బీసీల రక్షణ కోసం బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం

Spread the love

-జగన్ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసింది
-మళ్లీ చంద్రన్న భీమా పథకాన్ని తీసుకొస్తాం
-టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రత్యేక కార్యాచరణ
-పెట్టుబడి వ్యయం తగ్గించేలా చర్యలు తీసుకుంటాం
-మహిళల్ని చంపుతుంటే గన్ కంటే ముందు వస్తా అన్న జగన్ ఎక్కడ?
-నాయి బ్రాహ్మణులను శాసన మండలికి పంపబోయేది టిడిపి
-ఆర్ఆర్ఆర్ లో జగన్ నటించి ఉంటే బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చేది
-ప్రత్యేక హోదా గురించి అడగడు, కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం అడగడు
-జగన్ కి సౌండ్ ఎక్కువ పని తక్కువ
-కదిరి నియోజకవర్గం మోటుకుపల్లి పీవీఆర్ గ్రాండ్ ఫంక్షన్ హల్ లో బీసీ సామాజికవర్గం -ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్

వడ్డెరలు ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా రాళ్ళు కొట్టుకొని జీవిస్తున్నారు. మాకు వైసిపి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదు. డిగ్రీ చదివిన పిల్లలుకు కూడా ఉద్యోగాలు రావడం లేదు.
బీసీలకు గతంలో ఉన్న ఆదరణ పథకాన్ని వైసిపి ప్రభుత్వం రద్దు చేసింది. బిసి రైతులను వైసిపి ప్రభుత్వం మోసం చేసింది. మాకు ఎటువంటి సహాయం అందడం లేదు. గతంలో టిడిపి ప్రభుత్వం సబ్సిడీలో ట్రాక్టర్లు కూడా అందించింది. ఇప్పుడు అన్ని పథకాలు ఆపేసారు. పట్ర కులస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నాం. కనీసం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఇక్కడ ఎమ్మెల్యే సహకరించడం లేదు. మా స్థలాన్ని కూడా వైసిపి వాళ్ళు కబ్జా చేశారు. బిసిల పై వేధింపులు, హత్యలు పెరిగిపోయాయి. వైసీపీ ప్రభుత్వం కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి సహాయం అందించడం లేదు. బీసీ కళ్యాణ మండపాలు నిర్మాణానికి ఎటువంటి సహాయం అందడం లేదు. గౌడ కులస్తులకు టిడిపి ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అందేవి. వాటిని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందడం లేదు. కనీసం కల్లు అమ్ముకోవడానికి కూడా అనుమతి లేదంటూ వేధిస్తున్నారు. జగన్ ప్రభుత్వంబీసీ నిధులు పక్కదారి పట్టిస్తుంది. జగన్ పాలన వచ్చిన తరువాత భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నాం. బిసి విద్యార్ధులు ఉన్నత విద్య చదువు కోవడానికి ప్రవేశ పెట్టిన విదేశీ విద్య పథకాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. –కదిరి నియోజకవర్గం బీసీలు

లోకేష్ మాట్లాడుతూ…
వడ్డెరలకి ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంది టిడిపి. కానీ జగన్ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసింది. వడ్డెరలకి క్వారీలు, మైన్లు కేటాయించింది టిడిపి. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత వడ్డెరలను ఇచ్చిన క్వారీలు, మైన్లు బలవంతంగా లాక్కున్నారు. టిడిపి హయాంలో వడ్డెరలను ఆదుకోవడానికి పెట్టిన భీమా పథకాన్ని నిర్వీర్యం చేసింది వైసిపి ప్రభుత్వం. మళ్లీ చంద్రన్న భీమా పథకాన్ని తీసుకొస్తాం.టిడిపి ప్రభుత్వం స్థానికంగా ఉద్యోగాలు కల్పించడానికి కియా, జాకీ లాంటి అనేక సంస్థలు తీసుకొస్తే జగన్ ప్రభుత్వం కంపెనీలను తన్ని పక్క రాష్ట్రాలకు తరిమేసింది. దేశంలో బీసీ కుల వృత్తులను ఆదుకోవడానికి ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టింది టిడిపి.1000 కోట్లు ఖర్చు చేసి ఆదరణ పథకంలో భాగంగా పనిముట్లు అందజేసాం.ఆదరణ 2 పథకంలో భాగంగా కొన్న పనిముట్లు కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వకుండా మూలన పడేసింది. టిడిపి గెలిచిన వెంటెనే ఆదరణ పథకాన్ని పునరొద్దరిస్తాం. రైతులను ఆదుకోవడానికి టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. పెట్టుబడి వ్యయం తగ్గించేలా చర్యలు తీసుకుంటాం. కదిరి లో అన్ని మండలాల్లో బీసీ కమ్యూనిటీ హాల్స్ కట్టడానికి మండలానికి 25 లక్షలు కేటాయించింది టిడిపి ప్రభుత్వం. ఇప్పుడు అవన్నీ ఆపేసారు. టిడిపి ప్రభుత్వం గెలిచిన ఏడాది లో కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తాం.

దిశ చట్టం ఒక మోసం. అసలు చట్టమే లేదు. ఒక్క కేసులో కూడా 21 రోజుల్లో శిక్ష పడలేదు. వైసీపీ పాలనలో మహిళల పై విపరీతంగా దాడులు పెరిగిపోయాయి. మహిళల్ని చంపుతుంటే గన్ కంటే ముందు వస్తా అన్న జగన్ ఎక్కడ?బీసీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. బీసీల పై 25 వేల అక్రమ కేసులు పెట్టారు. బీసీల రక్షణ కోసం బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. న్యాయపోరాటానికి సాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. బీసీల్లో ఉన్న ఉపకులాల వారీగా కమ్యూనిటీ భవనాలు, నిధులు టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే కేటాయిస్తాం. నాయి బ్రాహ్మణులను, రజకులను శాసనమండలికి పంపుతా అని మోసం చేసింది జగన్. టిడిపి రజకులను శాసన మండలికి పంపింది. నాయి బ్రాహ్మణులను శాసన మండలికి పంపబోయేది టిడిపి. బిసిల్లో ఉన్న అనేక ఉప కులాల డిమాండ్ల పరిష్కారం కోసం సత్యపాల్ కమిటీ వేసింది టిడిపి. ఆ రిపోర్ట్ చెత్త బుట్టలో పడేసింది వైసిపి ప్రభుత్వం.కల్లు గీత కార్మికులను ఆదుకుంది టిడిపి.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 10 లక్షల భీమా అందిస్తాం.మద్యం షాపుల్లో కొంత శాతం రిజర్వేషన్ కల్లు గీత కార్మికులకు కేటాయించాలని డిమాండ్ ఉంది. ఖచ్చితంగా మీ డిమాండ్ నెరవేరుస్తాం.

బిసిల్లో అన్ని ఉపకులాలకి అవకాశాలు ఇవ్వడానికి టిడిపి లో సాధికార సమితిలు ఏర్పాటు చేశాం. ఉపకులాల వారీగా నాయకత్వాన్ని అభివృద్ది చేస్తున్నాం.ఇసుక, సిమెంట్ ధరలు విపరీతంగా పెంచి భవన నిర్మాణ కార్మికుల పొట్ట పై కొట్టింది జగన్ ప్రభుత్వం.ఆఖరికి భవన నిర్మాణ కార్మికుల బోర్డు డబ్బు కూడా జగన్ పక్కదారి పట్టించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నిధులు ఇతర అవసరాలకి వాడుకునే అవకాశం లేకుండా చట్టం తీసుకొస్తాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన బోర్డు నిధులు కేవలం మీ సంక్షేమం కోసం మాత్రమే వినియోగిస్తాం.నియోజకవర్గ స్థాయిలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి బీసీలకు ప్రత్యేకంగా భూములు కేటాయించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం.

జగన్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేశారు. విదేశీ విద్య పథకాన్ని రద్దు చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేశారు.బీసీలకు రాజకీయ, ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చింది టిడిపి పాలనలో.బీసీలను మోసం చేసింది జగన్… సంక్షేమ కార్యక్రమాలు లెక్కలు బిసిలకు ఇచ్చినట్టు చూపిస్తున్నారు. బిసిల రిజర్వేషన్లు 10 శాతం కట్ చేసింది జగన్. స్థానిక సంస్థల్లో 16,500 బీసీలను పదవులకి దూరం చేసింది జగన్.టిడిపి హయాంలో బిసిలకు ఎంత ఖర్చు చేశామో మేము చెబుతున్నాం. మీరు ఏం చేశారో చెప్పండి అని సవాల్ విసిరితే వైసిపి వాళ్ళు పారిపోతున్నారు. బిసిల పుట్టినిల్లు టిడిపి. మళ్లీ బిసిలకు న్యాయం జరగాలి అంటే టిడిపి అధికారంలోకి రావాలి. రాయలసీమ కు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్.మాట మార్చడం… మడమ తిప్పడం లో జగన్ దిట్ట.

సొంత బాబాయ్ ని చంపేసి చంద్రబాబు గారు చంపేశారు అంటూ నంటించాడు.ఒక కంటిని పొడుచుకుంటామా అంటూ యాక్టింగ్ చేసాడు జగన్ఆర్ఆర్ఆర్ లో జగన్ నటించి ఉంటే బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చేది. ఒక్కో సారి జగన్ ఢిల్లీ వెళ్ళడానికి కోటి ఖర్చు అవుతుంది. ప్రత్యేక హోదా గురించి అడగడు, కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం అడగడు.జగన్ కి సౌండ్ ఎక్కువ పని తక్కువ. కదిరి లో టిడిపిని గెలిపిస్తే అభివృద్ది అంటే ఏంటో చేసి చూపించే బాధ్యత నాది.

Leave a Reply