జగన్ తన తప్పు తెలుసుకొని అమరావతే ఏకైక రాజధాని అని ప్రకటించాలి

• అమరావతి రైతులు నిర్వహిస్తున్న తిరుపతి బహిరంగసభతో ఈ ప్రభుత్వం కళ్లు బైర్లుకమ్మాలి.
• రాష్ట్రంలోని ప్రజలంతా తిరుపతిలో అమరావతి రైతలు నిర్వహిస్తున్న సభకుభారీగా తరలివచ్చి, ముఖ్యమంత్రి అహంకారాన్ని నేలకు దించాలి.
– మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్
జగన్మోహన్ రెడ్డి రాజధానికి సంబంధించి తీసుకున్న నిర్ణయంతో 13జిల్లాలు పూర్తిగా నష్టపోయాయని, ఆయన నిర్ణయం అనాలోచితమైనది కాబట్టే, దానికి సంబంధించి ప్రభు త్వం వేసిన, వేస్తున్న అడుగులనుకూడా న్యాయస్థానాలు తప్పుపట్టాయని, అమరావతి రైతులు, మహిళలు 750రోజులకు పైగాచేసినఉద్యమం, వారిపాదయాత్ర విజయవంతం కావడంకూడా దానిఫలితమేనని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు స్పష్టంచేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో, మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ తోకలిసి విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు వారి మాటల్లోనే ….‎
తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహిస్తున్న బహిరంగ సభ ప్రాంతీయవిద్వేషాలు రెచ్చగొట్టే రాష్ట్రద్రోహులకు గుణపాఠం కావాలని, అమరావతి ఉద్యమవిజయోత్సవసభతోనైనా ముఖ్య మంత్రి కళ్లుతెరవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. రాజధానిప్రకటన ఎలా జరిగింది, దానిస్వరూపం కోసం 29వేలమందిరైతులు, సుమారు 34,323ఎకరాలు ఇవ్వడంజరిగింది. భూసేకరణలో భాగంగా ఆనాటి చంద్రబాబునాయుడి ప్రభుత్వం రూపాయికూడా ఖర్చుపెట్టలేదు. 13 జిల్లా లమధ్యలో అమరావతి ఉండేలా, 13జిల్లాలు సమగ్రంగాఅభివృద్ధిచెందేలా గతప్రభుత్వాధినేత అయిన చంద్రబాబుగారు, అసెంబ్లీలోస్పష్టమైన ప్రకటనచేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా ఆప్రాంతంలో ఐటీకంపెనీలను, లులూగ్రూప్, మిలీనియం టవర్స్, విశాఖ-చెన్నై కారిడార్ కు రూపకల్పనచేయడం జరిగింది.
రాయలసీమలో ఉద్యానవనపంటలను వృద్ధి చేయడంతోపాటు, సాగు, తాగునీటిప్రాజెక్ట్ లు, కియా, హెచ్ సీఎల్, హీరో వంటి పరిశ్రమ లను, కర్నూల్లో మెగాసీడ్ పార్క్, సోలార్ పార్క్, ఏర్పాటుచేయడంజరిగింది. పునర్విభజన చట్టంప్రకారం రాష్ట్రానికి వచ్చిన కేంద్రప్రభుత్వ సంస్థలనుకూడా అన్నిప్రాంతాల్లో ఉండేలా నాటి ప్రభుత్వం చర్యలుతీసుకుంది. తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీ, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, అనంతపురంలో సెంట్రల్ యూనివర్శిటీ, కర్నూల్లో ఉర్దూవిశ్వవిద్యాల యం, మంగళగిరిలో ఎయిమ్స్ వంటివి ఏర్పాటుచేయడం జరిగింది.
చంద్రబాబునాయుడు 5ఏళ్లపాలనలో రాష్ట్రంసమగ్రంగా అభివృద్ధిచెందేలా ప్రణాళికలు వేస్తే, జగన్ అండ్ కో కావాలనే దుష్ప్రచారం చేశారు. దానిలోభాగమే అమరావతి నిర్మాణానికి రూ.లక్షకోట్లు ఖర్చ వుతుందని చెప్పడం. అమరావతి పూర్తయితే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు అభివృద్ధి చెందేలా టీడీపీప్రభుత్వం వ్యూహరచనచేసింది. ఆప్రణాళికలో భాగంగానే టీడీపీప్రభుత్వంలో అమరావతిలో రూ.10వేలకోట్ల అభివృద్ధి పనులు జరిగాయి.
హైకోర్ట్, సచివాలయం, శాసనస భ, శాసనమండలితో పాటు, ఉద్యోగులకుక్వార్టర్స్ నిర్మాణం, రాజధానిలోని పేదలకు గృహాల నిర్మాణం జరిగింది. వాటిలో పేదలు, అధికారులతోపాటు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వసతిగృహా ల నిర్మాణం 70శాతంవరకు పూర్తయింది. రాజధానిలోజరిగిన అభివృధ్ధి ప్రజలకు తెలియకూడదన్న అక్కసుతోనే జగన్మోహన్ రెడ్డి అమరావతి లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అమరావతి కాదు కమ్మరావతి అని విష ప్రచారం చేశారు.
అమరావతిగా ఎంపికచేసినప్రాంతం 15ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో ఉంది. కృష్ణానదికి ఇటువైపు తాడికొండఉంటే, అటువైపు నందిగామ ఉంది. అలానే అమరావతి ప్రాంతంలో ఎస్సీ,ఎస్టీలు 32శాతముంటే, బీసీలు14శాతం, కమ్మవారు18శాతం, రెడ్లు23శాతం, కాపులు 9శాతం, మైనారిటీలు 3శాతం,ఇతరులుమిగిలినశాతంలో ఉన్నారు. అలాంటిప్రాంతాన్ని కేవలం కమ్మ కులానికే చెందిందని జగన్మోహన్ రెడ్డి, ఆయనదోపిడీ ముఠా విషప్రచారం చేసింది.
పునర్విభజన చట్టంప్రకారం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా మెజారిటీశాతం మంది రాజధానిగా అమరావతే ఉండాలన్నారు. అమరావతి ప్రాంతం రాజధానికి అనువైనది కాదని శివరామకృష్ణన్ కమిటీ ఎక్కడా చెప్పలే దు. ఇంతజరిగాక, ఆనాటి ప్రతిపక్ష నేత హోదాలోజగన్మోహన్ రెడ్డికూడా అమరావతి రాజధాని గాఉండటం తనకుసమ్మతమేనని చెప్పారు. అప్పుడు అలాఅన్నవ్యక్తే,ఇప్పుడు తనస్వార్థం కోసం రాష్ట్రంలోప్రాంతీయవిద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. అధికారంలోకి వచ్చాక రాజధాని ప్రాంతంలో 4వేలఎకరాలవరకు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నాడు. కోర్టుల్లో దాన్ని నిరూపిం చలేక బొక్కబోర్లా పడ్డాడు.
రాజధాని ప్రకటనకు ముందు కేవలం 128ఎకరాలకు సంబంధించి మాత్రమే క్రయవిక్రయాలుజరిగాయని నిర్ధారణకావడం, రాజధాని భూముల్లోఎలాంటి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్ట్, సుప్రీంకోర్టులో తేలడంతో జగన్మోహన్ రెడ్డి గొంతులో పచ్చి వెలక్కాయపడింది. తానుచేసిన తప్పుడుఆరోపణలు వీగిపోవడంతో, చివరకు మూడు రాజధానులను తెరపైకితెచ్చాడు. రాష్ట్రంలో ఒక్కఅభివృద్ధిచేయని వ్యక్తి మూడురాజధానులు నిర్మిస్తాడా అని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. రెండున్నరేళ్లు పూర్తయినాకూడా ఈ ముఖ్యమంత్రి గతప్రభుత్వంలో రాజధానిలో70శాతంవరకుజరిగిన నిర్మాణాలను పూర్తిచేయలేకపోయాడు.
జగన్ రెడ్డి చేసిన మూడురాజధానులప్రకటనే అమరావతి నాశనానికి హేతువైంది. అది మొదలు రాజధానిప్రాంతంలోని రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం, నేడు మహాపాద యాత్రగా ముగిసింది. రైతులు, మహిళలపాదయాత్రను అడ్డుకోవడానికి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అడుగడుగునా

ప్రయత్నించారు. కానీ ప్రజల్లో తిరుగుబాటురావడం, వారు రైతులపాదయాత్రకు బ్రహ్మరథం పట్టడంతో పాలకుల కుట్రలు, కుతంత్రాలుసాగలేదు. పాదయాత్రకు వెల్లువలా ప్రజాభిమానం పోటెత్తడంతో దిక్కుతోచనిస్థితిలోకి ఈప్రభుత్వం చేరింది.
ఏంచేయాలో పాలుపోని ఈప్రభుత్వం, అమరావతి రైతులమహాసభపై విషప్రచారంచేస్తోంది. ఈ ముఖ్యమంత్రి ఇప్పటికైనా రాజధానిపై విషంచిమ్మడం మానేసి, అమరావతే ఏకైకరాజధా ని అని ప్రకటిస్తే, ఆయనకు, ఆయనప్రభుత్వానికి మంచిది. నేడు జరగబోయే అమరావతి రైతులబహిరంగ సభకు రాష్ట్రం నలుమూలలనుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
రాష్ట్రమంతా జై అమరావతి అంటుంటే, ముఖ్యమంత్రి ఒక్కడే మూడుముక్కలాట ఆడుతున్నాడు
న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో 45రోజులపాటు పాదయాత్రసాగించిన రైతులు, మహిళలకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాం. అమరావతి రైతుల బహిరంగ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని చేతులుజోడించి వేడుకుంటున్నాం. ఎందుకంటే సభలో రైతులు, ప్రజలుచేసే జై అమరావతి నినాదాలతో, ఈప్రభుత్వం కళ్లుబైర్లు కమ్మాలి..ముఖ్యమంత్రి అహంకారం నేలకుదిగాలి. రాజధానికి వ్యతిరేకంగా ఆయన సాగిస్తున్న వికృతఆలోచనలు పటాపంచలుకావాలి.
జగన్మోహన్ రెడ్డి, ఆయనప్రభుత్వం అసత్యాలనే పునాదులపైనే అమరావతి విధ్వంసానికి పాల్పడింది. అమరావతిని పూర్తిచేయడం చేతగాక, దానిఫలాలను రాష్ట్రానికి పంచడం తెలియకనే జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మాణానికి రూ.లక్షకోట్లవరకు అవుతుందని నమ్మబలికాడు. అసెంబ్లీసాక్షిగా తాను అమరావతికి అనుకూలమని చెప్పిన వ్యక్తి, అధికారంలోకివచ్చాక ఎదురుపెట్టుబడులుపెట్టి మూడు రాజధానులపేరుతో కృత్రిమఉద్యమాలు నడిపిస్తున్నాడు.
ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు..ఇకపై చూడబోముకూడా. అలాంటి ఉద్యమమే ఇప్పుడు మేథావులముసుగులో రాయసీమహక్కులపేరుతో అక్కడ జరుగుతున్నది. అమరావతిప్రాంతంలో కూడా తనపార్టీఎంపీ ఆధ్వర్యంలో 300రోజులపాటు ఈ ముఖ్యమంత్రి మూడురాజధానులకు మద్ధతుగా కృత్రిమఉద్యమం నడిపించాడు. చంద్రబాబునాయుడి హయాంలో అమరావతిలో ఇటుకకూడా పెట్టకపోతే, కళ్లముందు కనిపిస్తున్న రూ.10వేలకోట్ల నిర్మాణాలు ఎక్కడివో ముఖ్యమంత్రి చెప్పాలి.
టీడీపీప్రభుత్వం కేవలం సంవత్సరంన్నరలోనే రాజధానిలో రోడ్లు, భారీభవనాలతోపాటు, రూ.10వేలకోట్ల విలువైన నిర్మాణాలు పూర్తిచేసింది. రాజధానిప్రాంతంలోని పేదలకోసం 5వేలకు పైగా గృహాలను కూడా నిర్మించారు. జగన్ అధికారంలోకివచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా, ఇప్పటికీ చంద్రబాబునాయుడి హయాంలో నిర్మితమైన భవనాల్లోనే ఉంటున్నాడు. ఈ ప్రభుత్వంలో భారీవర్షాలుకురుస్తున్నా, ఎక్కడైనా ఏనాడైనా అమరావతిలోని భవనాల్లో చుక్కనీరువచ్చిందా?
ఈప్రభుత్వంవచ్చాక ఒక్క రైతైనా గతప్రభుత్వం తననుంచి బలవం తంగా భూమి లాక్కుందని ఫిర్యాదుచేశాడా? 750రోజులు అమరావతి ఉద్యమంజరిగినా ఈప్రభుత్వం రైతులగోడు పట్టించుకోలేదు. న్యాయస్థానం నుంచి దేవస్థానం యాత్రచేపడితే వారికి నిలువనీడలేకుండా, రోడ్లపై భోజనంచేసేలా చేశారు. ఆఖరికి మహిళలకు మరుగుదొడ్లు అందుబాటులో లేకుండా చేశాడు. అమరావతి ప్రాంతం బడుగు బలహీనవర్గాలు, షెడ్యూల్ కులాలప్రాతినిధ్యంలోనిదే. అమరావతి ఉన్న తాడికొండలో ఎస్సీ, ఎస్టీలుంటే, మంగళగిరిలో బడుగు,బలహీనవర్గాలు ఎక్కువగా ఉంటే, తాడికొండ నియోజకవర్గాన్ని ఆనుకొని ఉన్న గుంటూరు-1లో మైనార్టీలు అధికంగా ఉన్నారు.
అసత్యప్రచారంలో సిద్ధహస్తుడైన జగన్ రెడ్డి, అమరావతి ప్రాంతం కమ్మవారిదని కావాలనే విషప్రచారంచేశాడు. అమరావతిప్రాంతంలో కమ్మవారికంటే కాస్తో,కూస్తో రెడ్డివర్గమే అధికంగా ఉంది. ఆ విషయం తెలిసీ కూడా జగన్ రెడ్డి అమరావతిపై కులపేరుతో విషంకక్కాడు. అంతటితో ఆగకుండా అమరావతిభూములు నిర్మాణానికి పనికిరావని ఐఐటీ మద్రాస్ వంటిప్రతిష్టాత్మక పేరుతో దుష్ప్రచారంచేశాడు. నిర్మాణానికి అమరావతి భూములు పనికిరాక పోతే, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఇన్నాళ్లనుంచీ బావిలోకప్పలా ఎలాఉంటున్నాడు?
ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో చంద్రబాబునాయుడి బంధువులు, టీడీపీప్రభుత్వంలోని పెద్దలు అమరావతిప్రాంతంలో భూములుకొన్నారనిచెప్పి జగన్ రెడ్డి భంగపడ్డాడు. రాజధాని ప్రకటించాక, భూసేకరణ జరిగాక, ఆప్రాంతంలో నిర్మాణాలు జరక్కుండా జగన్మోహన్ రెడ్డే తనపార్టీవారితోకోర్టుల్లో, గ్రీన్ ట్రైబ్యునల్ లో కేసులువేయించాడు. దానిఫలితంగానే రాజధానిప్రాంతంలో నిర్మాణాల్లో జరిగినజాప్యం. అయినాకూడా ఆఖరి సంవత్సరంలోనే చంద్రబాబునాయుడు పట్టుదలతో అమరావతిప్రాంతంలో రూ.10వేలకోట్ల విలువైన నిర్మాణాలు పూర్తిచేయించారు.
రాజధాని నిర్మాణానికి రూ.లక్షకోట్లు అవసరంలేదని జగన్ కూతెలుసు. అదిపూర్తిచేస్తే, పేరుప్రఖ్యాతులు చంద్రబాబుకి వెళతాయన్నదే ఈ ముఖ్యమంత్రి భయమంతా. మంత్రి బొత్ససత్యనారాయణ అమరావతిప్రాంతంలో పర్యటించి మరీ గతప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుందా అనిరైతులను ప్రశ్నించాడు.
ఒక్కరైతుకూడా చంద్రబాబునాయుడి ప్రభుత్వం తమనుంచి బలవంతంగా భూమిలాక్కుంద ని ఈప్రభుత్వానికి ఫిర్యాదుచేయలేదు. రాష్ట్రప్రజలంతా అమరావతికి మద్ధతు పలుకు తుంటే, ముఖ్యమంత్రి ఒక్కడే మూడుముక్కలాట ఆడుతున్నాడు. రాష్ట్రవిభజనజరిగి 7న్నర సంవత్సరాలైనా, రాజధానిఏదో చెప్పుకోలేనిదుస్థితిని ముఖ్యమంత్రి కల్పించాడు. ముఖ్యమంత్రికి, అధికారులకు పాలనచేతగాకనే కోర్టులముందు వారిఅజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు.

Leave a Reply