాయకులను
కూల్చాలంటే నీవు కళ్ళు తెరువాలి
దుష్ట దుర్మార్గుల వలలో
చిక్కకుండా ధీటైన సమాధానం చెప్పాలి !!

(గవర్నర్ బండారు దత్తాత్రేయ గారి వ్యక్తిగత కార్యదర్శి)