– మంత్రి శ్రీధర్ బాబు
– ఉప్పల్ లో రూ. 42 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
హైదరాబాద్ : ఉప్పల్ తో పాటు రాష్ట్రమంతా అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి ఎన్ని నిధులైన అందిస్తాం. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయంగా మరింత గుర్తింపు తో పాటు గత పాలకులు పట్టించుకోని కాలుష్య నివారణ, స్వచ్ఛమైన గాలి, వాతావరణం కు తోడు అభివృద్ధి వేగవంతం చేసేందుకే మూసి ప్రక్షాళన కు ప్రభుత్వం స్వీకారం చుట్టింది. పేదరిక నిర్మూలన ప్రజల విద్య వైద్యం కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం.
ప్రపంచంలోని పారిశ్రామిక దేశాలకు దీటుగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుని యువతకు సాంకేతిక శిక్షణ ఇచ్చి వారి అభివృద్ధితో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని ముడి వేస్తున్నాం.
గోదావరి, కృష్ణ జలాలతో రిజర్వాయర్లు ఏర్పాటు చేసి జంట నగరాల దాహార్తి తీరుస్తాం. పిడిఆర్ కార్యక్రమం కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసింది. పిడిఆర్ ఇంకా ప్రారంభం కాలేదు. వారికి సంబంధించిన అవినీతి బయటపడుతుందని కేటీఆర్ విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు. నిధుల కోరత వెంటాడుతున్నా, నిధులు లేకున్నా గ్రేటర్ హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రతిపక్షాల నిర్మాణాత్మకమైన సూచనలు, సహకారాన్ని తీసుకుంటాం.
మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులు: మహేందర్ రెడ్డి
ఉప్పల్ నియోజకవర్గంలో 42 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి శ్రీధర్ బాబు,, నియర్ విజయలక్ష్మి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నాతో కలిసి ప్రారంభించడం సంతోషం. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఉప్పల్ అభివృద్ధికి అడిగిన అన్ని నిధులు ఇచ్చాం. ఉప్పల్ పరిసరాల్లోని జిహెచ్ఎంసి ప్రాంతాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను పార్టీలకు అతీతంగా అందిస్తాం. ఉప్పల్ తో పాటు పొరుగునే ఉన్న ఎల్బీనగర్, ఇటు మేడ్చల్ జిల్లాలోని ఇతర ప్రాంతాలకు అవసరమైన అభివృద్ధి నిధులను సీఎం రేవంత్ రెడ్డి తో చర్చించి, శ్రీధర్ బాబు సహకారంతో అందించేందుకు కృషి చేస్తా.