Suryaa.co.in

Andhra Pradesh

బొగ్గు ఉత్పత్తి సంస్థలకు సొమ్ములు ఎగ్గొట్టడమే కొరతకు కారణం

– ప్రభుత్వమే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం సృష్టించి, ఆ నెపాన్ని టీడీపీపై వేయాలని చూస్తోంది.
– వాస్తవాలేమిటో తెలియచేస్తూ ప్రభుత్వం తక్షణమే విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, సరఫరాపై శ్వేతపత్రం విడుదల చేయాలి
– రాష్ట్రంలో బొగ్గునిల్వలు నిండుకోవడానికి కారణం జగన్ ప్రభుత్వం
– విద్యుత్ వాడకంపెరిగిందన్న సర్కారు మాటలు పచ్చి అబద్ధాలు
– 2018-19లో రాష్ట్రంలో 63,311 మిలియన్ యూనిట్ల వాడకముంటే, 2020-21లో 59,911 మిలియన్ యూనిట్ల వాడకంఉంది
– జగన్మోహన్ రెడ్డి , ఆయన బంధువుల విద్యుత్ ఉత్పత్తిసంస్థలనుంచి విద్యుత్ కొనడానికే, విద్యుత్ సంక్షోభం సృష్టించింది.
– టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్
రాష్ట్రప్రజలను విద్యుత్ సంక్షోభం వెంటాడుతోందని, అసలు ఈ పరిస్థితి ఒక్కఆంధ్రప్రదేశ్ కే వచ్చిందా…లేక దేశమంతా ఉందా.. కరోనా మాదిరే దేశమంతా విద్యుత్ కోతలున్నాయని ఏపీ ప్రభు త్వం ప్రజలనునమ్మించి, వంచించే ప్రయత్నంచేస్తోందని టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభసభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
రాష్ట్రంలోని విద్యుత్ సంక్షోభంపై ప్రభుత్వం చేస్తున్న అసత్యప్రచారా లు ఏమిటో, అసలువాస్తవాలేమిటో ప్రజలకుతెలియాలి. రాష్ట్రంలో రెండు ప్రధాన విద్యుత్ సాధనాలుంటే వాటిలో థర్మల్ పవర్ ఒకటి. థర్మల్ పవర్ పై ప్రభుత్వం ఏంచెబుతోందంటే, రాష్ట్రంలో బొగ్గు నిల్వలు లేవని, కేంద్రం సరఫరాచేయడంలేదని, కాబట్టే ప్రజలకు నాణ్యమైన కరెంట్ ఇవ్వడంకోసం, విద్యుత్ ను బయటినుంచి అధికధరకు కొంటున్నామని చెబుతోంది. అసలు వాస్తవాలు మాత్రం అందుకు పూర్తివిరుధ్దంగా ఉన్నాయి. థర్మల్ పవర్ పై బొగ్గుకొరత, కేంద్రం సరఫరాచేయడం లేదంటూ అవాస్తవాలు చెబుతోంది. రాష్ట్రంలో బొగ్గునిల్వలు లేనందునే అధికధరకు విద్యుత్ కొంటున్నామని చెప్పుకొస్తోంది. 2021 సెప్టెంబర్ 2న కేంద్రఇంధనశాఖ కార్యదర్శి రాష్ట్రఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ కు ఒకలేఖరాసింది.
ఆ లేఖలో ఏపీప్రభుత్వం తక్షణమే బొగ్గుఉత్పత్తి సంస్థలకుచెల్లించాల్సిన బకాయిలుచెల్లించి, బొగ్గునిల్వలు పెంచుకోవాలనిసూచించింది. బొగ్గు సంస్థలకు బాకీలు చెల్లించకుండా, బొగ్గు దిగుమతి చేసుకోవాలనే ప్రయత్నాలు మానుకోవాలని కేంద్రం స్పష్టంగా చెప్పింది. మరి నిన్నో, మొన్నో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నిధులకొరత లేదం టున్నారు. అలాంటప్పుడు కేంద్రంహెచ్చరించినా ఏపీప్రభుత్వం బొగ్గుఉత్పత్తికంపెనీలకు ఎందుకు బకాయిలు చె ల్లించలేదు? దానివల్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంలో నిలిచిపోయింది వాస్తవంకాదా?
జగన్మోహన్ రెడ్డి భార్య భారతి డైరెక్టర్ గా ఉన్న సండూర్ పవర్ నుంచి విద్యుత్ కొనడానికే ప్రభుత్వం రాష్ట్రంలో కృత్రిమవిద్యుత్ కొరత సృష్టించింది. సండూర్ పవర్ తోపాటు, జగన్మోహన్ రెడ్డి బంధువులకు చెందిన వివిధరకాల కంపెనీలు సుమారు 5వేల మెగావాట్లవరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. వాటికి లాభాలు తెచ్చిపెట్టడంకోసమే ఏపీలో విద్యుత్ కొరత సృష్టించారని ఆరోపణలున్నాయి. ఇది నిజమో కాదో, ప్రభుత్వమే స్పష్టంచేయాలి. ఎందుకంటే బొగ్గునిల్వలు, విద్యుత్ డిమాండ్ పెరిగిందన్న రెండుకారణాలు తప్పని తేలిపోయింది.
సింగరేణి, మహానది కోల్ ఫీల్డ్స్ కు ప్రభుత్వం రూ.4,500కోట్లవరకు బకాయిపడింది. అవి చెల్లించకుండా, రాష్ట్రం లో బొగ్గునిల్వలు లేవంటే, ఎక్కడినుంచి వస్తాయని తాముప్రశ్ని స్తున్నాం. బొగ్గుసరఫరా సంస్థలకు బకాయిలుచెల్లించరు.. కానీ విద్యుత్ ఛార్జీలపేరుతో ప్రజలనుంచి ముక్కుపిండివసూలుచేస్తు న్నారు. ఇప్పటివరకు 6సార్లు విద్యుత్ ఛార్జీలుపెంచిన ప్రభుత్వం రూ.12వేలకోట్ల భారాన్ని ప్రజలపై వేసింది.
22వేలకోట్లవరకు విద్యుత్ బకాయిలు ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించకుండా ఎగనామం పెట్టింది.
ఈ విధంగా అనేక అంశాలు ప్రభుత్వం సృష్టించిన కృత్రిమవిద్యుత్ కొరతకు ప్రబలతార్కాణాలుగా కనిపి స్తున్నాయి. ఏది వాస్తవమో తెలియాలంటే విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, డిమాండ్ పై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి. గతంలో ఆర్థికసంక్షోభంపై కూడా ప్రభుత్వాన్ని శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశాము. కానీ పాలకులు ఇప్పటివరకు ఆపనిచేయలేదు.
థర్మల్ విద్యుత్ఉత్పత్తి సామర్థ్యం రాష్ట్రంలో 10,400 మెగావాట్లు ఉండగా, కేవలం 3వేల మెగావాట్లుమాత్రమే ఉత్పత్తి అవుతోంది. అందుకుకారణమేంటో ప్రభుత్వం ప్రజలకు చెప్పదా? పవర్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం తీసుకొచ్చిన రూ.25వేలకోట్ల అప్పులో రూ.6వేలకోట్లను దారిమళ్లించింది. అవి ఏంచేసిందంటే సమాధానంచెప్పరు. ఇదేమిటని పౌరులు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వారిపై కేసులుపెడతామంటున్నారు. ఇక విద్యుత్ వాడకం పెరిగిందని, విద్యుత్ డిమాండ్ 20శాతం పెరిగిందని కూడా ప్రభుత్వం అబద్ధాలుచెబుతోంది. దానిపై కూడా ఏఏ సంవత్సరంలో ఎంత వినియోగముంది. ఇప్పుడుఎంతఉందో వివరిస్తూ, ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలచేయాలి.
రాష్ట్రంలో ఎక్కడా పరిశ్రమలు లేవు.. పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ప్రజలుకూడా విద్యుత్ వినియోగం తగ్గించారు. 2018-19లో 63వేల311 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకముంటే, 2019-20లో 62వేల790 మిలియన్ యూనిట్ల వాడకం ఉంది. 2020-21లో 59,911 మిలియన్ యూనిట్ల వాడకంఉంది. 2021-22 ఆగస్ట్ చివరినాటికి లెక్కేస్తే, 28,550 మిలియన్ యూనిట్ల వాడకం ఉంది. ఇక ఎక్కడ విద్యుత్ వినియోగం పెరిగిందో ప్రభుత్వమే చెప్పాలి. రాష్ట్రప్రభుత్వ వైఫల్యంతో ఏర్పడిన విద్యుత్ కొరతను, వినియోగం కారణంగా ఏర్పడినకొరతగా ప్రభుత్వం అవాస్తవం చెబుతోంది.
ఏ ప్రభుత్వంలో విద్యుత్ వాడకం అధికంగా ఉందో గణాంకాలే స్పష్టంచేస్తుంటే, ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోంది. చంద్రబాబు హాయాంలో రాష్ట్రంలో మిగులువిద్యుత్ ఉంటే, ఇప్పుడు కొరత ఎందుకుందో పాలకులే ఆలోచించాలి. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా, ఇంకా టీడీపీపై నిందలేస్తేఎలా? 1947 నుంచి 1994 వరకు ఏపీలో విద్యుత్ఉత్పత్తి సామర్థ్యం 5,630 మెగాయూనిట్లు, 1994 నుంచి 2004 వరకు దాన్ని 10వేల మెగా యూనిట్లకు పెంచింది చంద్రబాబునాయుడు. చంద్రబాబు హయాంలో నెలకొల్పిన సోలార్, పవన విద్యుత్ సంస్థల విద్యుత్ఉత్పత్తి ఒప్పందాలను ఈ ప్రభుత్వం రద్దు చేసింది.
దాని పర్యవసానమే రాష్ట్రంలో నిలిచిపోయిన విద్యుత్ఉత్పత్తి. కరెంట్ కొరత ఉందని, విద్యుత్ వినియోగం తగ్గించుకోవాలని సజ్జల చెబితే, ప్రభుత్వం విద్యుత్ కోతలు లేవనిచెబుతోంది. కేసులుపెడతామని బెదిరించడం ప్రభుత్వానికి ఫ్యాషన్ అయిపోయింది. విద్యుత్ పై ప్రతిపక్షాలు, ప్రసారమాధ్యమాలు దుష్ప్రచారం చేస్తున్నాయని చెబుతున్న ప్రభుత్వం, మరి విద్యుత్ పొదుపుగా వాడండి, కరెంట్ కోతలు ఉన్నాయని సజ్జల చెప్పినదానిపై ఏంచర్యలు తీసుకుం టుంది? అది ముమ్మాటికీ పాలనా వైఫల్యంకిందకే వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే గ్రామాల్లో అనధికారికంగా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నది నిజం కాదా? కొత్తఇసుక పాలసీ, మద్యం పాలసీతో ప్రభుత్వం ఎలాగైతే దోపిడీచేస్తోందో, విద్యుత్ రంగాన్ని కూడా తమ ఆదాయవనరుగా మార్చుకుంది.
అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డికిచెందిన సండూర్ పవర్ కంపెనీ నుంచి అధిక ధరకు విద్యుత్ కొంటున్నారు. రాష్ట్రంలోని థర్మల్, పవన, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు బకాయిలు చెల్లించకుండా, వాటిని మూతపడేలా చేయడమెందుకు….. బయటనుంచి అధికధరకు విద్యుత్ కొనడమెందుకు? ఇదంతా ప్రభుత్వమే కావాలని సృష్టించిన విద్యుత్ సంక్షోభమని తేలిపోయింది. తాను లేవనెత్తిన అంశాల్లో అవాస్తవాలుంటే, ప్రభుత్వం నన్నునిలదీయవచ్చు. లేదంటే ప్రభుత్వంతక్షణమే కృత్రిమ విద్యుత్ కొరతను అధిగమించి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలి.

LEAVE A RESPONSE