– జగనన్న ప్రభుత్వం రూ.600కోట్లు రూపాయలతో అభివృద్ది పనులు
– 51 లక్షల సిపి రోడ్డు నిర్మాణ పనులకు శుంకుస్థాపన
– దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు….
వైసీపీ ప్రభుత్వంలో రాజకీయలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత జగనన్నది అని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు పేర్కొన్నారు. బుధవారం నగరంలో 54వ డివిజన్ పరిధిలో రూ.35.00 లక్షల అంచనా వ్యయంతో గాంధీ బొమ్మ సెంటరు నుండి ఖాదర్ సెంటరు వరకు ఏర్పాటు చేయనున్న CC రోడ్డు నిర్మాణము పనులకు, రూ. 16.70 లక్షల అంచనా వ్యయంతో పాత కింగ్ హోటల్ ఎదురుగా వున్న ఫకీర్ తకియా రోడ్డు, గులామ్ అబ్బాస్ వీధిలలో CC రోడ్ల నిర్మాణమునకు “పాత కింగ్ హోటల్” వద్ద నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర పాలక సంస్థ అధికారులతో కలిసి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శంఖుస్ధాపన చేశారు.
మంత్రి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం హయంలో నగరంలో దాదాపు 600 కోట్లు రూపాయలతో రహదారులు, పార్క్లు, డ్రైన్లు మొదలగు అభివృద్ది పనులు చురుకుగా జరుగుతున్నాయన్నారు. గత ఐదు సంవత్సరాల్లో టీడీపీ. జనసేన, బీజేపీ మిత్రపక్షంలొ చేయని అభివృద్దని వైసీపీ ప్రభుత్వం జరగుతుంటే…. చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. తెలంగాణ వాసి హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడటం విడ్డురూంగా ఉందన్నారు. .మతాలు, కులాల మధ్య చిచ్చు పేట్టేందుకు రాజకీయలు చేసేందుకు విమర్శలు చేయడం తగదన్నారు.
మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రచారం కోసం రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. మేయర్‌గా ఐదు నెలల కాలంలో దాదాపు నగరంలో 20 శుంకుస్థాపనలు చేసి నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. జగనన్న హయంలో నగరాభివృద్ది శరవేగంగా జరుగుతుందన్నారు. విమర్శలతో కాలక్షేపం చేయకుండా రాజకీయ పార్టీలు అభివృద్ది సహకరించాలన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్సు కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్, కార్పొరేటర్లు అబ్దుల్ అకీమ్ అర్షద్, శీరంశెట్టి పూర్ణచంద్ర రావు, నగరపాలక సంస్థ అధనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.నారాయణమూర్తి మరియు ఇతర అధికారులు సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.