Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ప్రభుత్వంపై ఛార్జిషీట్ వేస్తాం

-ప్రజాపోరు ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడదాం
-పోలింగ్ బూత్ స్థాయిలో మరింత బలోపేతం చేయాలి
-కేంద్ర పార్టీ ఇచ్చిన సూచనలను అందరూ పాటించాలి
-ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు పై ఒక ఛార్జిషీటు తయారు‌ చేయాలి
-బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

వైసీపీ ప్రభుత్వంపై ఛార్జిషీటు వేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రధానమైన అంశంగా మనం‌ భావిస్తున్నామని, మోడీ నాయకత్వంలో ఈ రాష్ట్రానికి అనేక విధాలుగా సాయం అందించామని, వేల కోట్లు నిధులు ఇచ్చి అభివృద్ధి కి సహకరించామని చెప్పారు. మనకి రాజకీయాలు ప్రధానం‌ కాదని, అభివృద్ధే ముఖ్యమని, రూ. 8లక్షల 16వేల కోట్లతో సబ్ కా సాత్ సబ్ కా‌వికాస్ పేరుతో అభివృద్ధి ని ప్రోత్సహించామని స్పష్టం చేశారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది. జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి , బూత్ స్వశక్తి కరణ్ అభియాన్ ఇంఛార్జి అరవింద్ మీనన్, జాతీయ కార్యదర్శి, ఎపి సహా సునీల్ దేవదర్, జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్, రాష్ట్ర పదాధికారులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ఇంచార్జ్ లు పాల్గొని పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.

ఈ సమావేశం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రారంభోపన్యాసం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ ఆంధ్రా రాజకీయాల్లో కీలకమైన తరుణంలో మన సమావేశం జరుగుతుందన్నారు. ఈ రాష్ట్రంలో అవినీతి రాజకీయాలకు కేంద్రంగా మారిందని, ఇంత ఘోరమైన పరిస్థితి ఏ రాష్ట్రం లో లేదన్నారు. ఇసుక, మైనింగ్, మద్యం అన్నింటిలొ అవినీతే అని, ప్రజల వనరులను దోచుకుని దాచుకుంటున్నారని విమర్శించారు. ఆ డబ్బుతో రాజకీయం‌ చేసి ఓట్లు కొంటున్నారు..కొనాలని‌‌ చూస్తున్నారని, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ లో‌పదో తరగతి వాళ్లతో ఓట్లు‌వేయించారని, ఇంత దిగజారి రాజకీయం‌ చేయడం దుర్మార్గం అని ఆరోపించారు. మన పార్టీ నాయకులు బూత్ లెవల్ లో చాలా కష్టపడి పని చేశారని, మోడీ తొమ్మిదేళ్ల‌ పాలనతో దేశ ప్రజలు, ప్రపంచ దేశాలు మెచ్చే విధంగా చేశారన్నారు.

ఈరోజు రాష్ట్రం లో వచ్చిన ఫలితాలు అంతి‌మం కాదని, గతంలో 1996లో ఎపిలో 16శాతం వస్తే, 1998లో 35శాతం తో రెండు ఎంపి సీట్లు సాధించామని, ఆ తరువాత ఒక్క శాతానికి పడిపోయినా, మళ్లీ‌14శాతానికి పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 శాతం ఓట్లు వచ్చాయన్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పై తీవ్రమైన వ్యతిరేకత ఉందని, రెండో ప్రాధాన్యత ఓటు ను బిజెపి కి‌ వేశారంటే మోడీ మీద అభిమానం ఉందని, ఈ పరిస్థితి ని అంచనా‌వేసి ఈ‌ ప్రభుత్వ వ్యతిరేక విధానాల‌పై ప్రజల్లోకి‌ వెళ్లాలని పిలుపునిచ్చారు.

పోలింగ్ బూత్ స్థాయిలో మరింత బలోపేతం చేయాలని, కేంద్ర పార్టీ ఇచ్చిన సూచనలను అందరూ పాటించాలని, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు పై ఒక ఛార్జిషీటు తయారు‌చేయాలని, జగన్ వైఫల్యాలను, మోడీ‌ అభివృద్ధి ని ప్రజలకు వివరించే అజెండాతో ప్రజా పోరాటంతో ముందుకు వెళ్లాలని కోరారు. ప్రజాపోరు ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడదామని పిలుపునిచ్చారు. రెవిన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు ఈర్ల శ్రీ రామమూర్తి పార్టీ లో చేరినట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఎమ్మెల్సీ లు పివిఎన్ మాధవ్, వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వేటుకూరి సూర్య నారాయణ రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, బిట్ర శివన్నారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE