Suryaa.co.in

Telangana

టీచర్లను తప్పు పట్టడం లేదు

– ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులు లేక సమస్య
– ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అంటేనే నామోషిగా గా ఫీల్ అవుతున్నారు
– శాసన మండలిలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హైద‌రాబాద్‌: విద్యా వ్యవస్థలో మార్పులు తేవడానికి గతంలో విజ్ఞప్తి చేశా. ఫీల్డ్ లో చూస్తే బాధ కలుగుతుంది. స్కూల్ లకి 10 ఎకరాల స్థలం ఉంది. తరగతి గదులు ఉండి మంచి జీతాలు ఇచ్చి , ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి , ఉపాధ్యాయులు చదువు చెప్పగలిగే సామర్థ్యం ఉండి విద్యార్థులు లేక వాటి వాతావరణం మార్చడానికి పెద్దల సభ నుండి ఒక మార్పు తీసుకురావాలి.

ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులు లేక సమస్య. మా దగ్గర చిగురు మామిడి మండలం నవాబ్ పేట అనే గ్రామంలో 50 మంది విద్యార్థులకు 10 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. టీచర్లను తప్పు పట్టడం లేదు. ఆ గ్రామానికి 10 స్కూల్ బస్సులు వస్తున్నాయి. మొన్న బస్వాపూర్ గ్రామంలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభానికి వెళ్లాం అక్కడ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అంటేనే నామోషిగా గా ఫీల్ అవుతున్నారు గతంలో కరీంనగర్ లో 4 హై స్కూల్స్ ఉండే. ఇప్పుడు స్కూల్స్ పెరిగాయి. ఉపాధ్యాయులు పెరిగారు. కానీ విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు.

నిన్న రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి చెప్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య ,ఉపాధ్యాయుల సంఖ్య.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయుల సంఖ్య ఎంత ఆరా తీయండి అని. ఉపాధ్యాయ నియామకాలు పెరిగిన,జీతాలు పెరిగిన విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు. విద్యా వ్యవస్థ పట్ల మంచి సిస్టం రావాలి.ఎడ్యుకేషన్ సిస్టం అక్షరాస్యత ఇతర రాష్ట్రాల్లో కేరళ బాగుంది అక్కడి మనుషుల్లో మార్పు వచ్చింది.

ఎడ్యుకేషన్ సిస్టం బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది. ప్రైమరీ ఎడ్యుకేషన్ విద్యార్థులకు బేస్ . విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళీ కొన్ని సూచనలు చేశారు. మండలానికి ఒక స్కూల్ బస్ సిస్టం ప్లాన్ చేస్తున్నారు. విద్యార్థి నాయకుడిగా ఉన్న వ్యవస్థ మారాలి. రాబోయే కాలంలో విద్య వ్యవస్థకు సంబంధించి అందరి ఆమోదయోగ్యమైన ఎడ్యుకేషన్ సిస్టం తీసుకురావాలి. బీజేపీ బిఆర్ఎస్ రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎడ్యుకేషన్ సిస్టం మీద ఒక రోల్‌మోడల్ తీసుకోవాలి. చిన్న పిల్లల చదువుకు రాజకీయాలకు సంబంధం లేదు.

LEAVE A RESPONSE