శ్రీపాద శ్రీనివాస్ కి మద్దూరి అన్నపూర్ణయ్య అవార్డు

Spread the love

-ఓలేటి దివాకర్, డా. బెజవాడ మహేంద్ర, ద్వారా పార్వతి సుందరి, డా. కృష్ణారావు, నెల్సన్ ఆంథోనీ లకు పురస్కారాలు

రాజమహేంద్రవరం, మార్చి20: దేశ స్వాతంత్య్రం కోసం, ప్రజల స్వేచ్ఛకోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప స్వాతంత్య్ర సమర యోధుడు మద్దూరి అన్నపూర్ణయ్య అని మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వర్తక ప్రముఖులు అశోక్ కుమార్ జైన్ నివాళుల ర్పించారు. కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ప్రజల స్వాతంత్య్రం కోసం ఉద్యమించిన అన్నపూర్ణయ్య వంటి త్యాగధనుడు చిరస్మరణీయుడని రౌతు పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎక్కువ సంవత్సరాలు జైలులో ఉన్న ఘనత మద్దూరి అన్నపూర్ణయ్యదని జైన్ చెప్పారు.

124వ జయంతి సందర్బంగా హోటల్ సూర్యలో మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎల్పీ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ శ్రీపాద లక్ష్మీనరసింహ నాగ శ్రీనివాస్ కి మద్దూరి అన్నపూర్ణయ్య స్మారక అవార్డుతో సత్కారం చేశారు. అలాగే రాజమండ్రి ప్రభుత్వ మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. బెజవాడ మహేంద్ర, మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతి సుందరి, విజయలక్ష్మి క్లినిక్ అధినేత డా. వేములవాడ వెంకట కృష్ణారావు, సీనియర్ జర్నలిస్ట్ ఓలేటి దివాకర్, కొవ్వూరు హోలీ ఏంజెల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ అండ్ కరస్పాండెంట్ పలియా వీడు నెల్సన్ ఆంథోనీ లకు మద్దూరి అన్నపూర్ణయ్య పురస్కారాలతో సత్కారం చేశారు.

అవార్డు, పురస్కార గ్రహీతలను రౌతు, జైన్, హిందూ సమాజం కార్యదర్శి న్యాపతి సుబ్బారావు, నటుడు గాయకుడు శ్రీపాద జిత్ మోహన్ మిత్రా, మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి , ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు, కోశాధికారి యర్రా కేదారేశ్వర రావు, న్యాయ సలహాదారు కూనపరెడ్డి శ్రీనివాస్, రుక్మాంగధరావు, జాన్సన్, కమిటీ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, తదితరులు సత్కరించారు. రిటైర్డ్ టీచర్ కె మహాలక్ష్మీరావు, వి జగపతి, వాకచర్ల కృష్ణ పెదిరెడ్ల శ్రీనివాస్, బుడ్డిగ రవి, బిఎ ఎన్ ఎల్ సాయిబాబా, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత జెండాపంజా రోడ్డులోని అన్నపూర్ణయ్య పార్కులోని అన్నపూర్ణయ్య విగ్రహానికి సమితి పక్షాన పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Leave a Reply