బెల్జియం లో వరుసగా నాలుగుసార్లు ఓటేయకపోతే.. పదేళ్ల వరకు ఓటు హక్కుండదు.
మొదటిసారి వేయకపోతే రూ.4 వేలు, రెండోసారికి రూ.10వేలు జరిమానా వేస్తారు.
ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కోల్పోతారు. దీంతో 96 శాతం ఓటింగ్ నమోదవుతుంది.
ఆస్ట్రేలియా లోనూ జరిమానా విధానాన్ని అనుసరిస్తున్నారు. ఓటు వేయకపోతే వారం రోజుల్లో జరిమానా చెల్లించాలనే నిబంధన ఉంది. దీంతో ఇక్కడ 98 శాతం పోలింగ్ నమోదవుతోంది.
సింగపూర్ లో ఓటు వేయకపోతే ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తారు.
కారణాలను పూర్తి ఆధారాలతో, పెద్దల సంతకంతో అందిస్తేనే ఓటుహక్కు పునరుద్ధరిస్తారు. దీంతో 92 శాతం నమోదవుతుంది.
గ్రీస్ లో ఓటు వేయని వారికి డ్రైవింగ్ లైసెన్స్,పాస్‌పోర్టు ఇవ్వరు. బలమైన కారణాలు చూపితే తప్ప వాటిని పునరుద్ధరించరు. ఇతర సౌకర్యాలపైనా ఆంక్షలు విధిస్తారు. ఇక్కడ 94శాతం ఓటింగ్ నమోదవుతుంది.
– జన విజ్ఞాన వేదిక