పేదల బియ్యాన్ని పందికొక్కుల్లా తినేస్తున్న జగన్ అండ్ కో

-జగన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో రూ.7వేల కోట్ల బియ్యం తినేశారు
-ఇంటింటికీ రేషన్ వాహనాలతో.. పేదోడి బియ్యాన్ని దోచేస్తున్న జగన్ గ్యాంగ్
-5.66 లక్షల టన్నుల బియ్యం లెక్కల్లేవని కేంద్ర మంత్రి చెప్పినా సిగ్గులేదా
-నవరత్నాల పేరుతో పేద వాడి నవ నాడుల్నీ పిండేస్తూ జేబులు నింపుకుంటున్నారు
-మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్

ఏ పేద వాడు కూడా ఆకలితో ఉండకూడదనే మహోన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన రేషన్ పంపిణీ వ్యవస్థ ఏర్పాటైంది. అన్న నందమూరి తారకరామారావు దేశంలోనే తొలిసారిగా రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి పేదల ఆకలి తీర్చేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అలాంటి మహత్తరమైన పథకాన్ని నాశనం చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుంది.

టీడీపీ హయాంలో రాష్ట్రంలో 1.47 కోట్ల తెల్ల రేషన్ కార్డులుంటే.. వాటిని 1.44 కోట్లకు కుదించారు. వారికి సుమారు 30వేల రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ జరిగేది. ఎక్కడా ఎలాంటి అక్రమాలు లేకుండా రేషన్ డీలర్లు సరుకుల్ని పంపిణీ చేస్తే.. ఇంటింటికీ రేషన్ పేరుతో జగన్ రెడ్డి ఆ వ్యవస్థ మొత్తాన్ని భ్రష్టుపట్టించారు. మూడేళ్ల క్రితం వరకు 95 శాతం వరకు రేషన్ తీసుకుంటే.. దాన్ని 80 శాతం మించకుండా జగన్ రెడ్డి నాశనం చేశారు. రేషన్ పంపిణీ వ్యవస్థపై జగన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమైంది.

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రూ.2వేల కోట్ల విలువైన సుమారు 5.66 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పట్టాయని కేంద్ర మంత్రి పార్లమెంటులోనే చెప్పారు. ఇప్పటి వరకు మట్టి, ఇసుక, మద్యం మాఫియాలతో ప్రజల్ని దోచుకుతిన్న జగన్ రెడ్డి.. ఇప్పుడు ప్రజల ఆకలి తీర్చే బియ్యాన్నీ అడ్డగోలుగా బొక్కేస్తున్నారు. జగన్ రెడ్డి మాఫియా పేదల బియ్యాన్నీ బొక్కేస్తోంది.

పేదల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. పేదల తిండిని కూడా లాగేసుకోవడం సిగ్గుచేటు. వేల కోట్ల వ్యయంతో ఇంటింటికీ వాహనాలు అన్నారు. వారు వీధి చివరకు బియ్యం తెచ్చి అక్కడకు వచ్చేవారికే బియ్యం ఇస్తామంటున్నారు. అదే సమయంలో సుమారు 30 వేల మంది రేషన్ డీలర్ల పొట్టకొట్టారు. గతంలో డీలర్లు బియ్యం అమ్మకాలతో వచ్చే కమిషన్ తో కొంత ఉపాధి పొందేవారు. వారికి ఇప్పుడు ఆ ఉపాధిని దూరం చేశారు. పేదలకు పంపిణీ కూడా జరగడం లేదు.

రేషన్ పంపిణీ వాహనాలతో ఆర్భాటం చేస్తూ.. పేదలకు పంచాల్సిన బియ్యాన్ని వారితోనే కొనుగోలు చేయించి పేదల పొట్ట కొడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ నుండి బియ్యం ఎగుమతులు ఏటా 18 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండగా.. ఇప్పుడు పంటల సాగు తగ్గిందని చెబుతూనే.. ఏకంగా బియ్యం ఎగుమతులు 35 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగాయి. ఇది ఎలా సాధ్యమైందో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అది కూడా విజయసాయి రెడ్డి అల్లుడికి చెందిన అరబిందో కంపెనీకి కాకినాడ పోర్టును అప్పగించిన తర్వాతనే ఈ ఎగుమతులు ఏకబిగిన పెరగడం, అందులోనూ ఆ బియ్యం ఎక్కువగా ఆఫ్రికా దేశాలు, ఐవరీ కోస్ట్ వంటి దేశాలకే ఎక్కువగా ఎగుమతి అవుతుండడంపై ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయి. వాటిని జగన్ రెడ్డి తీర్చాలి. పేదల రేషన్ బియ్యమే ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. కాకినాడ పోర్టును మాఫియాకు కేంద్రంగా మార్చుకుని స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ దందా మొత్తం నడుస్తోందనడం నిజం కాదా? ఈ మాఫియా మొత్తాన్ని వెనకుండి నడిపిస్తున్నది జగన్ రెడ్డి కాదా?

పేదల తిండిని కూడా బొక్కేస్తున్న జగన్ రెడ్డి పేదల ముఖ్యమంత్రా? గతంలో ఎన్నడూ లేని విధంగా.. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా ఘటనలు ఇప్పుడే ఎందుకు ఎక్కువగా పట్టుబడుతున్నాయి? పేదల పొట్ట కొడుతూ.. ఆ బియ్యాన్ని అమ్ముకోవడం వాస్తవం కాదా? గుంటూరు జిల్లా నర్సరావుపేట, రొంపిచర్లలో గోపిరెడ్డి అనుచరులు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడడం వాస్తవం కాదా? నర్సరావుపేటలో వైసీపీ నేతల భియ్యం కుంభకోణాన్ని టీడీపీ నేతలు బట్టబయలు చేయడం నిజం కాదా? నిన్నటికి నిన్న తంబళ్ల పల్లెలో కోట్లాది విలువైన రేషన్ సరుకులు అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడడం నిజం కాదా? ఇది పేదల నోట్లో మట్టి కొట్టడం కాదా జగన్ రెడ్డీ?

నవరత్నాల పేరు చెబుతూ.. పేదల నవ నాడుల్నీ నాశనం చేసేస్తున్నారు. పేదల పొట్ట కొట్టే ఏ ఒక్కరూ బాగుపడింది లేదనే విషయాన్ని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి. బియ్యం అక్రమ మాఫియాకు ప్రభుత్వ పెద్దలు అండగా నిలుస్తుండడం నిజం కాదా? కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తుంటే.. ఆ బియ్యాన్ని కూడా పేదలకు పంచకుండా చేతులెత్తేసిన జగన్ రెడ్డి.. పేదలకు అండగా ఉన్నానని చెప్పడం సిగ్గుచేటు. కేంద్ర ఇచ్చే బియ్యం తప్ప ఇంకెవరికీ ఇవ్వలేమని మంత్రి అధికారికంగా ప్రకటించారంటే అంతకంటే సిగ్గుమరొకటి ఉంటుందా? కరోనా బాధితుల సొమ్మును మింగేసిన జగన్ రెడ్డి.. పేదల బియ్యాన్ని దోచేయడంలో ఆశ్చర్యం ఏముంది? పేదల తిండిని కూడా దొబ్బితినే దుర్మార్గ పాలనకు ప్రజలు తరిమేసేయడం ఖాయం.

2019 ముందు వరకు బియ్యం, కందిపప్పు, ఉప్పు, చిరు ధాన్యాలు సహా సుమారు 9 రకాల సరుకులు అందేవి. కానీ.. చంద్రబాబు నాయుడు ఏమీ ఇవ్వడం లేదన్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బియ్యం తప్ప ఇంకేమీ ఇవ్వడం లేదన్నది వాస్తవం కాదా? పేదలకు పండగ కానుకలు కూడా అందించి అండగా నిలిచాం. కిలో కందిపప్పు రూ.40 చొప్పున రెండు కిలోలు ఇస్తే.. రూ.67 చేశారు. అది కూడా గత ఏడాదిగా నిలిపేశారు. పంచధార ధరనూ పెంచారు. ఎంతో ఆర్భాటంగా ఉద్దరించేస్తున్నామని పేపర్లలో యాడ్స్ ఇచ్చుకోవడం తప్ప పేదలకు జగన్ రెడ్డి చేసిందేమిటి? సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరుతో తెచ్చిన రూ.43వేల కోట్లు ఏం చేశారో సమాధానం చెప్పాలి. ఆ డబ్బు మొత్తం ఏమైందో సమాధానం చెప్పాలి.

బహిరంగ మార్కెట్లో ధరలు నియంత్రించే పరిస్థితి లేదు. రేషన్ షాపుల్లో సరుకులు ఇచ్చిందీ లేదు. ఇదేనా పేదలకు అండగా నిలవడమంటే? పేదల బియ్యాన్ని బొక్కేసి రూ.7వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన జగన్ రెడ్డి ప్రజల్ని ఉద్దరిస్తుందని చెప్పుకోవడం సిగ్గుచేటు. జగన్ రెడ్డీ.. ప్రజా కంటక విధానాలు మానుకోకుంటే ప్రజలు తిరగబడడం ఖాయమని గుర్తుంచుకోవాలి.

పోలీసు వ్యవస్థ తమ నెత్తిపై ఉండే సూక్తిని జగన్ రెడ్డి పాలనలో పూర్తిగా మరిచిపోయారు. గత డీజీపీ వైసీపీ నేతల దాడుల్ని సమర్ధించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ అంటూ దాడుల్ని, దౌర్జన్యాలను వెనకేసుకు వచ్చారు. ప్రస్తుత డీజీపీ అంతకు మించిన ఘనుడు. పూలతో పాటు రాయి వచ్చిందని చెప్పి సమర్ధించడం చూస్తుంటే.. జగన్ రెడ్డికి ఎంత దారుణంగా వెనకేసుకొస్తున్నారో అర్ధం కావడం లేదు. ప్రతిపక్ష నాయకుడు, జాతీయ స్థాయి నాయకుడిపై దాడి జరిగితే.. డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు అతని అసమర్ధతకు నిదర్శనం. చట్ట ప్రకారం పని చేస్తే.. ఆ చట్టమే రక్షిస్తుందనే విషయాన్ని డీజీపీ గుర్తుంచుకోవాలి.

Leave a Reply