ఇవాళ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసారు. అయితే, మేనిఫెస్టోపై కేవలం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు మాత్రమే ఉండగా, ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంతో అధికార వైసీపీ దెప్పి పొడుస్తోంది. ఇది మాయా కూటమి అని అర్థమైపోయిందని సీఎం జగన్ వ్యాఖ్యానించగా, కూటమికి ఒక సభ్యుడు దూరం జరిగాడంటూ వైసీపీ నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు.
ఈ క్రమంలో మేనిఫెస్టోకు తమ మద్దతు ఉందని బీజేపీ స్పష్టంగా తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం టీడీపీ, జనసేన సంయుక్తంగా రూపొందించిన ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో-2024ను భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది అంటూ ఏపీ బీజేపీ ఓ ప్రకటన చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం టిడిపి, జనసేన సంయుక్తంగా రూపొందించిన “ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో – 2024”ను భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది.#TDPJSPBJPWinning pic.twitter.com/Ot38uAwDLP
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) April 30, 2024