-మరి అప్పుల్లో ఉన్న రాష్ట్రం లక్షా ఎనభై వేల రూపాయలు ఇవ్వగలదా?
జగనన్న కాలనీల ఇళ్లు పేరుతో 30 లక్షలు ఇళ్లు కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది .అందుకు కేంద్రం ప్రతి లబ్దిదారునికి 1,80,000 రూపాయలను ఉచితంగా మంజూరు చేసి ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 1 రూపాయి కూడా లేదు.కానీ వాళ్ల ఎమ్మెల్యేలు ,మంత్రులు, ముఖ్యమంత్రి ఏమి చెబుతారంటే.. మేము లక్షల విలువచేసే స్థలం ఉచితంగా ఇచ్చాం కదా అంటున్నారు. ఇందులో ఎవరికి ఉచితం ఎవరికీ ఆదాయం .
మీ ఎమ్మెల్యేలకు జగనన్న కాలనీ ఇంటి పేరుతో కోట్లు దోచుకున్నారు .ప్రతి గ్రామంలో ప్రభుత్వ స్థలం లేని దగ్గర ప్రతి ఎకరా మీద లక్షల రూపాయలు దోచుకున్నారు. ఆ స్థలాలు ఏమైనా నివాసానికి యోగ్యమైన స్థలాల అంటే అది కాదు. మీ ఎమ్మెల్యేలకు డబ్బులు ఎక్కడ ఎక్కువ వస్తాయనుకుంటే ఆ స్థలాలను ఎంపిక చేసి ప్రభుత్వ డబ్బుతో ఎక్కువ రేట్లకు కొనిపించి రైతు కేమో తక్కువ ఇచ్చి, ఎక్కువ డబ్బులు మీ ఎమ్మెల్యేలు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే మీ నవరత్నాలలో ఎన్నికల హామీలో భాగమైన జగనన్న ఇళ్లు బలవంతంగానైనా లబ్ధిదారుల చేత కట్టించి, ఎవరూ చేయని పని నేను 30 లక్షలు ఇల్లు కట్టాను అని రాబోవు ఎన్నికలలో ప్రచారం చేసుకోవడానికి మీ ఆరాటం.
వివరాల్లోకి వెళితే మీరు ఇచ్చిన డిజైన్ ప్రకారం ఇల్లు కట్టుకోవాలంటే ఈ రోజున కూలి రేట్లు కానివ్వండి, ఇంటికి ఉపయోగించే సామాన్లు వస్తువులు విపరీతమైన రేట్లు పెరిగిపోయయి . ఏవిధంగా కట్టుకుంటారు? ఎలా సాధ్యం అవుతుంది? .వారికి ఆర్థిక స్థితి ఉండి ఉంటే, కొంతమంది కాకపోయినా కొంత మంది అయినా కట్టుకునేవారు. ఎవరికైనా ఇల్లు ఉచితంగా వస్తుందంటే చేదు కాదు.
కానీ వారికి ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో ఇల్లు గడవడమే కష్టంగా ఉంటే ఇల్లు కట్టుకో, కట్టుకో అని జాయింట్ కలెక్టర్ ,దగ్గర నుండి హౌసింగ్ కార్పొరేషన్ డి ఈ, ఆర్ డి ఒ, తహసిల్దార్ ,ఆర్ ఐ, వి ఆర్ ఓ వాలెంటర్ ఒకరోకరు పై అధికారుల నుండి కింద అధికారుల వరకు మీలో మీరు ఒత్తిడి చేసుకొని వారిని ఒత్తిడి చేస్తే ఉపయోగం ఏమిటి ? ఎవరూ తట్టుకోలేరు.
గతంలో నేను ప్రత్యక్షంగా 180 ఇళ్లు నెల్లూరు అర్బన్ లో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని ఉన్నవారికి, పొజిషన్ సర్టిఫికెట్ ఇప్పించి కట్టించాను. అప్పుడు మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుండి 1,50,000 రాష్ట్ర ప్రభుత్వం కుడా ఉచితంగా 1,50,000 ఇచ్చేవారు కాబట్టి ఆ ఇళ్లు పూర్తయ్యాయి .ఆ మూడు లక్షల తో పాటుగా ఇంకొంత వేసుకొని ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్నారు .కానీ ఈ రోజున ఆ పరిస్థితి కాదు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు.
కేంద్రం ఇచ్చే డబ్బు తోటే ఇల్లు పూర్తి కావాలంటే సాధ్యం కాదు వాస్తవాలు ఆలోచించకుండా ఇబ్బంది పెడితే ఒత్తిడి తప్ప ఏమి కాదు మీ అనాలోచిత ,ఆచరణ సాధ్యం కాని పని ,వారిని చేయమంటే ఒత్తిడి చేస్తే వారు ఏ విధంగా చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి .
మీ స్థాయి లో మీకు శక్తి లేకుండా మీ కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తే ఇల్లు కట్టుకో, కట్టుకో అంటే కట్టుకొగలరా ! మరి వీరు కూడా అంతే కదా ! నిజంగా ఇల్లు పూర్తి కావాలని ఉంటే దానికి మీరు మీ వంతుగా కూడా లక్షా ఎనభై వేల రూపాయలు ఇస్తే అప్పుడు మీరు అనుకున్న 30 లక్షల ఇళ్లు పూర్తవుతాయి.
కానీ దానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉంది. అది రాష్ట్రం వల్ల కూడా కాదు దీనివల్ల కేంద్రం ఇచ్చిన 1, 80,000 రూపాయలు కూడా ఉపయోగపడకుండా పోతుంది.
– కరణం భాస్కర్ ,
బిజెపి ,
7386128877 .