Suryaa.co.in

Andhra Pradesh

రైతుల పాలిటి చీడ వైసిపి ప్రభుత్వం

– నష్టపోయిన రైతుకు పంట పరిహారం ఇవ్వాలి
– తీవ్రంగా నష్టపోయిన మిరప రైతు
– ఎకరాకు 75 వేల పరిహారం ఇవ్వాలి
– రైతుకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం
నరసరావుపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు జీవి ఆంజనేయులు
వినుకొండ: నకిలీ విత్తనాలు, తామర పురుగు, బొబ్బరతో మిరప రైతు పూర్తిగా నష్టపోయారని ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రైతుని ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని నరసరావుపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. బొల్లపల్లి మండలం రేమిడి చర్ల గ్రామం లో వైరస్ తో పూర్తిగా దెబ్బతిన్న మిరప పంటలను గురువారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ మిరప లో తామర పురుగు, బొబ్బర ఆశించి పూర్తిగా దెబ్బ తిన్నట్లు తెలిపారు. గత మూడు నెలలుగా లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగుచేస్తున్న మిరప పంట ఎకరానికి సుమారు లక్ష వరకు రైతు నష్టపోయారని అన్నారు. పంట నష్టం వాటిలి రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోయి తీవ్ర ఆందోళన చెందుతుంటే పంట నష్టాన్ని గుర్తించి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం దుర్మార్గమన్నారు.
2019 నుండి నేటి వరకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలయ్యారని అన్నారు. మూడు నెలలుగా కొనసాగుతున్న మిరప పంట సాగును, రైతులు పడుతున్న ఇబ్బందులను సంబంధిత అధికారులు పర్యవేక్షించి గుర్తుంచుకోవడం శోచనీయమన్నారు. ఎకరాకి 70 వేలనుండి లక్ష రూపాయలు పెట్టుబడులు పెట్టి మంచి దిగుబడి వస్తుందని ఆశించిన సమయంలో మహమ్మారిలా పంటను తామర పురుగులు ఆశించి రైతులు నష్టపోయారని అన్నారు. జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన బొల్లాపల్లి మండలం కేవలం బోర్లపై ఆధారపడి పంట సాగు చేయడం జరుగుతుందన్నారు.
వేల ఎకరాల్లో రైతుల మిరప పంట సాగు చేస్తే మూడు నెలల కష్టాన్ని అకాల వర్షాలు వైరస్ ,తామర పురుగు తినేసి రైతులను నట్టేట ముంచిందన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం రైతులకు పట్టిన చీడ అని ఆయన విమర్శించారు. రైతులు, కౌలు రైతులు ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోతే పరిహారం చెల్లించాలని ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రైతులు నష్టాల్లో, అప్పుల్లో కూరుకుపోయారని అన్నారు.
వ్యాప్తంగా మిరప రైతులు సర్వనాశనం అయ్యారని, ప్రభుత్వం స్పందించి పంట భీమా, పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలు, పురుగుమందుల విక్రయాలు అరికట్టి నష్టపోయిన ప్రతి రైతు, కౌలు రైతులు ని గుర్తించి పరిహారం చెల్లించాలని జీవి ఆయన డిమాండ్ చేశారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పంట సాగు చేసి వైరస్ తో దెబ్బతిన్న మిరప రైతులను ఆదుకో పోతే టిడిపి రైతు కు అండగా నిలిచి పరిహారం చెల్లించే వరకు పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో.. బొల్లాపల్లి మండల పార్టీ అధ్యక్షుడు జరపాల గోవిందు నాయక్,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెమ్మసాని నాగేశ్వరరావు, దాసరి కోటేశ్వరరావు,ఆళ్ళ మన్నయ్య,తిప్పిశెట్టి వెంకటేశ్వర్లు,బారెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, హనుమానాయక్, నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు నర్రా కిషోర్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE