Suryaa.co.in

Andhra Pradesh

అవినీతి ఆరోపణలపై గతంలో సురేశ్ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు

• అంబేద్కర్ రాజ్యాంగంపై సురేశ్ కు ఏమాత్రం గౌరవమున్నా, తనకు తానే పదవినుంచి వైదొలగాలి.
• నిన్న సుప్రీంకోర్టు ఆయన అవినీతి, అక్రమాస్తులపై స్పందించిన నేపత్యంలో మంత్రి తక్షణమే తనపదవికి రాజీనామాచేయాలి.
• ప్రతి దానికి సీబీసీఐడీ విచారణలు జరిపించే ముఖ్యమంత్రి జగన్, మంత్రి ఆయన భార్య అవినీతిపై తక్షణమే విచారణ జరిపించాలి.
• సురేశ్ అవినీతి గుట్లుమట్లు తేలాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గం.
• సురేశ్ లాంటివ్యక్తులు మంత్రిగా ఉంటే భావిభారత పౌరులుగా మారాల్సిన విద్యార్థులు దారితప్పే ప్రమాదముంది.
* టీడీపీ శాసనసభ్యులు డోలా బాలవీరాంజనేయస్వామి
రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్, వారి సతీమణి విజయలక్ష్మి అక్రమఆస్తులు కలిగిఉన్నారని సీబీఐ గతంలో చెప్పిందని, దానిపై మంత్రి హైకోర్టులో స్టే తెచ్చుకున్నారని, కానీ నిన్న సుప్రీంకోర్టు వారు అక్రమాస్తులు కలిగిఉన్నందున వారిని విచారించి చర్యలు తీసుకోవాలని తీర్పునిచ్చిందని, టీడీపీ శాసనసభ్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. గురువారం ఆయన తననివాసం నుంచి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.
సుప్రీం తీర్పునేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ తక్షణమే తన మంత్రిపదవికి రాజీనామా చేయాలని, భావిభారత పౌరులను తీర్చిదిద్దే విద్యాశాఖలో ఆయన కొనసాగడానికి వీల్లేదని టీడీపీ ఎమ్మెల్యే తేల్చి చె ప్పారు. ముఖ్యమంత్రి మొదలు కేబినెట్ లోని సగంమందిపై అవినీతి ఆరోపణలున్నాయని, ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తనప్రభుత్వాన్ని రద్దుచేసి తక్షణమే ఎన్నికలకు వెళ్లాలన్నారు. అవినీతి, అక్రమార్జనపై దృష్టిపెట్టిన ఆదిమూలపు సురేశ్ తనసొంతజిల్లాఅభివృద్ధికోసం ఒక్క పనికూడా చేయలేదన్నారు.
మార్కాపురంలో పాఠశాల పైకప్పు పెచ్చు లూడి విద్యార్థి మృతిచెందితే, మంత్రి పట్టించుకోలేదన్నారు. ఆదిమూల పు సురేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని వెలిగొండప్రాజెక్ట్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారితే సురేశ్ ఏనాడూ సదరు ప్రాజెక్ట్ గురించి ముఖ్యమంత్రితోగానీ, కేంద్రంతో గానీ మాట్లాడింది లేదన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంపై సురేశ్ కు ఏమాత్రం గౌరవమున్నా, తక్షణమే ఆయన తనపదవికి రాజీనామాచేయాలని వీరాంజనేయస్వామి డిమాండ్ చేశారు.
సురేశ్ లాంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉంటే, విద్యార్థులు కూడా గాడితప్పుతారన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంపై సురేశ్ కు నమ్మకంలేదని గతంలో ఆయనచేసిన వ్యాఖ్యలను బట్టే అర్థమవుతోంద న్నారు. చిన్నారుల భవిష్యత్ కోసం సురేశ్ మంచినిర్ణయం తీసుకుంటే, ప్రజలందరూ సంతోషిస్తారన్నారు. సర్వోన్నతన్యాయస్థానం ఆదేశాలతో ముఖ్యమంత్రి తక్షణమే ఆదిమూలపు సురేశ్ పై సీబీసీఐడీ విచారణకు ఆదేశించాలన్నారు. ఆదిమూలపు సురేశ్ అవినీతి బాగోతంపై సీబీఐ నే స్వయంగా విచారణజరపాలని స్వామి డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE