Suryaa.co.in

Editorial

సోమేష్‌కుమార్‌కు వీఆర్‌ఎస్‌

– ఏపీ సర్కారు గ్రీన్‌సిగ్నల్‌
– తెలంగాణ రెరా చైర్మన్‌గా చాన్స్‌?
– ఆ మేరకు కేసీఆర్‌ ముందస్తు హామీ
– సోమేష్‌ కోసమే రెరా నోటిఫికేషన్‌ గడువు పొడిగింపు?
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి.. కోర్టు ఆదేశాలతో ఏపీ క్యాడర్‌కు బదిలీ అయిన సోమేష్‌కుమార్‌ వీఆర్‌ఎస్‌కు, ఏపీ సర్కారు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ఆయన ఏపీలో, విధినిర్వహణ చేయకుండానే వీఆర్‌ఎస్‌ ఇచ్చిన ట్టయింది.

నిజానికి ఆయన ఏ పీ ప్రభుత్వానికి రిపోర్టు చేసిన వెంటనే, తన కు వీఆర్‌ఎస్‌ ఇవ్వాలని సీఎం జగన్‌ను అభ్యర్ధించినట్లు సమాచారం. ఒక దశలో రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపించినప్పటికీ, ఆయన వీఆర్‌ఎస్‌ వైపే మొగ్గు చూపారు. దానితో రాజీనామా ఊహాగానాలకు తెరపడింది. తెలంగాణ ప్రభుత్వం సోమేష్‌కుమార్‌కు సలహాదారు పదవి ఇస్తుందన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో అత్యంత కీలకమైన రెరా చైర్మన్‌ ఇస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి.

కాగా విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తెలంగాణ రెరా చైర్మన్‌గా సోమేష్‌కుమార్‌ నియమితులయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు సీఎం కేసీఆర్‌ ఆయనకు, ముందస్తు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే శుక్రవారంతో ముగిసిన రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్‌, డైరక్టర్ల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ గడువును పొడిగించినట్లు కనిపిస్తోంది.

సోమేష్‌కుమార్‌ వీఆర్‌ఎస్‌కు ఏపీ సర్కారు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం, ఇటు తెలంగాణ సర్కారు రెరా చైర్మన్‌, డైరక్టర్ల నియామకాల నోటిఫికేషన్‌ గడువు పెంచడం ఒకేసారి జరగడం విశేషం. దీనితో సోమేష్‌ రెరా చైర్మన్‌ నియామకానికి మార్గం సుగమం అయినట్టయింది.

LEAVE A RESPONSE