మరింత దోచుకునేందుకే జగన్ సిద్ధం

వైసీపీ-టీడీపీని నమ్మవద్దు

బీసీ తయువజన పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్

బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మీడియా సమావేశంలో సంచలన విషయాలు వెల్లడించారు. 2019 లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడి రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. ఇప్పుడు మరొక్క సారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారన్నారు. రాష్ట్రంలో ఇంకా మిగిలిపోయి ఉన్న వాటిని పూర్తిగా దోపిడీ చేయడానికి నేను సిద్దం అంటూ ప్రజలను మభ్య పెట్టేందుకు బయలుదేరారని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు గానీ రాష్ట్ర విభజన తర్వాత 2014 నుండి 2019 వరకూ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క వర్గానికి మంచి చేయకపోగా, ప్రాజెక్టుల పేరు చెప్పి, అనేక రకాలుగా అవినీతి చేశారన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రెండు పార్టీ ల ప్రభుత్వాలు రాజధాని నిర్మించడంలో గానీ, పోలవరం, వెలుగొండ ప్రాజెక్టు, లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోగా, రాష్ట్రాన్ని పూర్తిగా దోపిడీ చేశారని మండిపడ్డారు.

రాష్ట్రానికి గానీ, రైతాంగానికి, యువతకు, మహిళలకు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అయితే చేయలేదు గానీ అధికారాన్ని చెరో అయిదేళ్లు పంచుకున్నారని అన్నారు. చెరో అయిదేళ్లు అధికారాన్ని అనుభవించారు కానీ రాష్ట్రానికి, ప్రజలకు ఏ మేలు చేయలేదని అన్నారు. మళ్లీ ఈ రెండు పార్టీలు ప్రజల్లోకి వస్తున్నాయని విమర్శించారు. సిద్దం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భవిష్యత్తుకు భరోసా అంటూ తెలుగుదేశం ఇంకా రకరకాల పేర్లతో ప్రజల ముందుకు వస్తున్నాయని అన్నారు.

ముఖ్యంగా చిత్తూరు జిల్లా విషయానికి తీసుకుంటే మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య రాజకీయ వైరం ఉంది అనేది, రాజకీయంగా ప్రత్యర్ధులు అనేది ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నారు. వీళ్లు ప్రజల ముందు వచ్చి మాట్లాడే మాటలు, ఆరోపణలు అలానే ఉంటాయి కాబట్టి నిజంగా వీరు రాజకీయ ప్రత్యర్ధులే అని నమ్మే పరిస్థితి ఉంటుందని అన్నారు.

ఈ పార్టీల వికృత రాజకీయ క్రీడల్లో సామాన్య ప్రజలు నష్టపోతున్నారన్నారు. ఆయా పార్టీల్లోని అమాయక కార్యకర్తలు కేసులు పెట్టించుకుని జైళ్లకు వెళుతూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. చిత్తూరు జిల్లాలో మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగానూ ఈ రెండు పార్టీలు పదేళ్లలో పది లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు.

అందుకే ఈ రెండు పార్టీల అవినీతిని అరికట్డడానికి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కోసం ఏర్పడి మీ ముందుకు వస్తున్న భారత చైతన్య యువజన పార్టీని ఆదరించాలని రామచంద్ర యాదవ్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply