Suryaa.co.in

Andhra Pradesh

తూనికలు, కొలతల శాఖలో గత ఏడాదికి మించి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం

– ఐదు నెలల్లోనే రూ. 6.59 కోట్ల స్టాంపింగ్ ఫీజులు
– రూ.3.69 కోట్ల కాంపౌండింగ్ ఫీజులను వసూలు చేశాం
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, సెప్టెంబర్ 7: తూనికలు, కొలతల శాఖలో రాష్ట్రవ్యాప్తంగా మెరుగైన ఫలితాలను సాధిస్తున్నామని, గత ఏడాదితో పోల్చితే ఇదే సమయానికి రూ. 82 లక్షల 74 వేల 185 ల స్టాంపింగ్ ఫీజులను, రూ.7 లక్షల 70 వేల 900 ల కాంపౌండింగ్ ఫీజులను అధికంగా వసూలు చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడలో తూనికలు, కొలతల శాఖ పనితీరుపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ 2021-22 ఆర్ధిక సంవత్సరంలో గత ఐదు నెలల కాలంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రూ. 6 కోట్ల 59 లక్షల 39 వేల 550 ల స్టాంపింగ్ ఫీజు వసూలైందని చెప్పారు. గత ఏడాది ఇదే సమయానికి రూ. 5 కోట్ల 76 లక్షల 65 వేల 365 ల వసూళ్ళు జరిగాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రూ. 22 లక్షల 28 వేల 285 లు, విజయనగరం జిల్లాలో రూ .24 లక్షల 02 వేల 685 లు, విశాఖపట్నం జిల్లాలో రూ. 90 లక్షల 37 వేల 828 లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ. 78 లక్షల 86 వేల 695 లు, పశ్చిమగోదావరి జిల్లాలో రూ.42 లక్షల 93 వేల 060 లు, కృష్ణాజిల్లాలో రూ. 85 లక్షల 08 వేల 271 లు, గుంటూరు జిల్లాలో రూ. 58 లక్షల 40 వేల 895 లు, ప్రకాశం జిల్లాలో రూ.37 లక్షల 34 వేల 760 లు, నెల్లూరు జిల్లాలో రూ.42 లక్షల 88 వేల 480 లు, చిత్తూరు జిల్లాలో రూ.58 లక్షల 03 వేల 475 లు, వైఎస్సార్ కడప జిల్లాలో రూ.29 లక్షల 86 వేల 925 లు, అనంతపురం జిల్లాలో రూ.46 లక్షల 57 వేల 095 లు, కర్నూలు జిల్లాలో రూ.42 లక్షల 71 వేల 096 ల స్టాంపింగ్ ఫీజులు వసూలయ్యాయన్నారు.
అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐదు నెలల కాలంలో రూ. 3 కోట్ల 69 లక్షల 62 వేల 500 ల కాంపౌండింగ్ ఫీజులు వసూలయ్యాయని తెలిపారు. గత ఏడాది ఇదే కాలంలో రూ. 3 కోట్ల 61 లక్షల 91 వేల 600 లు వసూలయ్యాయని చెప్పారు. కాగా శ్రీకాకుళం జిల్లాలో రూ.21 లక్షల 91 వేల 700 లు, విజయనగరం జిల్లాలో రూ. 17 లక్షల 64 వేల 100 లు, విశాఖపట్నం జిల్లాలో రూ.48 లక్షల 98 వేల 200 లు, తూర్పుగోదావరి జిల్లాలో రూ.33 లక్షల 70 వేల 000 లు, పశ్చిమగోదావరి జిల్లాలో రూ. 25 లక్షల 67 వేల 500 లు, కృష్ణాజిల్లాలో రూ.38 లక్షల 57 వేల 300 లు, గుంటూరు జిల్లాలో రూ.37 లక్షల 57 వేల 400 లు, ప్రకాశం జిల్లాలో రూ.26 లక్షల 37 వేల 000 లు, నెల్లూరు జిల్లాలో రూ. 17 లక్షల 70 వేల 000 లు, చిత్తూరు జిల్లాలో రూ. 25 లక్షల 31 వేల 500 లు, వైఎస్సార్ కడప జిల్లాలో రూ. 24 లక్షల 31 వేల 000 లు, అనంతపురం జిల్లాలో రూ. 25 లక్షల 77 వేల 800 లు, కర్నూలు జిల్లాలో రూ. 22 లక్షల 17 వేల 000 ల కాంపౌండింగ్ ఫీజులు వసూలయ్యాయని మంత్రి కొడాలి నాని తెలిపారు.

LEAVE A RESPONSE