Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి అక్రమ కేసులకు భయపడేది లేదు ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం

మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య

ఓటమి భయంతోనే సీఎం జగన్ వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసులతో రాజకీయ కక్ష సాధిస్తున్నారు.స్కిల్ డెవలప్ మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్, పైబర్ గ్రిడ్ అంటూ ఒక దాని తర్వాత మరో కేసులు పెడుతున్నారు.టీడీపీ హయాంలో 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ సీఎం జగన్ సహా వైసీపీ నేతలంతా నోరు నెత్తూ బాదుకున్నారు, కానీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా 60 రూపాయిల అవినీతిని కూడా నిరూపించలేకపోయారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్ మెంట్ ఏర్పాటు చేశారు, కానీ జగన్ రాజకీయకక్షతోనే దాన్ని నిర్వీర్యం చేసి యువతకు ఉపాధి లేకుండా లేకుండా చేశారు.

ఈ కేసు రిమాండ్ రిపోర్ట్ పేజీ నెం-16లో ఒక పేరాలో రూ.145.37 కోట్లని,మరో పేరాలో రూ.279 కోట్లు అని,పేజీ నెం-21 లో అసలు ఎటుపోయిందో,ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందో తెలియదని సీఐడీ చెప్పింది. ఈ సొమ్మంతా డబ్బు ఎంతో తెలియకుండా, ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందో తేలకుండా, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని ఎలా అంటారు?

పైబర్ పై ఖర్చు రూ. 280 కోట్లు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ. 900 కోట్లు నిజం.రాష్ట్ర ప్రజలకు నెలకు రూ.149కే ఇంటికి ఇంటర్నెట్,ఫోన్, టీవీ ఛానళ్ల సౌకర్యం కల్పించాం.ఫైబర్ నెట్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.

అండర్ గ్రౌండ్ కేబుల్స్ కు అంత ఖర్చు వద్దని కరెంట్ పోల్స్ ను వినియోగించుకుని ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేయటం జరిగింది. రూ.5 వేల కోట్ల ఖర్చును రూ.330కోట్లకు చంద్రబాబు నాయుడు గారు తగ్గించారు.చివరకు రూ.328 కోట్లకే టెండర్ ఖరారు చేశారు.

ఇందులో ఎలాంటి అవినీతి జరగకున్నా.. కేవలం రాజకీయ కక్ష, దురాలోచనతోనే అక్రమ కేసులు మోపుతున్నారు.వ్యవస్థల్ని మ్యానేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు, దళితుడిని చంపి డోర్ డెలివరి చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇప్పించి బయటకు తెచ్చారు.వైసీపీ పాలనలో నేరస్తులు బయట తిరుగుతున్నారు, నిరపరాధులు చెరసాలలో ఉంటున్నారు. అరాచక పాలనకు కాలం చెల్లింది.జగన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన అక్రమ కేసుల్లో ఒక్కటి నిరూపించలేరు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు, ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటాం.

LEAVE A RESPONSE