– మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య
ఎన్టీఆర్ జిల్లా/నందిగామ : ఎన్నికల సమయం ఆసన్నమవుతోంది. ఎన్నికల సంగ్రామానికి అందరూ సంసిద్ధంగా ఉండాలి.అధికారాన్ని అడ్డుపెట్టి ఓట్లను తప్పుడు తడకలు చేయడానికి జగన్ రెడ్డి చేయని ప్రయత్నాలు లేవు.ఒక్క ఛాన్స్ మాయగాళ్లు గ్రామాలలో/వార్డులలో దొంగ ఓట్లు సృష్టించే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు.ఈ సమయంలో నిర్లిప్తత వీడి ఓట్ల పరిశీలన వాటి అభ్యర్థనలపై ప్రతి ఒక్క బూత్ కన్వీనర్ దృష్టి పెట్టాలి.జీరో డోర్ నెంబర్,చేర్పులు తొలగింపులపై డిసెంబర్ 2,3 తారీకులలో పోలింగ్ బూత్ అధికారులు పోలింగ్ బూత్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారు. క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలు మరియు పోలింగ్ బూత్ కన్వీనర్లు సమన్వయంతో చురుకుగా పనిచేసుకుంటూ పోవాలి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ప్రతి ఇంటికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.