Suryaa.co.in

Telangana

అడవి పుత్రులను ఇబ్బంది పెడితే ఉద్యమం తప్పదు

-అడవి మనది.. అడవిపై హక్కులు మనవి.. మనల్ని ఆపేది ఎవరు?
-నిజాం బ్రిటిష్ పరిపాలనలో కూడా గిరిజనులపై ఇంత నియంతృత్వం లేదు
-అడవిలో ఉన్న గిరిజన బిడ్డలు ఎట్లా వండుకోవాలి ఏమి తినాలి
-సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
-పాదయాత్ర జైనురు మండలం జామ్నే నుంచి ప్రారంభమై రాసి మెట్ట, బుసిమెట్ట, బూసి మెట్ట క్యాంపు మీదుగా కెరీమెరి గ్రామానికి సుమారు 18 కిలోమీటర్లు కొనసాగిన పాదయాత్ర

-పాదయాత్రలో తమ బాధలను గోడును వెళ్ళబోసుకున్న గిరిజనులు

ఏ ఊర్లో చూసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాలే, పింఛన్లు ఇవ్వడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదు. నాసిరకమైన రేషన్ బియ్యం తినడం వల్ల కడుపునొప్పి వస్తున్నదని చెప్పారు. అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్ కూడా రావడం లేదు వైద్యం అందడం లేదు. పీజీ చదివిన సర్కార్ నౌకరి దొరకడం లేదు. ప్రతి గ్రామంలో అటవీ అధికారులతో తలెత్తుతున్న ఇబ్బందులు, అడవిలోకి రానివ్వడం లేదని ఇలా ఎన్నో సమస్యలను పాదయాత్రకి ఎదురొచ్చి జనాలు భట్టి దృష్టికి తీసుకువచ్చారు

భట్టి విక్రమార్క కామెంట్స్
అడవి గిరిజనుల ఇల్లు లాంటి అడవిని గిరిజనులు నష్టం చేయరు కాపాడుకుంటారు. గిరిజనులను బయటికి పంపించి కలప మాఫియాకు అడవి అప్పగించాలని చూస్తున్న ప్రభుత్వం.అడవిలో మమేకమై బతుకుతున్న అడవి పుత్రులను ఇబ్బంది పెడితే ఉద్యమం తప్పదు.తెలంగాణ తెచ్చుకుందే ఆత్మగౌరవం కోసం అడవి నుంచి వెళ్లగొట్టి గిరిజనుల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోం. గిరిజనుల బతుకులు మార్చడానికి కాంగ్రెస్ హయాంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చాం.ధనిక రాష్ట్రంలో ఐటీడీఏలను నిర్వీర్యం చేసి గిరిజనుల బతుకులను అల్లకల్లోలం చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం.నిజాం బ్రిటిష్ పరిపాలనలో కూడా గిరిజనులపై ఇంత నియంతృత్వం లేదు.జల్ జంగిల్ జమీన్ అడవి బిడ్డల కోసం పోరాటం చేసిన కొమురం భీమ్ అరెస్టు చేసిన బూసిమెట్ట క్యాంపు ప్రాంతాన్ని ఈరోజు పాదయాత్రలో సందర్శించాను.

జైనూర్ మండలం జామ్నే గ్రామం నుంచి కిరిమెరి వెళ్తుండగా మార్గమధ్యంలోని బూసిమెట్ట క్యాంపు (ఆన్ ది సమాజం తెగ ) గిరిజనులు ఎదురొచ్చి వారి గూడెంలోకి తీసుకువెళ్లారు.ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి వల్ల తమకు కొత్త పాసుపుస్తకాలు ఇవ్వలేదని పాత పాస్ పుస్తకాలను చూపిస్తూ భట్టికి ఫిర్యాదు చేశారు.తమకున్న భూమిని ధరణీల్లో ఎక్కించకుండా, ఆన్లైన్ చేయకుండా చేస్తే మేము చచ్చినట్టే కదా బతికి ఉన్న మమ్మల్ని ప్రభుత్వం సచ్చినోళ్ల కింద చూస్తున్నది.

రైతుబంధు మొదటి సారీ వచ్చింది తర్వాత రావట్లేదు.గిరిజనులకు ఇచ్చిన లాభాలు పట్టా భూములను రెవెన్యూ అధికారులు ధరణిలో ఆన్లైన్ చేయకపోవడంతో రుణమాఫీ కాకపోవడంతో పాటు రైతుబంధు రైతు బీమా గిరిజనులు కోల్పోతున్నారు.నాసిరకం రేషన్ బియ్యం ఇస్తున్నందున తినలేక పోతున్నామని బియ్యం తీసుకువచ్చి తనకు చూపించారని వెల్లడించారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచగా మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పొయ్యిలో పెట్టుకోవడానికి అడవి నుంచి కట్టిన తెచ్చుకుని ఇవ్వట్లేదు.అడవిలో ఉన్న గిరిజన బిడ్డలు ఎట్లా వండుకోవాలి ఏమి తినాలి.అడవిలో హక్కులు లేకుండా చేస్తున్నారు.బతికుండగానే చంపిన్రు కదా..

బూసి మెట్ట క్యాంప్ (ఆన్ ది సమాజం గిరిజన తెగ)జై నూరు నుంచి కెరిమెరీ గ్రామానికి వెళ్తున్న భట్టి విక్రమార్క పాదయాత్రకు ఎదురొచ్చి గ్రామస్తులు గూడెంలోకి తీసుకువెళ్లారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూమి పట్టాలు ఇచ్చింది.. కేసీఆర్ ప్రభుత్వం కొత్త పట్టా పాస్ బుక్కులు ఇవ్వడం లేదు. ధరణి ఆన్ లైన్ లో మా భూములు వివరాలు ఎక్కించడం లేదు. ధరణిలో పేరు లేకపోతే బతికి ఉన్నా చచ్చినట్టే కదా అంటూ గిరిజనుల వద్ద ఉన్న పాత పాస్ పుస్తకాలు తీసుకువచ్చి బట్టి విక్రమార్కకు చూపిస్తూ గోడును వెళ్ళబోసుకున్నారు. అటవీ అధికారులు మమ్మల్ని అడవిలోకి పోనివ్వడం లేదు.. కాయలు, పండ్లు, తేనే, కుంకుడు కాయలు కూడా తెచ్చుకొనివ్వడం లేదు. తమ భూములు ధరణిలో ఎక్కనందున రైతుబంధు రైతు బీమా రావటం లేదని వాపోయారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ ఇచ్చిన రైతు రుణాల మాఫీ చేస్తాం అన్నారు కానీ.. మాకు మాఫి కాలేదు.బ్యాంక్ వాళ్లు లోన్లు కట్టాలని మమ్మల్ని వేధిస్తున్నారు. ఇండ్లు లేవు.. తినడానికి కూడా రేషన్ బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు.ఆ బియ్యం కూడా దొడ్డు బియ్యం మాత్రమే.. మీరే చూడండి.. ఈ బియ్యంతో అన్నం ఎలా తినాలి.మాకు కనీసం బాత్ రూమ్ లు కూడా ఇవ్వలేదు. మహిళలకు చాలా ఇబ్బందిగా ఉంది.కాంగ్రెస్ ప్రభుత్వం 9 రకాల వస్తువులు ఇచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.కరెంట్ కూడా తీసేస్తున్నారు. మేము ఎలా బతకాలి.మమ్మల్ని అడవిలోకి పోనివ్వడం లేదు. వారి ఆవేదన విన్న భట్టి విక్రమార్క.. అడవి మనది.. అడవిపై హక్కులు మనవి.. మనల్ని ఆపేది ఎవ్వరు.. మీ హక్కులను కాపాడతాను.. మీ వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది. వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమే.. అప్పుడు మీకందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.

వంట చేసుకుని వచ్చి బట్టీతో కలిసి భోజనం చేసిన గిరిజన మహిళలు
బూసి మెట్ట క్యాంపు గిరిజన మహిళలు భట్టి విక్రమార్క కొరకు వంట చేసుకుని తీసుకువచ్చి ఆయనతో కలిసి భోజనం చేశారు
జొన్న రొట్టెలు, తోటకూర పెసరపప్పు, ఉల్లిపాయ కారంతో చేసిన వంటకాలను తీసుకువచ్చి భట్టి విక్రమార్కకు వడ్డించి ఆయనతో పాటు కలిసి భుజించారు. గిరిజన మహిళలు తీసుకువచ్చిన ఆహార పదార్థాల పేరు వాడి తయారీ విధానం గురించి వారిని అడిగి తెలుసుకుని చాలా బాగున్నాయంటూ వారిని ప్రశంసించారు.

LEAVE A RESPONSE