Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబుపై రాయి దాడిని ఖండిస్తున్నాం

– బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకోవాలి
-జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ముందస్తు అరెస్ట్ లు, పరదాలు కప్పుతున్నారు
– ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పర్యటనను పోలీసులు పట్టించుకోరా?
-గతంలో దాడిని బావ వ్యక్తీకరణ స్వేచ్చన్నారు… ఇప్పుడు పూళ్లల్లో రాయి ఉందంటున్నారు
-పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నందిగామ, జగయ్యపేట నియోజకవర్గాల్లో బాదుడే బాధుడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ముందస్తుగానే పోలీసులకు తెలియజేయడం జరిగింది. ఒక వీఐపీ ముందుగానే వస్తున్నప్పుడు పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాని నందిగామ పోలీసులు ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. అదే జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే ముందస్తు అరెస్ట్ లు చేస్తారు, పరదాలు కడతారు. నిన్న చంద్రబాబు పర్యటనంతా జనమయం చూసి ఉక్రోశం, ఆక్రోశం, అభద్రతా భావం వైసీపీ నాయకుల్లో వచ్చింది కాబట్టే రాళ్ల దాడి జరిగింది. అదృష్టవశాత్తు చీఫ్ సీఎస్ఓ కు మధుకు రాయి తగిలింది. అదే రాయి చంద్రబాబుకి తగిలి ఉంటే ఏంటి పరిస్థితి? పోలీస్ వ్యవస్థ పని తీరు ఇదేనా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? పోలీసులు ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఒక న్యాయం, అధికారపక్షం నాయకుడికి మరో న్యాయమా? జడప్లస్, ఎన్ఎస్ పరిరక్షణలో ఉన్న వ్యక్తిపై దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? చంద్రబాబు పర్యటనకు ప్రజాస్పందన చూసిన స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు భయపడిపోయారు.

26 క్రైమోర్ మైన్స్ పెడితేనే భయపడని మనిషి బోడి నాలుగు రాళ్లు వేస్తే భయపడతారా? మీ ఉడత ఊపులకు చంద్రబాబు నాయుడు భయపడరని తెలియజేస్తున్నాను. రాయి వేయడం పక్కా ప్లాన్. రాజశేఖర్ రెడ్డి బొమ్మ దగ్గర ఉన్నది పరిమి కిషోర్, బెజవాడ కార్తీక్ లు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు కాదా? వాళ్ల చేతిలో కర్రలు కనపడటం లేదా? అక్కడ బ్యాగ్ లో రాళ్లు తీసుకువచ్చారు. దీనికి పోలీసులు ఏం సమాధానం చెబుతారు? పక్కనే పోలీస్ ఉన్నా పట్టించుకోలేదు. నందిగామలో చంద్రబాబు పర్యటనలో పోలీసులు ఫన్నీ వే ఆఫ్ ఫంక్షనింగ్. విజయవాడ సీపీ మాట్లాడుతూ పూలల్లో రాయి వచ్చిందని చెప్పడం హాస్యాస్యపదం. చెన్నుపాటి గాంధీని కొడిచినప్పుడు ఆయన చేయి కన్నుకు తగలడం వలన దెబ్బతగిలిందని పోలీసులు చెప్పడం విడ్డూరం. నేడు చెన్నుపాటి గాంధీకి కన్ను లేదని పోలీసులు తీసుకోవాలి. ఈ ఘనత పోలీస్ శాఖ కు దక్కింది. హత్యాయత్నం చేసిన వైసీపీ నాయకులను వదిలేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రి, 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయమైన వ్యక్తిని రాయితో కొట్టాలనుకుంటే పోలీసులు చోధ్యం చూస్తున్నారు.

చంద్రబాబు పర్యటనలో పాల్గొన్న వైసీపీ నాయకులను ఎందుకు అరెస్ట్ చేయలేదు. కోర్టులు చివాట్లు పెట్టినా ఎందుకు పోలీసుల్లో చలనం కలగటం లేదు? చట్టబద్దంగా చేయాలన్న ఆలోచన మీకెందుకు రావడం లేదు? పోలీసులు చేస్తున్న తప్పులకు మూల్యం చెల్లించుకోబోతున్నారు? దాడి చేసిన వాళ్లకు పోలీసులు మద్దతు పలుకుతారా? దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నాం. 307 కేసు రిజిస్టర్ చేసి కిషోర్, కార్తీలను అరెస్ట్ చేయాలి? ఎవరి ప్రోద్బలంతో చేశారో రుజువు చేయాలి. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీనా, లేదంటే తాడేపల్లి ప్యాలెస్ నా రుజువు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. రాయి విసిరితే భావ స్వేచ్ఛ కాదు? రెండు సెంట్ల స్థలానికి అయ్యన్న పాత్రుడు ఎన్ని ఇబ్బందులు పెట్టారు. రూ.43వేల కోట్ల జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారని సీబీఐ చెప్పింది, విజయసాయిరెడ్డి వైజాగ్ ను దోచుకుంటున్నారు, రుషికొండను బోడిగుండు చేశారు. ఇలాంటి వ్యక్తులు నేడు పాలకులై ప్రజలను పీక్కుతుంటున్నారు. హత్యలు, దాడులు, దోపిడీలతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు.

LEAVE A RESPONSE