Home » మాదకద్రవ్యాల ముడిపదార్థాలసాగుపై కేంద్ర నిఘాసంస్థలు దృష్టి సారించాలి

మాదకద్రవ్యాల ముడిపదార్థాలసాగుపై కేంద్ర నిఘాసంస్థలు దృష్టి సారించాలి

– ప్రభుత్వమే యువతను మాదకద్రవ్యాలకు బానిసల్నిచేస్తూ, తమను ప్రశ్నించే గొంతులు మూగబోయేలా చేస్తోంది
– చిత్తూరుజిల్లాలో మంత్రి అనుచరులే మాదకద్రవ్యాల ముడి పదార్థాలు సాగు చేస్తున్నారు
– మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమరవాణా దేశస్థాయిలో విస్తృతంగా సాగుతోందని, అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ ను మాదకద్రవ్యాలకు నిలయంగా మార్చారని, గంజాయి ఇతరమాదకద్రవ్యాలకు యువతను బానిసల్నిచేస్తూ, ప్రభుత్వమే ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని, వేలకోట్లసంపాదనే ధ్యేయంగా సిగ్గులేకుండా అక్రమార్జనే ధ్యేయంగా ముందుకెళుతోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఈ ప్రభుత్వంలో ఒక్కవిశాఖ మన్యంలోనే ఏటా, రూ.8వేలకోట్ల విలువైన గంజాయిసాగవుతోందని, అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ రూ.25వేలకోట్లవరకు ఉంటుందన్నారు. ఉత్తరాంధ్ర ముఖ్య మంత్రిగా పిలువబడే విజయసాయిరెడ్డి, ఆయనఅనుచరులే ఈ గంజాయి సాగు, అక్రమరవాణాలోకీలకంగా వ్యవహరిస్తున్నారనే సమాచారం ఉందన్నారు. అలానే చిత్తూరుజిల్లాలోని మదనపల్లె, పుంగనూరు ప్రాంతాల్లో ఓపీఎం సాగువిచ్చలవిడిగా జరుగుతోంద న్నారు. కొకైన్, మార్ఫిన్,హెరాయిన్ ల తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలసాగు ఆయాప్రాంతాల్లో సాగవుతోందని, ఈ అంశా న్నిసాక్షిపత్రికలోనే సాక్ష్యాలతోసహా పేర్కొన్నారన్నారు.
అక్కడ జరుగుతున్న ముడిపదార్థాలసాగులో అధికారపార్టీనేతల పాత్ర, ప్రమేయంలేవని చెబితే ఎవరైనా నమ్ముతారా అని మాజీమంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏదిజరిగినా, ఈ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. గంజాయిసాగవుతున్న ప్రాంతాల్లో తెలంగాణ పోలీసులు వచ్చి సోదాలుజరిపారంటే, పరిస్థితిఎంతలా దిగజారిందో ప్రభుత్వంఆలోచించాలన్నారు. రాష్ట్రంలోని గంజాయిమాఫియాను, పక్కరాష్ట్రపోలీసులు పట్టుకున్నారంటే, ఈ సర్కారు సిగ్గుతో తలదించుకుంటే మంచిదని ఆనంద్ బాబు హితవుపలికారు. ఏపీ లోని ఎక్సైజ్ విభాగాన్నినిర్వర్యీంచేసిన ప్రభుత్వం, అక్రమార్జనే ధ్యేయంగా పేట్రేగిపోతోందన్నారు.
ఎన్ఐఏ విభాగం వారు విజయ వాడలో సోదాలుజరపడం, శ్రీవారి తలనీలాలుఅక్రమరవాణా అవుతుంటే ఎక్కడో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ విభాగంపట్టుకోవడం జరిగిందన్నారు. వేరేరాష్ట్రాల పోలీసులు, కేంద్రప్రభుత్వ విభాగాలు పట్టుకునేవరకు ఏపీ పోలీస్ శాఖఏంచేస్తోందని మాజీమంత్రి నిలదీ శారు. ఇక్కడిప్రభుత్వ అండదండలు ఉండబట్టే, ఏపీ పోలీస్ శాఖ చేష్టలుడిగిచూస్తోందన్నారు. రాష్ట్రయువత మాదకద్రవ్యాల బారిన పడి నిర్యీర్యమవుతున్నా, ప్రభుత్వం, పోలీస్ శాఖ పట్టించుకోకపో వడం బాధాకరమన్నారు. మాదకద్రవ్యాల చలామణీ, గంజాయి సాగు-రవాణాకి ఆంధ్రప్రదేశ్ దేశానికే అడ్డాగా మారిన, పాలకులకు చీమకుట్టినట్టయినా లేదన్నారు.
తెలంగాణ పోలీసులు నాలుగురో జులుపాటు ఇక్కడి ఏజెన్సీప్రాంతాల్లోఉండి, గంజాయి ముఠాపై దాడులు చేస్తే, ఇక్కడిరక్షణ విభాగం ఏంచేస్తుందో తెలియడంలేద న్నారు. పట్టుబడిన గంజాయి వ్యవహారాన్ని తెలివిగా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకుఆపాదించి, చేతులుదులుపుకోవాలని చూస్తున్నారని, అది ప్రభుత్వానికే ప్రమాదమని తెలుసుకుంటే మంచిదని ఆనంద్ బాబు హితవుపలికారు. ప్రభుత్వం తనస్వార్థం కోసం, అక్రమార్జనకోసం యువతను నాశనంచేయడం రాష్ట్ర భవిష్య త్ కు ఎంతమాత్రం క్షేమంకాదన్నారు. యువతలో నిస్సత్తువ ఆవరిస్తే, తమనుప్రశ్నించలేరన్న దుర్మార్గపు ఆలోచనతోనే ప్రభు త్వం ఈవిధమైన ఆకృత్యాలకుపాల్పడుతోందనే అనుమానం కలు గుతోందన్నారు.
రాష్ట్రం కేంద్రంగా సాగవుతున్న గంజాయిసాగు, ఇతరముడిపదార్థాలసాగుపై కేంద్రనిఘావిభాగాలు దృష్టిసారించాలని, మెరుపుదాడులునిర్వహించి, అసలునిందితులను శిక్షించాలని ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. చిత్తూరుజిల్లాలో మంత్రి అనుచరులే మాదకద్రవ్యాల ముడిపదార్థాల సాగులో మునిగి తేలుతున్నారన్నారు. ఏపీ పోలీస్ శాఖ పూర్తిగా విఫలమైన నేపథ్యంలో, కేంద్ర నిఘావిభాగాలు, మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థలే రంగంలోకి దిగాలని మాజీమంత్రి డిమాండ్ చేశారు.

Leave a Reply