Suryaa.co.in

Andhra Pradesh

వేతనాలు తప్ప దాదాపు అన్నీ అంగీకరించాం

– ప్రభుత్వ సలహాదారులు,పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

అంగన్ వాడీలు,మున్సిపల్ వర్కర్లు పట్టుదలకు పోకుండా వెంటనే సమ్మె విరమించి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సిఎం క్యాంపు కార్యాలయం వద్ద తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ప్రభుత్వ సలహాదారులు,పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు..

సమ్మె ప్రారంభమై నెలరోజులు గడుస్తోంది. గర్భిణులు, బాలింతలు, పిల్లలు పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్నారు.వారు అడిగిన డిమాండ్లలో వేతనాలు తప్ప దాదాపు అన్నీ అంగీకరించిన విషయం సహృదయంతో అర్ధం చేసుకోవాలి.పరిష్కారమయ్యే వాటికి జగన్ ఆమోదం తెలిపారు..

అంగన్ వాడీలు,మున్సిపల్ కార్మికులు ప్రభుత్వంలో భాగం.వేతనాల పెంపు ప్రస్తుత పరిస్దితులలో సాధ్యం కాదని వివరంగా చెప్పాం.ఎన్నికల తర్వాత వేతనాలు పెంచడం జరుగుతుందని అనేక స్దాయిలలో వారి సమస్యలపై చర్చించిన అనంతరం నిర్ణయించామన్నారు. వారు పరిస్దితిని అర్ధంచేసుకోవాలి.అత్యవసర సర్వీసులు కాబట్టే ఎస్మా తీసుకురావాల్సి వచ్చింది.ఎస్మా నేపధ్యంలో అంగన్ వాడిల విషయంలో ఎక్కడా దురుసుగా ప్రవర్తించవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చాం.

సమ్మె విరమించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది.తప్పనిసరి పరిస్దితులలోనే ప్రత్యామ్నాయాల వైపు వెళ్లాల్సి వస్తోంది.ఎందుకంటే అంగన్ వాడీల ద్వార జరుగుతున్న డిస్ర్టిబ్యూషన్ నిలిచిపోవడం వల్ల లబ్దిపొందాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి అవి అందించాల్సిన అవసరం ఉంది.

అంగన్వాడీ కార్యకర్తలు ప్రతిపక్షరాజకీయ అజెండాలకు బలికావొద్దు.కొందరు రాజకీయనేతలు వారి వెనకఉండి ఆందోళనను నడిపిస్తున్నారు.రాజకీయ కోణం కూడా ఉంది. జగన్ గారిని లక్ష్యంగా చేసుకుని సమ్మె నుంచి రాజకీయలబ్ది కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం యూనియన్ నేతల ఆడియో క్లిప్పింగ్ లలో సైతం బయటపడింది.అంగన్ వాడీల ఆందోళన.వారిని రాజకీయపార్టీలు రెచ్చగొట్టడం ఎన్నికలలో లబ్దిపొందాలని ఎవరి ఆలోచన వారికి ఉండవచ్చు.కాని ప్రభుత్వం ప్రజల అవసరాలు,ప్రయోజనాలపట్ల బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందనేది సమ్మె చేస్తున్న ప్రతి ఒక్కరూ గుర్తించాలి.

అంగన్ వాడీలకు సంబంధించి తెగేంతవరకు పరిస్దితి తీసుకురావద్దని వారిని కోరుతున్నామని అలా జరగకూడదని ప్రభుత్వం కూడా కోరుకుంటోంది. ప్రభుత్వం వైపు నుంచి అలా ఉండదు.మీరు కూడా అలా ప్రవర్తించకూడదని కోరుకుంటున్నాం.అయితే ప్రత్యామ్నాయాలకు అడ్డుపడితే చర్యలు తీసుకోవాల్సిన పరిస్దితి ఏర్పడుతుంది. ప్రత్యామ్నాయల గురించి ప్రభుత్వం ముందుకువెళ్తే ఆ మేరకు అంగన్ వాడిలకు నష్టం జరుగుతుంది.అలా జరగకూడదనేది ప్రభుత్వం ఆలోచన.

ప్రస్తుతం వేతనాలను పెంచలేం.జగన్ గారు సీఎం కాగానే తెలంగాణ కంటే ఎక్కువగా వేతనాలు పెంచారు.ఆ తర్వాత పరిశీలిస్తే మరో రెండేళ్లతర్వాత తెలంగాణ ప్రభుత్వం మరోసారి వేతనాలు పెంచింది. భవిష్యత్తు లో వేతనాలు పెంచుతాం..అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఉన్న వారంతా రెచ్చగొట్టేవిధంగా వ్యవహరిస్తున్నారు. జైళ్లకైనా వెళ్తాం.ప్రభుత్వాన్ని గద్దె దించుతాం అంటూ మాట్లాడుతున్నారు.

ఇప్పటికైనా సమయం మించిపోలేదు.దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. పట్టుదలకు పోకుండా అంగన్ వాడీలు, పారిశుద్య కార్మికులు సహకరించాలని కోరుతున్నాం. మున్సిపల్ కార్మికులను ఎస్మా పరిధిలోకి తెచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదు అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

వైయస్సార్ సిపి అభ్యర్దులను పలుచోట్ల మార్చడాన్నితెలుగుదేశం పార్టీ భూతద్దంలో చూపుతూ ఏదో జరిగిపోతోందని దుష్ప్రచారం చేస్తోందన్నారు.నిజానికి చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకోవడంతో పవన్ కల్యాణ్ కాళ్ళు పట్టుకుని పొత్తుకు అంగీకరింపచేసుకున్నారని తెలియచేశారు. జనసేనకు ఎన్నిసీట్లు ఇస్తారో తెలియని స్దితిలో ఉన్నారు. టిడిపికి పోటీకి అభ్యర్దులే దొరకడం లేదన్నారు. నిజానికి చంద్రబాబును,తెలుగుదేశాన్ని ప్రజలు ఎప్పుడో చెత్తబుట్టలో పడేశారని వివరించారు.

గత ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ పలుచోట్ల ఎస్సీ అభ్యర్దులను మార్చిందని అనిత,జవహర్,గంటాశ్రీనివాసరావు వంటి వారిని నియోజకవర్గాలు మార్చిన విషయాన్ని గుర్తుచేశారు.మాకు మంచి టీమ్ ఉంది.అభ్యర్దుల ఎంపిక పట్ల మేం కాన్పిడెంట్ గా ఉన్నామని తెలియచేశారు.అన్ని పార్టీలు జతకూడి వచ్చినా…కట్టకట్టకుని వచ్చినా మాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వైయస్ జగన్ పారదర్శకపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు.మా విజయానికి ఎలాంటి ఢోకా లేదన్నారు.

వాలంటీర్లు ఉద్యోగులు కారు. అలాంటప్పుడు వారు ఎన్నికల విధులలో ఎలా పాల్గొంటారు? ప్రతి పక్షాలు ఎన్నికల కమీషన్ కు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాయి. సచివాలయ ఉద్యోగులు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులేననేది గమనించాలి అన్నారు. తెలుగుదేశం పార్టీకి పోటీచేసేందుకు అభ్యర్దులే దొరకటం లేదన్నారు.వాళ్ళు ఓటమికి ముందుగా సాకులు వెదుక్కునే క్రమంలో భాగంగా ఓటర్ల జాబితాలు,ఇతర విధాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

తెలంగాణలో ఎన్నికలు అయ్యాక వారు ఓటర్ల నమోదు ప్రారంభించిన విషయాన్ని, ఆధారాలతో సహా ఎన్నికల కమీషన్ కు వైయస్సార్ సిపి ఫిర్యాదు చేసిందన్నారు. చంద్రబాబు తమ ఓటమికి కారణం ఈవీఎంలు అన్న విషయాన్ని సజ్జల గుర్తు చేశారు.

LEAVE A RESPONSE