– కుల గణన సర్వే రిపోర్ట్ తప్పుల తడక
– 21లక్షల మంది బిసిలను తక్కువ చేసి చూపించారు
– లేని అగ్రకులాల జనాభా ను చూపించడం పెద్ద కుట్ర
– 5 న బీసీ సంఘాలు,మేధావులతో భవిష్యత్ కార్యాచరణ పై నిర్ణయం
– బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: కుల గణన సర్వే రిపోర్ట్ తప్పుల తడకగా ఉంది.బీసీ లెక్కలను తక్కువ చేసి.. అగ్ర కులాల జనాభా ను ఎక్కువ చేసి చూపించడం. ఇది బీసీ లను అవమానించడమే. 2014 లో బీసీ లు 51 శాతం ఉంటే 2014 లో 46 శాతం ఉంటాడా?
కుల గణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బిసిలను మోసం చేసింది. ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వం. 2014 నుంచి 2024 వరకు 21లక్షల మంది బిసిలను తక్కువ చేసి చూపించారు. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల ను కాపాడడం కోసం లేని అగ్రకులాల జనాభా ను చూపించడం పెద్ద కుట్ర. బిసిలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించక తప్పదు.
బీసీ సబ్ కమిటీ కి బట్టి ,పొన్నం ఉండాలి కానీ ఉత్తమ్ ఎలా ఉంటాడు సమగ్ర కుల సర్వే రిపోర్ట్ ను ప్రజల ముందు బయట పెట్టాలి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన సర్వే రిపోర్ట్ లను చెత్తబుట్టలో వేస్తాం. ఈ నెల 5 న బీసీ సంఘాలు,మేధావులతో భవిష్యత్ కార్యాచరణ పై నిర్ణయం తీసుకుంటాం. మళ్ళీ బీహార్ తరహా లో రెండో సారి కుల గణన సర్వే చేయాలి. బీసీ కుల గణన సర్వే పై ప్రభుత్వం పున సమీక్ష చేయాలి. అలా చేయకుంటే కాంగ్రెస్ కు ఇవే చివరి ఎన్నికలు.