– బనకచర్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు
– నిర్మాణాన్ని అడ్డుకునేందుకు న్యాయపోరాటం చేస్తాం
– ఆల్మట్టి ఎత్తు పెంచడాన్నీ అంగీకరించం
– బి.ఆర్.ఎస్ నేతలు అపోహలు సృష్టిస్తున్నారు
-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటాం. బనకచర్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. బి.ఆర్.ఎస్ నేతలు అపోహలు సృష్టిస్తున్నారు. నమ్మశక్యం కా ని మాటలతో ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు బి.ఆర్.ఎస్ కుట్రలకు తెర లేపింది. బనకచర్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. నిర్మాణాన్ని అడ్డుకునేందుకు న్యాయపోరాటం చేస్తాం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం బనకచర్ల నిర్మాణాన్ని గట్టిగా ప్రతిఘటిస్తుంది. కేంద్ర జలశక్తి మంత్రికి స్వయంగా,లేఖల ద్వారా తెలంగాణ రాష్ట్ర అభ్యంతరాలను తెలిపాం. ఆల్మట్టి ఎత్తు పెంచడాన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, మహారాష్ట్రలో బి.జే.పి ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వాలు ఉన్నా నదీ జలాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు.
కృష్ణా,గోదావరి నదీ జలాశయాలలో తెలంగాణా హక్కులను రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షిస్తుంది. కృష్ణా జలాశయాలలో 70 శాతం వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తోంది. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ తో పాటు సుప్రీంకోర్టు లో న్యాయపోరాటం చేస్తున్నాం. కృష్ణా జలశాయలలో తెలంగాణ వాటా సాదించేందుకు గాను ట్రిబ్యునల్ కు మంత్రి హోదాలో స్వయంగా హాజరు అయ్యాను. మంత్రి హోదాలో ట్రిబ్యునల్ కు హాజరైన మొట్ట మొదటి మంత్రిని.
కృష్ణా జలాశయాలలో తెలంగాణా హక్కులను కాపాడే కమిట్మెంట్ తోటే ట్రిబ్యునల్ కు హాజరైన. కృష్ణా జలాశయాలలో ఆంద్రప్రదేశ్ కు 811 టి.యం.సిలు తెలంగాణాకు 299 టి.యం.సి లంటూ ఒప్పుకున్న చరిత్ర బి.ఆర్.ఎస్ పాలకులది. బి.ఆర్.ఎస్ పాలనలో నీటిపారుదల రంగంపై కోటి 80 వేల కోట్లు ఖర్చు పెట్టినా సాధించింది ఏమీ లేదు.కాళేశ్వరంతో సాగులోకి వచ్చింది నామమాత్రపు ఆయకట్టే. పాలమూరు రంగారెడ్డి,సీతారామలతో ఓన గురిన ప్రయోజనం ఏమి లేదు. పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తాం.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎస్.ఎల్.బి.సి ని పూర్తి చేస్తాం. బి.ఆర్.ఎస్ పాలనలో కల్వకుర్తి, దేవాదుల,నెట్టేంపాడు, కోయిలసాగర్,భీమా,ఎస్.ఎల్.బి.సి లు నిర్లక్ష్యానికి గురయ్యాయి. డిండి ప్రాజెక్టు కు బి.ఆర్.ఎస్ పాలకులు నీటి కేటాయింపులు చేయలేక పోయారు. డిండి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. సూర్యాపేట జిల్లాకు దేవాదుల నీరు పారించాలి అన్నదే ప్రభుత్వ సంకల్పం.
ధాన్యం దిగుబడిలో తెలంగాణా సంచలన రికార్డ్ నమోదు చేసుకుంది. తెలంగాణా ఏర్పడ్డాక పదేళ్ల పాటు రాని దిగుబడి ఈ రెండేళ్లలో రికార్డ్ స్థాయిలో ఉత్పత్తి అయ్యింది. కృష్ణా,గోదావరి జలాశయాల వినియోగంలో ప్రభుత్వం అనుసరించిన విధానాల తోటే ఇంతటి దిగుబడి సాధ్యం అయ్యింది.