Suryaa.co.in

Political News

కోతల సంక్షేమం

మీ ఇంట్లో టీవీ, ఫ్రిజ్ ఉండకూడదు.. మీ పిల్లల చదువుల కోసం వైఫై పెట్టిస్తారేమో… అదీ కుదరదు… ఎందుకంటే విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటితే అమ్మఒడి పథకం ప్రయోజనం అందదంట..
తమది సంక్షేమ ప్రభుత్వమని ఊదరగొట్టే జగన్ సర్కారు … అన్నిట్లో కోతలు విధిస్తున్నట్లే… సంక్షేమ ఫలాలపై కూడా రేషన్ పెడుతోందిప్పుడు…తాజాగా అమ్మఒడి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది … విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటితే అమ్మఒడి పథకం ప్రయోజనం అందదని పేర్కొంది…

300 యూనిట్ల లోపు విద్యుత్ వాడకం ఉన్న వారికే ఈ పథకం వర్తిస్తోందని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది…. ప్రభుత్వం నవరత్నాలు పేరుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అమ్మఒడి ఒకటి. ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏడాదికి 15వేల రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేస్తానని ప్రకటించింది..

దానికి సవాలక్ష నిబంధనలు పెట్టిన ప్రభుత్వం… ఇప్పుడు తాజాగా కరెంట్ రేషన్ విధించింది.అందరికీ కాకపోయినా… ప్రభుత్వ వాలంటీర్లు చెప్పిన వారికి ప్రస్తుతానికి ఈ పథకం వర్తిస్తోంది… ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏడాదికి 15వేల చొప్పున ప్రభుత్వం జమ చేస్తోంది.

ఇప్పటికే తెల్ల రేషన్ కార్డు, పల్లెల్లో నెలకు 10 వేల లోపు ఆదాయం, ఐటీ రిటర్న్స్ చెల్లించని వారు, ఫోర్ వీలర్ వాహనం లేనివారు … అంటూ రకరకాల రూల్స్ పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న ప్రభుత్వం… లేటెస్ట్‌గా కరెంట్ మీద పడింది…

లబ్ధిదారులు నెలకు 300 యూనిట్ల కంటే వినియోగిస్తే అమ్మఒడి పథకం వర్తించదని స్పష్టం చేసింది …. అంటే 300 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం ఉంటేనే నగదు అందుతుందంట.. నెలకు 300 యూనిట్ల కంటే వినియోగిస్తే అమ్మఒడి పథకం వర్తించదని స్పష్టం చేసింది.

అంతేకాదు గత ఏడాది నవంబర్ 8 నుంచి ఏప్రిల్ 30 వరకు హాజరు 75శాతం కంటే తక్కువగా ఉంటే డబ్బులు ఇవ్వరంట.. అలాగే కొత్త బియ్యం కార్డు, కొత్త జిల్లాల ఆధారంగా ఆధార్ కార్డులో జిల్లా పేరు మార్చుకోవాలంట.. ఆధార్.. బ్యాంక్ ఎకౌంట్ లింక్ చేసుకోవడంతో పాటు బ్యాంక్ ఎకౌంట్ యాక్టివ్ గా ఉందో లేదో చెక్ చేసుకోవాలంట…
మరి టీవీలు, ఫ్రిజ్‌లు ఉంటే కరెంటు మీటరు పరిగెడుతూనే ఉంటుంది.దాన్ని 300 యూనిట్లకు ఎలా ఆపాలో పేరెంట్స్ తెలుసుకోవాలేమో పాపం.

– దేవినేని చంద్రశేఖర్
( తెలుగుదేశం యువనేత)

LEAVE A RESPONSE